Special powers to nctc objected

special powers to nctc objected, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

special powers to nctc objected, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

sword-on-head-1-2.gif

Posted: 02/18/2012 10:26 AM IST
Special powers to nctc objected

chandrababuకేంద్ర హోం శాఖ నుంచి తాజాగా వెలువడ్డ ఎన్ సి టి సి అధికారాల మీద కాంగ్రేసేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల నుండి వ్యతిరేకత వచ్చింది. నిఘా సంస్థ (ఇంటెలిజెన్స బ్యూరో) లో భాగమైన జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం (నేషనల్ కౌంటర్ టెర్రరిజమ్ సెంటర్) కి కట్టబెడుతున్న అధికారాలు దేశంలోని ఫెడరల్ విధానానికి వ్యతిరేకమని అంటున్నవారిలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోది, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఉన్నారు. వారికి తోడుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన విపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా అందుకు వ్యతిరేకతను చూపిస్తూ, ప్రధానమంత్రికి లేఖ రాసారు.

ఎన్ సి టి సి డైరెక్టర్ కి అసాంఘిక చర్యలు (వ్యతిరేక) చట్టం 1967 లోని సెక్షన్ 2 ఇ ప్రకారం, ఆయన కాని ఆయన దగ్గర పనిచేసే అధికారులు కాని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన ఇవ్వకుండానే, వారి అనుమతి కోరకుండానే, అరెస్ట్ లు చెయ్యటం కానీ, సోదాలు నిర్వహించటం కానీ చేసే హక్కులు ఇవ్వటం మీద కాంగ్రెస్ పాలనలో లేని రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. దానికి చంద్రబాబు కూడా మద్దతుగా నిలిచారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న బంధం మీద ప్రభావం చూపే ఇటువంటి చర్యలో ఇంత పెద్ద ఎత్తున అధికారాలను ఇచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వాలను కానీ నాయకులను కానీ సంప్రదించకపోవటాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి ఇది దారితీస్తుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారంతో నడిచే ఫెడరల్ విధానానికి నష్టం కలిగిస్తుంది కాబట్టి, హోం మంత్రి ఈ ఆర్డర్ ని వెంటనే ఉపసంహరించుకోవలసిందని చంద్రబాబు కోరుతూ, తెలుగు దేశం పార్టీ భారత దేశ ఫెడరల్ సిస్టమ్ పరిరక్షణకు ఎప్పుడూ ముందుంటుందని అన్నారు.

ఎవరూ బయటకు చెప్పని భయమేమిటంటే, ఈ అధికారాలతో కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ ని తలపించే విధంగా వ్యవహరించటానికి దోహదం చేస్తుంది. వచ్చే ఎన్నికల ముందు ఎవరూ తలెత్తకుండా వారి తలల మీద కత్తిలా ఇది పనిచేసే అవకాశం చాలా ఉంది. ఇప్పటికే సిబిఐ, ఇడి లతో కొరడా ఝుళిపిస్తున్న కేంద్రం ఈ విశేష అధికారాలతో కాంగ్రెసేతర పార్టీల పాలనలోని రాష్ట్రాల నాయకులను భయం అంచున ఉంచటానికి వినియోగిస్తుందేమోనని వారి అసలు భయం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Global copy right protesters hack us websites
Women demanding mobile phones but not toilets  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles