Sunitha Krishnan the saviour of sex slavery ఆ బాసినస బతుకుల్లో ప్రజ్వలించిన ఆశాదీపం సునితా కృష్ణన్

Sunitha krishnan the saviour of sex slavery

Sunitha Krishnan rape survivor, Sunitha Krishnan sex slaves saviour, Sunitha Krishnan prajwala, Sunitha Krishnan rehabilitation, Sunitha Krishnan padma shri awardee, Sunitha Krishnan.

Sunitha Krishnan works in the areas of anti-human trafficking and social policy. Her organization, Prajwala shelters rescued women and children and set up one of the largest rehabilitation homes in the country.

ఆ బాసినస బతుకుల్లో ప్రజ్వలించిన ఆశాదీపం సునితా కృష్ణన్

Posted: 04/14/2018 08:24 PM IST
Sunitha krishnan the saviour of sex slavery

డా. సునీతా కృష్ణన్ ఒక ప్రముఖ సామాజిక కార్యకర్త. బాలికలు అక్రమ రావాణ చేసేవారి పాలిట సింహస్వప్నం. మహిళలపై అఘాయిత్యాలు, బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దిగి.. కూరుకుపోయిన అమాయక బాలికలను, యువతులను రక్షించి.. వారికి రక్షణగా నిలుస్తున్న ఓ తల్లి. ప్రజ్వల అనే సేవాసంస్థ స్థాపించి అందులో సెక్స్ రొంపి నుంచి కాపాడిన బాధితురాళ్లకు జీవితాల్ని ప్రసాదించడంతో పాటు వారు స్వతహాగా జీవించడాని, గౌరవంగా బ్రతకడానికి ఎన్నో కార్యక్రమాలు చేపటుతున్నారు.

బెంగుళూరులో జన్మించిన సునితా స్వతహాగా కేరళ రాష్ట్రవాసి. ఆమె తల్లిదండ్రులు రాజు కృష్ణన్, నళిని కృష్ణన్ లు.. సునితా చిన్నతనంలోనే కేరళ నుంచి వచ్చి బెంగుళూరులో స్థిరపడ్డారు. ఉద్యోగ విషయంలో స్థానచలనం తప్పలేదు. సునితా తండ్రి రాజు కృ్ష్ణన్ సర్వే ఆఫ్ ఇండియా (ప్రభుత్వ రంగ సంస్థ)లో పనిచేసేవాడు. భారత దేశానికంతా మ్యాపులు గీయడం పనిని చేసే ఈ సంస్థలో ఉద్యోగరీత్యా వారు దేశంలోని అనేక ప్రాంతాలకు బదిలీ అయ్యారు. చివరకు బెంగళూరులో సెటిల్ అయ్యారు.

ఆమె 8 సంవత్సరాల వయసులోనే మొదటి సారిగా మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు నాట్యం నేర్పడంతో సమాజ సేవ వైపు ఆకర్షితురాలైంది. పన్నెండేళ్ళ వయసొచ్చేసరికి మురికివాడల్లో పాఠశాలలు ప్రారంభించింది. పదిహేనేళ్ళ వయసులో దళితుల పక్షాన ఒక ఉద్యమంలో పాల్గొనడంతో ఆమెను ఎనిమిది మంది దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. ఆ సంఘటనే ఆమెలోని ప్రశ్నించే తత్వాన్ని మరింత పెంచింది. అంతేకాదు తనలా ఎవరూ బాధపడకూడదన్న సామాజిక సృహకు నాంది పలికింది.

సునీత బెంగుళూరు, మరియు భూటాన్లో కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదివింది. బెంగుళూరులోని సెయింట్ జాన్స్ కళాశాలలో పర్యావరణ శాస్త్రం నుంచి బ్యాచిలర్ పట్టా పుచ్చుకున్న తర్వాత మంగుళూరులోని రోషిణి నిలయ నుంచి మాస్టర్స్ తర్వాత సామాజిక సేవా రంగంలో డాక్టరేటు సంపాదించారు. పరిశోధనలో భాగంగా ఫీల్డు వర్కు చేయడానికి వ్యభిచారుల జీవితాలను పరిశీలించాలనుకున్నారు. అక్కడే అమె సామాజిక కార్యకర్తగా మారడానికి పునాది పడింది.

1996 లో బెంగుళూరులో జరగబోతున్న మిస్ వరల్డ్ పోటీలకు వ్యతిరేకంగా ప్రదర్శనలో పాల్గొనింది. దాంతో ఆమెను మరో డజను మంది కార్యకర్తలతో సహా జైలులో వేశారు. ఆ ఉద్యమానికి ఆమె నేతృత్వం వహిస్తుండటంతో ఆమెను రెండు నెలల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. అన్ని రోజులు ఆమె తల్లిదండ్రులు ఆమెను చూడటానికి కూడా రాలేదు. రెండు నెలల తర్వాత ఆమె జైలు నుంచి విడుదలైంది. ఆమె తనకు తల్లిదండ్రుల సహాయం లేదని తెలుసుకొని హైదరాబాదుకు వెళ్ళాలని నిర్ణయించుకుంది.

ఒకసారి ముంబైలో గ్లోబలైజేషన్ మీద నిర్వహించిన సదస్సులో సునీతకు బ్రదర్ వర్ఘీస్ తో పరిచయం అయ్యింది. ఆయన హైదరాబాదులో మురికివాడల్లో ప్రజలకు సేవ చేయడానికి పీపుల్స్ ఇనిషియేటివ్ నెట్వర్క్ (పిన్) అనే సంస్థను ప్రారంభించాలని అనుకున్నాడు. దీంతో హైదరాబాద్ చేరుకున్న ఆమె అక్కడ పీపుల్స్ ఇనిషియేటివ్ నెట్వర్క్ శాఖలో యువతులను ఉత్తేజ పరిచే పనిచేయడానికి నిశ్చయించుకుంది. అప్పటి ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళనలో భాగంగా వారి ఇళ్ళను కూల్చాలని నిర్ణయించింది.

దీంతో ఆమె పీపుల్స్ ఇనిషియేటివ్ నెట్వర్క్ తరఫున అందుకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించింది. దాంతో ప్రభుత్వం ఆ పథకానికి స్వస్తి చెప్పింది. అక్కడ ఉన్నప్పుడే ఆమెకు బ్రదర్ జోస్ వెట్టికాటిల్ తో పరిచయమైంది. ఆయన సెయింట్ గేబ్రియల్ కు చెందిన మాంట్ ఫోర్ట్ బ్రదర్స్ తరఫున నిర్వహించే బాయ్స్ టౌన్ అనే సంస్థకు డైరెక్టరుగా వ్యవహరించేవాడు. ఈ సంస్థ ప్రమాదకర పరిస్థితుల్లో జీవిస్తున్న యువకులకు వివిధ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చి ఉద్యోగాలు వచ్చేలా చేసేది.

1996 లో హైదరాబాదులోని మెహబూబ్ కీ మెహందీ అనే రెడ్ లైట్ ప్రాంతంలో నివసించే కొంతమందిని ఖాళీ చేయించారు. దీని ఫలితంగా వ్యభిచార కూపంలో చిక్కుకున్న వేలమంది నిరాశ్రయులయ్యారు. వెట్టికాటిల్ సహకారంతో వారిని ఖాళీ చేయించిన స్థలంలోనే సునీతా వారి జీవితాల్లో మార్పు తెచ్చేందుకు, వారి రెండో తరం కూడా ఈ వృత్తిలో దిగకుండా ఉండేందుకు ఒక పాఠశాలను ప్రారంభించారు. సంస్థ ప్రారంభించిన కొత్తల్లో దాన్ని నడపడానికి ఆమె తన నగలను, ఇంట్లో ఉన్న సామాను సైతం అమ్ముకోవాలసి వచ్చింది.

ప్రస్తుతం ఈ సంస్థ నివారణ, సంరక్షణ, పునరావాసం, పునరంకితం, సహాయం అనే ఐదు మూల స్థంబాల ఆధారంగా పనిచేస్తుంది. వ్యభిచార భాదితులకి ఈ సంస్థ నైతికంగా, ఆర్థికంగా, న్యాయపరంగా, సామాజికంగా సహాయం చేస్తుంది. అంతే కాకుండా నేరం చేసిన వారికి తగిన శిక్ష పడేలా చేస్తుంది. ప్రజ్వల సంస్థ ద్వారా అమె నరకకూపంలో చిక్కకున్న 12000 మందిని కాపాడి.. వారికి అశ్రయం కల్పిస్తున్నారు. వారు చేసే కార్యక్రమాలు దాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద మానవ హక్కుల సంస్థగా గుర్తింపు సాధించి పెట్టాయి.

