socialist eshwari bai centenary celebrations అట్టడుగువర్గాల అభ్యున్నతే శ్వాస.. దళితుల సంక్షేమమే అకాంక్ష..

Telangana socialist leader and reformer eshwari bai centenary celebrations

jetti eshwari bai news, jetti eshwari bai biography, jetti eshwari bai photos, jetti eshwari bai life history, jetti eshwari bai life story, jetti eshwari bai daughters, jetti eshwari bai socialist, jetti eshwari bai story, jetti-eshwari-bai-photos.gif

Jetti Eshwari Bai was an Indian politician, a Member of the Legislative Assembly and president of the Republican Party of India.

అట్టడుగువర్గాల అభ్యున్నతే శ్వాస.. దళితుల సంక్షేమమే అకాంక్ష..

Posted: 12/02/2017 08:28 PM IST
Telangana socialist leader and reformer eshwari bai centenary celebrations

హైద్రాబాద్ రాష్ట్రంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, సంక్షేమానికి పాటు పడిన వీరనారి జె.ఈశ్వరీబాయి. తెలంగాణ తొలిదశ రాష్ట్రోద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. ఈ  ప్రాంతంలోని దళితుల సమస్యలపై నిరంతర పోరాటం చేశారు. అప్పటి సామాజిక పరిస్థితులను కూడా ఎదురోడ్డి మరీ దళితులను జాగ్రృతం చేసేందుకు శ్రమించారు. నాటి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు ఈశ్వరీ బాయి. అమెపై దళితవర్గ పక్షపాతి అన్న ముద్ర పడటాన్ని అమె గర్వంగా భావించారు.

ఈశ్వరీబాయి తెలంగాణ దళితుల ఉన్నతిని కాంక్షిస్తూ సల్పిన పోరాటాలను, తెలంగాణ రాష్ట్రోద్యమంలో అమె కృష్టి, పట్టుదల, మార్గదర్శకాలను భవిష్యత్తు తరం అచరించాలని, అశయాలు సిద్దించేలా అసునరించాలని పిలుపునిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. అమె జయంతి, వర్థంతి కార్య క్రమాలను అధికారికంగా నిర్వహిస్తుంది. ఇవాళ్టి నుంచి ఈశ్వరీ బాయి శత జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ఈ ప్రత్యేక కథనం…

జెట్టి ఈశ్వరీ బాయి… డిసెంబర్ 1, 1918 లో  సికింద్రాబాదు, చిలకలగూడలో  దళిత కుటుంబంలో పుట్టారు. ఇవాల్టికి ఆమె పుట్టి 99ఏళ్లు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆమె జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తుంది ప్రభుత్వం. ఈశ్వరీ బాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏటా ఒకరికి అవార్డూ ఇస్తోంది. ఈ సారి అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ను ఈశ్వరీ బాయి అవార్డుతో సత్కరించనున్నారు.

ఈశ్వరీ బాయి బతికున్నంత వరకు దళితుల సమస్యలపై పోరాటం చేశారు. ఆమె తెలంగాణ ప్రాంత దళితోద్దరణ నాయకులే కాదు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం  ఎనలేని పోరాటం చేశారు. తన చుట్టూ ఉన్న సామాజిక  రుగ్మతలను రూపుమాపేందుకు కృషి చేశారు ఈశ్వరీ బాయి. తన సోదరుని ప్రోత్సాహంతో సామాజిక సమస్యలను అవగాహన చేసుకున్నారు.

ఈశ్వరీ బాయి ఉన్నత విద్యావంతురాలు. చిన్న వయస్సులోనే పూణెకు చెందిన జెట్టి లక్ష్మీనారాయణతో ఆమెకు వివాహమైంది. ఓ కుమార్తె జన్మించిన తర్వాత లక్ష్మీనారాయణ చనిపోయారు. దీంతో ఆమె పుణె నుంచి హైద్రాబాద్ కు వచ్చారు. ఆ తర్వాత బతికున్నంతకాలం తన జీవితాన్ని సమజానికి, సమాజ సేవకే అంకితం చేశారు ఈశ్వరీబాయి.

మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక ఈశ్వరీ బాయి. ఆమె బహుభాషా కోవిదురాలు. ఉపాధ్యాయురాలుగా కూడ పనిచేశారు. మురికివాడల్లోని పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించారు. ఆ తర్వాత ఆమె ప్రస్థానం రాజకీయాల వైపు మళ్లింది. 1951 లో సికింద్రాబాద్ మున్సిపాలిటికి కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో MLAగా శాసన సభకు ప్రాతినిధ్యం వహించారు.

నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఈశ్వరీ బాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై అసెంబ్లీలో ఆమె చేసిన ప్రసంగాలు జనాన్ని చైతన్యం చేశాయి. ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలను ఆమె ఎలుగెత్తి చాటారు. 4 దశాబ్ధాల పాటు వివిధ సామాజిక, రాజకీయ ఉద్యమాల్లో పనిచేశారు ఈశ్వరీబాయి. హైద్రాబాద్ దక్కన్ లో చెప్పుకోతగిన అతి కొద్ది మంది నాయకుల్లో ఓ గొప్ప స్థానం సంపాదించుకున్న ఈశ్వరీ బాయి 1991 ఫిబ్రవరి 24 న కన్నుమూశారు. ఇవాళ ఈశ్వరీబాయి జయంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : socialist  reformer  jetti eshwari bai  centenary celebrations  telangana government  

Other Articles