The Biography Of Chanda Kochhar Who Is the MD and CEO of ICICI Bank | indian successful women | indian powerful women

Chanda kochhar biography md and ceo of icici bank

Chanda Kochhar life history, Chanda Kochhar biography, Chanda Kochhar special story, Chanda Kochhar birthday, Chanda Kochhar photos, Chanda Kochhar history, Chanda Kochhar wikipedia, Chanda Kochhar wiki in telugu, icici bank, icici bank history, indian powerful women

Chanda Kochhar biography MD and CEO of ICICI bank : The Biography Of Chanda Kochhar who is the managing director (MD) and chief executive officer (CEO) of ICICI Bank. ICICI Bank is India's largest private bank and overall second largest bank in the country.

శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తగా పేరుగాంచిన చందా

Posted: 11/17/2015 05:59 PM IST
Chanda kochhar biography md and ceo of icici bank

ప్రస్తుత ఆధునిక యుగంలో పురుషులకు సమానంగా మహిళలూ అన్నిరంగాల్లో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్నారు. తమలోనూ ప్రతిభ దాటి వుందంటూ సత్తా చాటుకుంటూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటివారిలో చందాకొచ్చర్ ఒకరు. ఓ ప్రముఖ సంస్థ (ICICI)లో మేనేజ్ మెంట్ ట్రైనీగా తన కెరీర్ ప్రారంభించిన ఆమె.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. నేడు ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా, నిర్వహణ అధ్యక్షురాలిగా కొనసాగుతోంది. ఆ రంగంలో ఎంతో సక్సెస్ ఫుల్ గా సాగుతున్న ఈమెను ఫోర్బ్స్ పత్రిక అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తగా గుర్తించింది. ఈమె చేసిన శ్రమ, బ్యాంకింగ్ రంగంలో అందించిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం.. 2010లో ‘పద్మభూషన్’ తో సన్మానించింది.

జీవిత విశేషాలు :

1961 నవంబర్ 17వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ లో చందా కొచ్చర్ జన్మించింది. ప్రాథమిక విద్యాభ్యాసాన్ని అక్కడే సెయింట్ ఏంజెల్ సోఫియా పాఠశాలలో పూర్తిచేసిన ఆమె.. ఆ తర్వాత ముంబై జైహింద్ కళాశాల నుండి బి.ఎ . పూర్తి చేశారు. 1982లో కాస్ట్ అకౌంటెంసీని పూర్తి చేశారు. అనంతరం జమునాలాల్ బజాజ్ ఇన్స్టిటూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుండి మేనేజ్‌మెంట్ విద్యను పూర్తిచేశారు. విద్యాభ్యాసంలో తన ప్రతిభకుగానూ వివిధ పతకాలను గెలుచుకుంటూ సత్తా చాటింది. ముంబైలో స్థిరనివాసం ఏర్పరచుకున్న ఈమె.. బిజినెస్ మేనేజ్ మెంట్ తన సహోద్యాయు, పవనశక్తి వ్యాపారవేత్త అయిన దీపక్ కొచ్చర్ ని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు సంతానం.

జీవన ప్రస్థానం :

చందా కొచ్చర్ తన మేనేజ్ మెంట్ విద్యను పూర్తి చేసిన అనంతరం 1984లో ICICI (Industrial Credit and Investment Corporation Of India) సంస్థలో మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరింది. ఉద్యోగ తొలినాళ్ళలో ఆమె సంస్థ జౌళి, కాగితము, సిమెంటు విభాగాలలో పనిచేసింది. 1993లో కొత్త బ్యాంకు ప్రారంభించాలనుకున్నపుడు సంస్థ యాజమాన్యం ఈమెను బ్యాంకింగ్ కోర్ కమిటీకి బదిలీ చేసింది. 1994లో అసిస్టెంట్ మేనేజర్ గానూ, 1996 లో డిప్యూటీ మేనేజర్ గానూ పదోన్నతి సాధించింది.

1996లో శక్తి (Power), టెలికాం, రవాణా విభాగాలలో సంస్థను బలోపేతం చేయడానికి ఏర్పాటైన బృందానికి నాయకత్వం వహించింది. 1998లో సంస్థ జనరల్ మేనేజర్ గా పదోన్నతి సాధించింది. 1999లో సంస్థ ఈ-కామర్స్ విభాగాన్ని కూడా నిర్వహించింది. ఈమె నాయకత్వంలోనే సంస్థ రిటైల్ బ్యాంకింగ్ లో ప్రవేశించి, మనదేశంలోని ప్రైవేటు బ్యాంకులలో అగ్రగామిగా నిలిచింది. 2001 లో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టింది. ప్రస్తుతం ఆమె ICICI బ్యాంకుకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా, నిర్వహణ అధ్యక్షురాలుగా విధులు నిర్వర్తిస్తోంది.

బ్యాంకింగ్ రంగంలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతూ తన సత్తా చాటిన ఈమె.. 2005 నుంచి ఫోర్బ్స్ పత్రికలోని అత్యంత శక్తివంతమైన మహిళా వ్యపారవేత్తల జాబితాలో స్థానం కల్పించుకుంటూనే వుంది. 2009లో ఆ జాబితాలో 20వ స్థానం దక్కించుకున్న ఈమె.. 2010లో అదే జాబితాలో 10వ స్థానానికి ఎగబాకి, నిజమైన శక్తివంతమైన మహిళగా నిరూపించుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chanda Kochhar  icici bank history  indian powerful women  

Other Articles