ఆమె భర్త పేరు రాజేష్ టచ్ రివర్. జోస్‌ వెట్టికాటిల్‌ ద్వారా రాజేష్‌ ఆమెకు పరిచయమయ్యాడు. వృత్తి రీత్యా సినిమా దర్శకుడు. రాజేష్‌కు సందేశాత్మక చిత్రాలు తీసే దర్శకుడిగా మంచి పేరుంది. రాజేష్ కు ఒకసారి ప్రమాదం జరగడంతో ఆమె చికిత్స జరిపించింది. ఇదే సమయంలో జోస్‌ వెట్టికాటిల్‌ గుండెపోటుతో చనిపోయారు. జోస్‌ ఆఖరి కోరిక మేరకు వారిద్దరూ ఒక్కటయ్యారు.

సునీతా మీద ఇప్పటిదాకా 14 సార్లు భౌతికంగా దాడులు జరిగాయి. చంపుతామంటూ బెదిరింపులు ఇప్పటికీ వస్తున్నాయి. ఒకసారి ఆమె ప్రయాణిస్తున్న ఆటోను ఓ సుమో వ్యాను ఉద్దేశ్యపూర్వకంగా గుద్దేసి వెళ్ళిపోయింది. అప్పుడు ఆమె తీవ్రగాయాలతో బయట పడింది. అలాగే మరోసారి యాసిడ్ దాడి నుంచి తప్పించుకొన్నది. మరోసారి విష ప్రయోగం నుంచి తప్పించుకొన్నారు. కానీ ఆమె ఈ దాడులు తనలో మరింత పట్టుదలను పెంచాయని పేర్కొనింది. ఆమె ధైర్యానికి అలుపెరగక చేస్తున్న పోరాటానికి మెచ్చి భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డుతో సత్కారించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Rani rudramadevi a monarch of kakatiya dynasty termerd as telangana veeranari

  కాకతీయ కీర్తిని నలుదిశలా చాటిన వీరనారి రుద్రమ

  Jan 22 | భారతదేశ చరిత్రలో కాకతీయ సామ్రాజ్యానికి ఒక అరుదైన ఘనత వున్న విషయం తెలిసిందే! కాకతీయ రాజ వంశం కీర్తిని నలుదిశలా వ్యాపింపచేసి.. ఘనకీర్తిని సొంతం చేసుకున్న తెలంగాణ వీరనారిగా నిలిచింది రాణి రుద్రమదేవి. కాకతీయ... Read more

 • Telangana socialist leader and reformer eshwari bai centenary celebrations

  అట్టడుగువర్గాల అభ్యున్నతే శ్వాస.. దళితుల సంక్షేమమే అకాంక్ష..

  Dec 02 | హైద్రాబాద్ రాష్ట్రంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, సంక్షేమానికి పాటు పడిన వీరనారి జె.ఈశ్వరీబాయి. తెలంగాణ తొలిదశ రాష్ట్రోద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. ఈ  ప్రాంతంలోని దళితుల సమస్యలపై నిరంతర పోరాటం చేశారు. అప్పటి సామాజిక... Read more

 • Anupama shenoy floats new party in karnataka

  మహిళా లోకానికి అదర్శం.. రాజకీయ ఉద్యమానికి శ్రీకారం

  Nov 06 | ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతికినే దొరుకుతుందన్న పెద్దల నానుడిని బాగా వంటపట్టించుకున్న డేరింగ్-డ్యాషింగ్‌ డీఎస్పీ అనుపమ షణై.. అదేబాటలో పయినిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రమంత్రి పరమేశ్వర్ నాయక్ తో విబేధాల కారణంగా అకారణంగా తన పదవి... Read more

 • Tejaswini manogna a bag full of talent

  అమ్మె అమ్మాయేనా.. సకల కళా శిల్పమా..?!

  Sep 13 | కలలు కనండీ.. వాటిని సాకరం చేసుకునేందుకు కష్టపడండీ అన్న మాజీ రాష్ట్రపతి, స్వర్గీయ అబ్దుల్ కలాం చెప్పిన వ్యాఖ్యలు అమెలో ఎంత ప్రభావం చూపాయో తెలియదు కానీ స్వయంగా అయన చేతుల మీదుగా అవార్డును... Read more

 • Unnava lakshmibayamma the lady who struggled for independence

  వితంతు వివాహాల జరిపించిన స్వాతంత్ర్యోద్యమ సంఘసంస్కర్త

  Aug 24 | యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్న సంస్కృత శ్లోకాన్ని తనలో ఇనుమడింపజేసుకుని తన వంతుగా సమాజంలోని మహిళలకు మంచి చేయాలని బావించి.. అ దిశగా నడుంచుట్టి.. యావత్ సమాజం నుంచి వెలివేతకు... Read more

Today on Telugu Wishesh