Divorce jeans in women

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

DIVORCE JEANS IN WOMENS.gif

Posted: 02/27/2012 03:29 PM IST
Divorce jeans in women

వైవాహిక జీవితం సాఫీగా సాగాలంటే భార్యా భర్తలిద్దరూ అన్యోన్యంగా, ఎలాంటి అరమరికలు లేకుండా ఉండాల్సిన అవసరముందన్నది జగమెరిగిన సత్యం. అయితే, నేటి సమాజంలో చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు పడి విడాకుల కోసం కోర్టులను ఆశ్రయిస్తున్న జంటల సంఖ్య పెరుగుతోంది. వారిలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా విడాకులు కావాలని కోరుకుంటున్నారట! అందుకు స్త్రీలలో ఉండే విడాకుల జన్యువు(డైవోర్స్ జీన్) కారణమని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆ జన్యువును మొదటిసారిగా గుర్తించినట్టు అధ్యయనాన్ని జరిపిన స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్ పరిశోధకులు తెలిపారు. ఆ జన్యువు కారణంగా జీవిత భాగస్వామితో కలసి ఉండటానికి కొందరు మహిళలు విముఖత చూపుతారన్నారు. విడాకుల జన్యువే కాస్త మార్పు చెందిన స్త్రీలలో వివాహం చేసుకోవాలనే ఆలోచన ఉండదని పేర్కొన్నారు. ఎదుటి వ్యక్తిపై ప్రేమ, ఆప్యాయతలు కలగడానికి కారణమైన ఆక్సిటోసిన్ హార్మోన్‌పై ఈ జన్యువు ప్రభావం చూపుతోందని చెప్పారు. దానివల్ల మహిళలు తమ జీవిత భాగస్వామి, పిల్లలు, కుటుంబ సభ్యుల పట్ల ప్రేమానురాగాలు చూప లేకపోతారన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fire accident in east godavari dist village
Fire accident in lyricist chandrabose house  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles