Malala Yousafzai female education activist బాలికల విద్యాహక్కు కోసం ఉద్యమించిన వీరనారి మలాలా

Malala yousafzai female education activist youngest winner nobel peace prize

Malala, Malala Yousafzai, Nobel Peace Prize, Pakistan, Education, Activism, malala yousafzai facts, malala yousafzai facts, malala yousafzai nobel prize, malala yousafzai speech, i am malala, malala yousafzai age, malala yousafzai education, ziauddin yousafzai, malala nobel peace prize

Malala Yousafzai is a Pakistani activist for female education and the youngest-ever Nobel Prize laureate,pakistan,malala,shati dootha,nobel prize winner and young United nations human rights leader.

బాలికల విద్యాహక్కు కోసం ఉద్యమించిన వీరవనిత మలాలా

Posted: 07/29/2017 06:46 PM IST
Malala yousafzai female education activist youngest winner nobel peace prize

ఉగ్రవాదుల రాజ్యంలో బాలికల హక్కుల కోసం వికసించిన శాంతికపోతం.. తమ హక్కుల కోసం ప్రాణాలు సైతం లెక్కచేయక తీవ్రవాదుల తూటాలకు ఎదురో్డి మరీ హక్కులను సాధించుకున్న ధైర్యం. చదవుతోనే తనతో సహా తమ ప్రాంత బాలికల్లో వికాసం వస్తుందని విశ్వసించి.. ఉద్యమించిన శాంతి కెరటం. బాలికలకు చదువు అవసరాన్ని  గుర్తెరిగి దానితోనే బాలికా, మహిళా వికానమని.. తూపాకీ తూటాలకు ఎదురోడ్డి గొంతెత్తిన అరచిన గళం. పిన్న వయసులోనే సమాజ దురాగతాలపై నిప్పులు చెరిగిన కలం. మతవాదం ముసుగులో జరుగుతున్న అనాగరిక మూఢాచారలను నిలువరించేందుకు వినిపించిన స్వరం. మతోన్మాధుల పాలిట చల్లటి శాంతి కపోతం. హ్కకుల కోసం బాధ్యతతో పోరాడే పిడికిలి. అతి చిన్నతనంలోనే నోబెల్ శాంతి బహుమతి అందుకొని ఐక్యరాజ్య సమితి శాంతిదూతగా నియమితులైన బాలికా కెరటం మలాలా.

మలాలా అసలు పేరు మలాలా యూసుఫ్ జాయ్. జూలై12, 1997లో జన్మించారు. ఆమెది పాకిస్థాన్ లోని మింగోళా. ఇస్లాం మతంలోని సున్నీ వర్గానికి చెందిన పస్తూన్ తెగకు చెందిన మలాలా.. జియా ఉద్దీన్ యూసఫ్, తూర్ పెకాయ్ ల గారాల పట్టి. తండ్రి స్వయంగా ఉపాధ్యాయుడు. కుశాల్ పేరుతో పాఠశాలలు నడిపేవారు. పస్తూన్ కవయిత్రి, పోరాట యోధురాలైన మెయివాండ్ మలాలా అంటే అతనికి చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే కూతురుకు మలాలా అని పెట్టుకున్నాడు. ఆ స్ఫూర్తినే కూతురులో రగిలించాడు. చిన్నప్పుడు మలాలా తలకు స్కార్ఫ్ కట్టుకోవడం ఇబ్బందిగా ఉంది అంటే తీసేయ్ అని ధిక్కారంగా చెప్పాడు. ముస్లీంలల్లో తలకు, ముఖానికి బట్ట ధరించడం సంప్రదాయం. అలా మలాలా చిన్నప్పుడే సొంతదైన వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంది.

ఊహ తెలిసి రాగానే తమ ప్రాంత సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను ఆకలింపు చేసుకోవడం మొదలుపెట్టింది మలాలా. అప్పటికే స్వాత్ లోయలో తాలిబన్లు సృష్టిస్తున్న అరాచకాలకు ఎదురోడ్డి నిలిచింది. మరీ ముఖ్యంగా తమ పాఠశాలను ఉగ్రమూకలు పేల్చివేశాయి. ఆ ప్రాంత బాలికల విద్యను అభ్యసించకుండా ఉక్కుపాదం మోపారు. ఎవరన్నా వారికి అడ్డు వచ్చినా, అడ్డు చెప్పినా నిలువునా ప్రాణాలు తీసేవాళ్లు. అనునిత్యం ఉగ్ర తుపాకులు పేలే ప్రాంతం. ముష్కర మూకల అలజడులు రావాణకాష్టంలా రగలుతూనే వుండే స్వాత్ లోయలో వారి ఘాతుకాలకు ఎందరో అమాయకులు బలయ్యేవారు. 2009 లో పాఠశాలకు వెళ్లే ఆడపిల్లల్ని, ఉపాధ్యాయుడ్ని కాల్చి చంపారు. ఈ దారుణాలను వివరిస్తూ గుల్ మకాయ్ అనే కలం పేరుతో బీబీసీ ఉర్దూ ఛానల్ కు వార్తా కథనాలు రాసింది.

మలాలా ఇంటి ఎదురుగా ఉన్న పాతబడిన బడిని తాలిబన్లు పేల్చేశారు. ఆ సంఘటన మలాలాను పూర్తిగా కలచివేసింది. పైగా తాలిబన్లు వద్దని చెప్తున్నా, వారిస్తున్నా, తన స్కూలు బస్సును అడ్డుకున్నా పాఠశాలకు మాత్రం వెళ్తూనే ఉండేది. 2008లో మలాలా ఇంటి ఎదురుగా ఉన్న పాతబడిన బడిని తాలిబన్లు పేల్చేశారు. అమ్మాయిలను పాఠశాలలకు పంపొద్దని హెచ్చరించారు. అయినా మలాలా మాత్రం పాఠశాలకు వెళ్తూనే వుంది. పెషావర్ లో జరిగిన ఒక సభలో చదువుకోవడం తన హక్కు అని..  దానిని లాక్కోవడానికి ఉగ్రవాదులెవరూ..? అంటూ ప్రశ్నించింది. దాంతో తెహ్రీక్ తాలిబన్ తీవ్రవాద సంస్థ చంపేస్తామని హెచ్చరికలు పంపింది. కాని అదరని బెదరని మలాలా రోజూ స్కూలుకు వెళ్తూనే వుంది. ఇలా 2012, అక్టోబరు 9, మలాలా పాఠశాల నుంచి బస్సులో ఇంటికి వస్తుండగా.. ఉగ్రవాదులు దాడి చేశారు. ఏకంగా నల్లటి ముసుగులో ఉన్న ఒకతను మలాలాపై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. తల, ముఖం, వెన్నుముకలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఆ పసిప్రాణం విలవిలలాడింది. అందరూ చావు తప్పదని అనుకున్నారు.

పాకిస్థాన్ పోలీసులు అమెను చికిత్స నిమిత్తం అస్పత్రికి తరలించారు. వైద్యులు శస్త్రచికిత్సలు చేసిన తరువాత కూడా అమె విషమంగానే వుండింది. అందుకు అమె వెన్నులో దిగిన బుల్లట్ కారణమయ్యింది. దీంతో పాకిస్థాన్ ప్రభుత్వం అమెను బ్రిటన్ కు పంపింది. ప్రపంచం మొత్తం మలాలా బతకాలని శాంతి సందేశాలు పంపింది. ఆమె మరణం నుంచి కోలుకోవాలని ప్రార్థనలు చేసింది.  క్వీన్ ఎలిజబత్ హాస్పెటల్లోని వైద్యులు వెన్నులోని బుల్లెట్ తీసి అమెకు పునరుజ్జీవం పోశారు. తనపై తుపాకీ గుళ్ల వర్షాన్ని కురింపించిన వారిని క్షమించే క్షమాగుణం ఆ చిన్నారిలోనూ వుండింది. దీంతో తన సేవలను కేవలం ఒకదేశానికే పరిమితం చేయడం కాదని, ప్రపంచంలోని బాలికల గొంతును తన గొంతుగా ప్రతిధ్వనించాలని నిర్ణయించుకుంది. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా నల్లసూరీడు నెల్సన్ మండేలా, బర్మా ప్రతిపక్ష నేత అంగ్ సాన్ సూకి, దలైలామా వంటి నేతలకు మాత్రమే ఆశ్రయం కల్పించిన కెనడా.. అరో వ్యక్తిగా మలాలాకు కూడా ఆశ్రయాన్ని ఇచ్చింది.

