the life story of sister nivedita life history who fought for women education | women freedom fighter | india independence day

Sister nivedita life history who fought for women education

sister nivedita history, sister nivedita biography, sister nivedita life story, sister nivedita wikipedia, sister nivedita telugu wiki, sister nivedita updates, sister nivedita news, sister nivedita photos, sister nivedita gallery, sister nivedita biography in telugu

sister nivedita life history who fought for women education : the life story of sister nivedita life history who fought for women education.

మహిళా విద్యాభివృద్ధికోసం కృషి చేసిన సిస్టర్ నివేదిత

Posted: 11/02/2015 06:16 PM IST
Sister nivedita life history who fought for women education

స్వాతంత్ర్యం రాకముందు దేశంలో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా వుండేదో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంటినుంచి బయటికి వెళ్లకుండా అన్ని పనులు నిర్వర్తించుకుంటూ ఓ బానిసంగా వుండాల్సిన దుర్భర పరిస్థితి. వారికి చదువు కాదుకదా.. ఇంట్లోనుంచి బయటికి వెళ్లేనిచ్చేవాళ్లు కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. సమాజంలో మహిళలకు అసలు గౌరవం వుండేది కాదు. వారిపై నిత్యం అన్యాయాలు, దురాచారాలు జరిగేవి. అలాంటి సమయంలో మహిళలకూ పురుషులకు సమానంగా హక్కులు కల్పించాలని, వారికీ విద్యావకాశాలు కల్పించాలంటూ కొందరు మహిళా ప్రతిభావంతులు గళమెత్తారు. అటువంటివారిలో ‘సిస్టర్ నివేదిత’ ఒకరు.

మహిళలకు సరైన విద్యావకాశాలు కల్పించి, వారిని విద్యావంతులను చేసినపుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించిన సిస్టర్‌ నివేదిత... మహిళా విద్యాభివృద్ధికోసం ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా బాలికల విద్యకోసం ఆమె పాఠశాలలను ప్రారంభించారు. భారత మహిళల ఔన్నత్యం గురించి, ఆచారవ్యవహారాల గురించి విదేశాల్లోని ముఖ్యనగరాల్లో సైతం ఆమె ప్రసంగించారు. అంతేకాదు... భారత స్వాతంత్య్ర పోరాటంలోనూ ఆమె చురుకైన పాత్ర పోషించారు. భారతీయతను పూర్తిగా ఆకలింపు చేసుకున్న ఆమె మహిళావిద్య కోసం ఎంతగానో పాటుపడ్డారు. తన ప్రసంగాలతో దేశాభివృద్ధికోసం ప్రజలను చైతన్యపరిచిన వివేకానందుడి బోధనలకు ఆమె ప్రభావితమై.. హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళగా చరిత్రలో నిలిచిపోయారు.

జీవిత చరిత్ర :

1867 అక్టోబర్‌ 28వ తేదీన ఐర్లాండులో మేరి ఇస‌బెల్‌, శ్యాముల్‌ రిచ్‌ముడ్‌ నోబుల్‌ దంపతులకు సిస్టర్ నివేదిత జన్మించింది. ఈమె అసలు పేరు మార్గరెట్‌ ఎలిజబెత్‌ నోబెల్‌. తోటి మనుషులను కరుణతో చూడటమే భగవంతునికి నిజమైన సేవ చేయడం అని చిన్నతనంలో తండ్రి చెప్పిన మాటలు ఆమెను ఎంతో ప్రభావితం చేశాయి. తండ్రి చెప్పిన కొన్ని స్ఫూర్తిదాయక మాటలతో ఈమె పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరింది. దాదాపు 10 సంవత్సరాలవరకు ఈమె ఇంగ్లాండులో ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో 1895లో భారత మహిళా ఔన్నత్యంపై స్వామి వివేకానంద లండన్‌లో చేసిన ప్రసంగాలు ఆమె జీవితాన్ని మార్చేశాయి. వివేకానందుని ప్రసంగం ద్వారా భారతీయ స్త్రీ గొప్పదనం గురించి విన్న ఆమె.. ఆయనతో కలిసి 1898 జనవరి 28న భారత్‌ చేరింది. ఆమెకు వివేకానంద నివేదిత అని నామకరణం చేశారు.

భారతదేశంలో నివేదిత జీవితం :

ఉపాధ్యాయురాలిగా అనుభవం ఉన్న నివేదిత.. భారత్‌లోనూ విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసింది. ముఖ్యంగా బాలికల విద్యకోసం ఆమె 1898 నవంబర్‌లో కలకత్తాలోని బాగ్‌బజారులో ఒక పాఠశాలను ప్రారంభించింది. కనీస విద్యలేని బాలికలకు విద్యను అందించడం లక్ష్యంగా ఆమె పనిచేశారు. అన్నికులాల మహిళలకు చదువు తప్పనిసరిగా రావాలని ఆమె ఎంతగానో ఆకాంక్షించారు. బెంగాల్‌ మహిళలతో, మేధావులతో పరిచయాలను ఏర్పాటుచేసుకుని బాలికల విద్యకోసం ఎంతో శ్రమించారు. భారత మహిళల ఔన్నత్యం గురించి, ఆచారవ్యవహారాల గురించి న్యూయార్క్ ‌, షికాగో మొదలైన నగరాల్లో ఆమె ప్రసంగించారు. భారత స్వాతంత్య్ర పోరాటంలోనూ ఆమె చురుకైన పాత్రపోషించారు. విదేశీయురాలు అయినప్పటికీ భారతీయతను పుణికిపుచ్చుకుని స్వామివివేకానందతో అనేక దేశాలు పర్యటించి ప్రసంగించిన ఆమె.... 1911 అక్టోబర్‌ 13న డార్జిలింగ్లో మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sister nivedita  women education  women freedom fighters  indian activists  

Other Articles