Anupama Shenoy launches party మహిళా లోకానికి అదర్శం.. రాజకీయ ఉద్యమానికి శ్రీకారం

Anupama shenoy floats new party in karnataka

karnataka anupama shenoy Bharatiya Janashakti Congress, new party, Kudligi, Ballari district

Bharatiya Janashakti Congress is the new political party launched by Anupama Shenoy, former Deputy Superintendent of Police, at Kudligi in Ballari district

మహిళా లోకానికి అదర్శం.. రాజకీయ ఉద్యమానికి శ్రీకారం

Posted: 11/06/2017 08:17 PM IST
Anupama shenoy floats new party in karnataka

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతికినే దొరుకుతుందన్న పెద్దల నానుడిని బాగా వంటపట్టించుకున్న డేరింగ్-డ్యాషింగ్‌ డీఎస్పీ అనుపమ షణై.. అదేబాటలో పయినిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రమంత్రి పరమేశ్వర్ నాయక్ తో విబేధాల కారణంగా అకారణంగా తన పదవి నుంచి తప్పుకోవాల్సిన వచ్చిన అనుపమ.. ఇక తాను ఖాకీ దుస్తులు ధరిస్తే సరిపోదని, ఖద్దరు దుస్తులు ధరించాల్సిన అవసరముందని భావించారు. అనుకున్నంతనే రాజకీయ చదరంగంలో పాదం మోపాలని నిర్ణయించారు.

ఎక్కడ రాజకీయ నాయకుల వల్ల ఇబ్బందులు పడి ఉద్యోగాన్ని వదిలేసారో అదే కూడ్లిగిలో పార్టీ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించి రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలోని సుమారు 80 స్థానాల్లో  పోటీచేస్తామని కూడా అనుపమ ప్రకటించారు. తాను స్థాపించిన పార్టీకి అభిమానులు, మహిళల మద్దతు కావాలని అమె ఇప్పటికే అభ్యర్థించారు. రాజకీయ పార్టీలు మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని హామీలు ఇస్తున్నారే కాని ఇంతవరకు అమలు చేయడం లేదన్నారు.

మహిళల సంక్షేమం గురించి కాంగ్రెస్, బీజేపీలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నాయని ధ్వజమెత్తారు. తన నూతనంగా పార్టీ అధ్వర్యంలో రమారమి అర్థభాగం సీట్లు మహిళలకే కేటాయిస్తానని అనుపహ ప్రకటించారు. మహిళలు రాజకీయంగా కూడా మరింత చైతన్యవంతులుగా ఎదగాల్సిన అవసరముందని అమె అభిప్రాయపడ్డారు.

ఎవరీ అనుపమ?

బళ్లారి జిల్లా కూడ్లిగి డీఎస్పీగా 2014 సెప్టెంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన అనుపమ షణై అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టించడమే కాకుండా అక్రమ మద్యం వ్యాపారాలపై ఉక్కుపాదం మోపి సంచలనం సృష్టించారు. అక్రమ మద్యం కట్టడిపై అప్పటి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరమేశ్వర్‌ నాయక్‌తో ఆమెకు విభేదాలు ఏర్పడ్డాయి. అక్రమ మద్యం వ్యాపారానికి ప్రభుత్వం సహకరిస్తోందని మండిపడుతూ ఆమె రాజకీయ నాయకులపై  ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శలు గుప్పించేవారు.

ఈ నేపథ్యంలో మంత్రి, ప్రభుత్వంతో నడుస్తున్న కోల్డ్‌వార్‌తో 2016లో ఆమె డీఎస్‌పీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రభుత్వం ఆమోదిస్తుందా? లేదా? అని ఉత్కంఠ భరితంగా జనం ఎదురు చూశారు. అయితే ఆమె చేసిన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. కూడ్లిగిలోనే పార్టీ ఆవిర్భావ సభ!: రాజీనామా చేసినప్పటి నుంచి ఆమె రాజకీయాల్లోకి వస్తారనే వదంతులు సాగుతున్నాయి.

ఆమె బీజేపీలోకి చేరుతారు అని ప్రచారం సాగినా చివరికి ఆమె సొంత పార్టీ ఏర్పాటుకు మొగ్గుచూపడం విశేషం. ఎక్కడైతే ఉద్యోగంలో చేరి అక్రమాలపై పోరాడారో ఆ కూడ్లిగి నుంచే ఆమె రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్‌ 1న పార్టీ ఆవిర్భావాన్ని కూడ్లిగిలోనే సభ నిర్వహించి ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇందుకుగాను కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పూర్తిచేయాల్సిన కార్యక్రమాలను చేపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles