fiercest feminists in the history of India Ismat Chughtai భారత్ నుంచి బిఏ పట్టా అందుకున్న తొలి ముస్లిం మహిళ

Fiercest feminists in the history of india ismat chughtai

Ismat Chughtai, fiercest indian feminist Ismat Chughtai, fiercest muslim feminist Ismat Chughtai, fiercest muslim feminists in india, fiercest feminists in urdu literature, female indian writers, female muslim indian writers, 1st muslim woman to get BA degree

One of the fiercest feminists in the history of India, Ismat Chughtai is a prominent name in the world of Urdu literature. Ismat laid the foundation for all future female writers in the subcontinent.

భారత్ నుంచి బిఏ పట్టా అందుకున్న తొలి ముస్లిం మహిళ

Posted: 07/05/2017 09:38 PM IST
Fiercest feminists in the history of india ismat chughtai

ఇస్మత్‌ చుగ్తాయ్.. భారత చరిత్రలో ప్రముఖ స్త్రీవాది. మరోలా చెప్పాలంటే స్త్రీవాదానికి భారతదేశంలో బాష్యం చెప్పిందామె అని చెప్పినా అతిశయోక్తి కాదమో. ప్రపంచ ఉర్దూ సాహిత్యంలో ఆమె పేరు తెలియనివారు వుండరు. భారత ఉపఖండంలో మహిళా రచయితలకు పునాదిని వేయడమే కాదు.. దిశానిర్దేశం చేసిన రచయిత్రి అమె. అమె కలం నుంచి జాలువారిన ప్రతీ అక్షరం అయుధమై పురుషాధిక్య సమాజం వైపు దూసుకెళ్లింది. దీంతో ఇస్మత్ రాసిన పలు కథలు, నవలలు చాలా వివాదస్పదమయ్యాయి.

పురుష ఆధిపత్యం, అన్యాయం, లైంగికత, పురుషాధిపత్య సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, చేస్తున్న పోరాటాలు.. అనాటి పరిస్థితుల్లో మహిళలు అనుసరించాల్సి వచ్చిన అనాచారాలు, దురాచారాలపై అమె తన కలాన్ని ఎక్కుపెట్టారు. సమస్య ఏదైనా.. ఎక్కడున్నా.. అమె స్త్రీవాదాన్ని బలంగా వినిపించేలా ఎన్నింటినో అక్షరీకరించారు. నిస్సంకోచంగా, ధైర్యసాహసాలతో రాసినందుకు అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే అమె రాసిన పలు పుస్తకాలు నిషేధానికి గురయ్యాయి.

ఉర్దూ సాహిత్యంలో శిఖరాయమానమైన ఇస్మత్ చుగ్తాయ్ 1915 ఆగస్ట్ లో జన్మించారు. కాగా అమె  1991 అక్టోబర్ మాసంలో తన రచనలను బావితరాలకు అందించి అనంత లోకాలకు తరలివెళ్లిపోయారు. ఇస్మత్ చుగ్తాయ్ సంస్కార ధోరణి కలిగిన ముస్లిం కుటుంబంలోనే పుట్టింది. ఆమెకు పర్షియన్ నేర్పించడానికి ఇంట్లో జరిగిన ప్రయత్నం సాగలేదు. ఈ విషయంలో పెద్ద తండ్రి మీద కూడా ఆమె తిరుగుబాటు చేశారు. బహుశా ఇదే అమె జీవితంలో అమె చేసిన తొలి తిరుగుబాటు అయి ఉంటుంది.
 
చుగ్తాయ్‌కి వంటపని ఇంటి పని ఏమాత్రం సరిపడేది కాదు. వంటింటికే పరిమితం కావడం ఎంతమాత్రం సరికాదని ఏడెనిమిది దశాబ్దాల నాడే భావించిన భావుకురాలు. అమెకు పుస్తకాలంటే ప్రాణం. ఈ ధోరణి చూసిన తల్లికి కడుపు మండిపోయేది. అలీగడ్ మిషనరీ స్కూల్లో చేర్చించడం దగ్గర కూడా పెద్ద అల్లరే అయింది. చదువు కొనసాగించకుంటే ఇంట్లోంచి పారిపోతానని బెదిరించి మరీ స్కూల్లో చేరారామె. పదిమంది సంతానంలో చుగ్తాయ్ మాత్రమే ఇలాంటి తిరుగుబాటు ధోరణి ప్రదర్శించేది. అమెకు తల్లి మద్దతు లేకున్నా తండ్రి, ఒక సోదరుడి మద్దతు లభించింది.
 
దేశంలో బీటీ పట్టా తీసుకున్న తొలి మహిళ చుగ్తాయ్. ఆగ్రాలో చదువుకుంటున్నప్పుడే అక్కడ మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న షాహిద్ లతీఫ్‌తో పరిచయమైంది. అది ప్రణయంగా మారి, వివాహం చేసుకున్నారు. ఇస్మత్ ముస్లిం మతచారాలకు చాలా దూరంగా వుండేవారు. ముస్లిం మతాచారాలను నూటికి నూరు శాతం పాటించే అగ్రా లాంటి ప్రాంతానికి వెళ్లినా.. అమె మతాచారాల ప్రకారం బురఖా ధరించలేదు. ఇలా అమెలో ఎన్నో అభ్యుదయ భావాలు వుండేవి. అవే అమె కలం నుంచి జాలువారి రచయిత్రిని చేశాయి.

తొలినాళ్లలో ఇస్మత్ చాలా రహస్యంగా తన రచనలను రాశారు. అయితే ముస్లిం అయినా అమె.. తన మతగ్రంధం ఖురాన్‌తోపాటు భగవద్గీత, బైబిల్‌ను కూడా అద్యయనం చేశారు. ఆమెకు బాగా పేరు తెచ్చిన, వివాదాస్పదమన రచన లిహాఫ్‌. ఇందులో హౌమో సెక్సువాలిటీ గురించి చర్చించినందుకుగాను ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. కోర్టు మెట్లెక్కి, క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితిని కల్పించారు. కానీ ఆమె క్షమాపణలు చెప్పలేదు సరికదా... పోరాడారు. చివరకు ఆమే గెలిచారు.

ఇస్మత్‌ చుంగ్తాయ్ చాలా దూరదృష్టి ఉన్న వ్యక్తి. తనకాలంకంటే ఎంతో ముందున్నారు. తన జీవిత కాలం మొత్తంలో ఎక్కడా వెనుకడుగువేయలేదు... నిర్మొహమాటంగా తన భావాలను వ్యక్తీకరించారు. నమ్మిన వాటికోసం నిలబడిన స్వతంత్ర వ్యక్తిత్వం ఆమెది. ఆమె, ఆమె రచనలు ఇచ్చిన స్ఫూర్తి ఇతర స్త్రీవాద రచయితలు అందిపుచ్చుకున్నారు. ఆమె లేవనెత్తిన ఎన్నో అంశాలపై రచనలు చేశారు. అయితే ఆమె రచనకు ఒక దృక్పథం ఏర్పడడానికి కారణం- 1936లో జరిగిన లక్నో అభ్యుదయ రచయితల సమావేశం.

ఉర్దూ మహా రచయిత మున్షీ ప్రేమ్‌చంద్ రోజులను లెక్కిస్తూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశమే భారతీయ సాహిత్యానికి కొత్త దిశను చూపించింది. ఎన్నో నవలలు, కథలు, రేడియో నాటికలు రాశారామె. ‘జిద్ది’, ‘తేడీ లకీర్’, ‘ఏక్‌బాత్’, ‘మాసూమా’, ‘దిల్ కీ దరియా’, ‘ఏక్ ఖత్రా ఏ ఖూన్’, ‘ఇన్సాన్ ఔర్ ఫరిష్టే (నవలలు, నవలికలు); ‘ధనీ బాంకే’, షైతాన్ (నాటికలు, రేడియో నాటికలు),  ‘కలియా’, ‘దో హాథ్’, ‘చోటే’(కథా సంకలనాలు), ‘కాగజి హై పైరహన్’ (ఆత్మకథ) ఆమె రచనలలో కొన్ని. గరం హవా, అర్జూ, మైడ్రీమ్స్, లీహాఫ్ ఆమె కథల ఆధారంగా తీసిన చిత్రాలే.

NOTE: We inform you that we are not owner of any of the products, images or any other products displaying on our website. But all the articles are written by us and we owned them. If you found any image or product that found under your copyrights then please feel free to CONTACT US. We will remove that image or product as soon as possible. All the images are collected from Google.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fiercest feminists  Ismat Chughtai  first woman BA holder  BEd  independence  

Other Articles

Today on Telugu Wishesh