ఉగ్రమూకల రాజ్యంలో వారి తుపాకీ గుళ్లకు కప్పకూలిన ఉద్యమ కెరటం మలాలా తిరిగి తన ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. ప్రపంచం మొత్తంగా చదువుకోసం అలమటిస్తున్న బాలికలకు ప్రతీకగా నిలిచింది. ప్రపంచంలో 5 కోట్ల 70 లక్షల మంది బాలికలకు విద్య అందటం లేదని 40 లక్షల మంది సంతకాలు సేకరించి ఐక్యరాజ్య సమతి ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్ కు అందించింది. ఇప్పటికీ పాకిస్థాన్ లో విద్య అందని బాలికలు 50 లక్షల మంది వరకు ఉన్నారని తెలియజేసింది. తర్వాత ఐక్యరాజ్య సమితిలో ప్రసంగిస్తూ- ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి చిన్నారికి చదువుకునే హక్కు ఉంది. అది మాట్లాడడానికే వచ్చానని అన్నది. ఆ నినాదమే ఆమెను ప్రపంచంలోని అత్యన్నతుల పక్కన చేర్చింది.

బాలికల హక్కుల ఉద్యమ నేతగా ఉగ్రమూకలను ఎదురించి వారి కాల్పుల్లో గాయపడిన మలాలాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆ పురస్కార గ్రహీత డెస్మాండ్ టుటు సిఫారస్సు చేశాడు. దీంతో 2014లో కైలాశ్ విద్యార్థితో కలిపి నోబెల్ శాంతి బహుమతిని అందుకుంది మాలాలా. ఈ అవార్డు అందుకున్న వారిలో అతి చిన్నవయస్కురాలిగా మలాలా చరిత్ర సృష్టించింది. దీంతో పాటు అమెను అనేక అవార్డులు వరించాయి. 2011 నేషనల్ యూత్ పీస్ ప్రైజ్, 2013లో సిమోను డి బ్యూరో ప్రైజ్ అందుకున్నారు. అదే ఏడాది ఐక్యరాజ్య సమితి మలాలాకు మానవ హక్కుల అవార్డు ప్రకటించింది. అమ్నెస్టీ అంతర్జాతీయ బహుమతి కూడా మలాలాను వరించింది. పాకిస్థాన్ ప్రభుత్వం విద్యాహక్కు బిల్లును ఆమోదించడానికి ఈమె పోరాటమే దారితీసిందన్నది నిజం. కరుడుగట్టిన తాలిబన్లను సైతం మార్చిన క్షమాగుణం మలాలాది. ఆమె తిరిగొచ్చి చంపుతామన్న ఉగ్రవాదులు.. మదార్సాలో చదువుకోమని కోరారు.

2015లోనే ఐక్యరాజ్య సమితి విద్య ప్రత్యేక రాయబారి గోర్డాన్ బ్రౌన్ మలాలా కృషికి చిహ్నంగా ఆమె పేరుతోనే పిల్లలంతా పాఠశాలల్లో ఉండాలి అన్న ఐరాసా అభ్యర్థనను ప్రవేశ పెట్టారు. ఇటీవలే ఆమె ఐక్యరాజ్య సమితి శాంతి దూతగా ఎంపికయ్యారు. అతి చిన్నవయసులోనే ఈ గౌరవం దక్కడం మలాలాకు ప్రపంచం ఇచ్చిన బహుమతేనని చెప్పాలి. సిరియా శరణార్థులకోసం బెక్కాలో మలాలా యూసఫ్ ఆల్ గర్ల్స్ స్కూల్ ప్రారంభించారు మలాలా. మొత్తంగా బాలికల హక్కుల ఉద్యమ నేతగా వికసించి ఇవాళ బాలికల విద్యాతో పాటు మహిళా హక్కుల ఉద్యమనేతగా ఎదిగిన మలాలా ఓ  సుగుణశీలి. జీవితాన్ని పదిమంది కోసం ఎలా మార్చుకోవాలో ఆచరణలో చూపుతున్న వీరనారి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Malala  Malala Yousafzai  Nobel Peace Prize  Pakistan  Education  Activism  

Other Articles

 • Fiercest feminists in the history of india ismat chughtai

  భారత్ నుంచి బిఏ పట్టా అందుకున్న తొలి ముస్లిం మహిళ

  Jul 05 | ఇస్మత్‌ చుగ్తాయ్.. భారత చరిత్రలో ప్రముఖ స్త్రీవాది. మరోలా చెప్పాలంటే స్త్రీవాదానికి భారతదేశంలో బాష్యం చెప్పిందామె అని చెప్పినా అతిశయోక్తి కాదమో. ప్రపంచ ఉర్దూ సాహిత్యంలో ఆమె పేరు తెలియనివారు వుండరు. భారత ఉపఖండంలో... Read more

 • Durgabai deshmukh indian freedom fighter

  మహిళాభ్యున్నతికి పాటుపడిన స్త్రీజనోద్ధరణ నేత దుర్గాబాయి దేశ్ ముఖ్

  Jun 17 | అందరూ మనిషులుగానే పుడతారు.. కానీ కొందరు మాత్రమే మహామనుషులుగా నిలుస్తారు. నేటి సమాజంలో వేనూళ్లుకున్న స్వార్థం.. నేను, నావాళ్లు.. అనే పదాలకు పూర్తి భిన్నంగా  మేము మావాళ్లు అనే భావనతో సమాజంలో మార్పుకు.. సంఘహితం... Read more

 • Mamata banerjee looking simple but most powerfull

  సింపుల్ కానీ పవర్ ఫుల్ మమతాబెనర్జీ

  May 20 | స్ర్తీ శక్తిని చాటి చెప్పిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఎంతో మంది తమ మేధస్సుతో తాము కూడా ఎవరికీ తక్కువ కాదు అని నిరూపిస్తే.. మరికొంత మంది రాజకీయ ద్వారా తమ సత్తాను... Read more

 • Sunita williams who came earth from sky

  నేలకు దిగివచ్చిన ధీరవనిత సునీత విలియమ్స్

  Dec 17 | సునీత సెప్టెంబర్‌ 19, 1965లో యూక్లిడ్‌లోని ఒహియోలో డా. దీపక్‌ పాండ్య, బొన్నీ పాండ్య దంపతు లకి జన్మించింది. తండ్రి ప్రముఖ న్యూరాలజిస్ట్‌. వీరి కుటుంబం తర్వాత మసాచుసెట్స్‌కి మారారు. తండ్రి వంశీయులు గుజరాత్‌కి... Read more

 • Most powerful woman indra nooyi

  శక్తివంతమైన మహిళలగా ఎదిగిన ఇంద్రా నూయి

  Dec 14 | బర్త్‌డే పార్టీలకు, నలుగురు స్నేహితులు కలిసినప్పుడు సరదాగా కూల్‌డ్రింక్ తాగడం కామన్. కానీ ఆ కూల్‌డ్రింక్ సంస్థను నడిపించే శక్తి గురించి మాత్రం ఎవ్వరూ ఆలోచించరు. ఒకవేళ ఆలోచించిన అలాంటి వారు చాలా తక్కువ... Read more

Today on Telugu Wishesh

porno