The Biography Of Mahadevi Varma Best Known As An Outstanding Hindi poet | Freedom Fighter | Women Activists

Mahadevi varma biography hindi poet freedom fighter

mahadevi varma biography, mahadevi varma history, modern meera history, famous hindi poet, women freedom fighters, women activists, modern meera photos, mahadevi varma updates

Mahadevi Varma Biography Hindi Poet Freedom Fighter : Mahadevi Varma best known as an outstanding Hindi poet, and was a freedom fighter, woman's activist and educationist from India. She is widely regarded as the modern Meera.

భారత సాహిత్యాకాశంలో ధృవతారగా వెలిగిన మహాదేవి

Posted: 09/18/2015 04:20 PM IST
Mahadevi varma biography hindi poet freedom fighter

మహాదేవి వర్మ.. హిందీ సాహిత్యంలో ఛాయవాద యుగానికి మూల స్తంభాలుగా భావించబడే నలుగురు సాహిత్యకారులలో ఆమె ఒకరు. ఆధునిక హిందీ కవిత్వంలో ఆమె అందించిన సేవలకుగాను ‘ఆధునిక మీరా’ అని ఆమెను అభివర్ణిస్తారు. స్వాతంత్ర్యానికి పూర్వం, తర్వాత దేశంలో నివసించిన ఈమె.. బహుళ సమాజంలో పనిచేసింది. ఆ సమయంలోనే దేశంలో అంతర్లీనంగా వున్న ఉద్వేగాలను, ఆక్రోదనలను చూసి.. తన కవిత్వాల ద్వారా అంధకారాన్ని పోగొట్టే దృష్టిని ఇవ్వటానికి ప్రయత్నించింది. ఈమె కేవలం తన కవితల ద్వారా చైతన్యం పరచడమే కాదు.. ఈమె సమాజోద్ధరణా పనులతోపాటు మహిళాచైతన్యం కోసం చేసిన కృషి చేసింది కూడా.

జీవిత విశేషాలు :

1907 మార్చి 26వ తేదీన బ్రిటీష్ ఇండియాలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఫర్రూఖాబాద్ లో గోవింద్ ప్రసాద్ వర్మ, హేమా రాణి దంపతులకు మహాదేవి జన్మించింది. అలహాబాద్ యూనివర్సిటీలో హైయ్యర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన అనంతరం 1929లో బీ.ఏ. పూర్తి చేసింది. ఆ తర్వాత 1933లో సంస్కృతంలో ఎం.ఏ. పూర్తి చేసింది. అధ్యాపకురాలిగా తన జీవితాన్ని ప్రారంభించిన ఈమె.. పదవీ విరమణ సమయానికి ప్రయాగ మహిళా విద్యాపీఠానికి ప్రధానాచార్యులైంది.

ఆనాడు సమాజంలో మహిళలకు అంతగా గౌరవం లభించేది కాదు. ఆడపిల్ల పుడితే భారంగా భావించేవారు. వారికంటూ స్వేచ్ఛాజీవితం వుండేది కాదు. సమాజానికి తలొగ్గి, సంస్కృతి-సంస్కారాలకు లొంగి, ఇంటిపట్టానే వుండేవారు. అటువంటి రోజుల్లో జన్మించిన ఈమె.. మహిళల అనుభవిస్తున్న ఆవేదనను చూసి చలించిపోయింది. ఈమె కూడా బాల్యంలో ఎన్నో కష్టాలు అనుభవించింది. అవే ఈమెను కవియిత్రిగా మార్చాయి అనవడంలో సందేహం లేదు. సాధారణ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు, ఆవేదనలు చూసి చలించిపోయిన ఆమె.. వాటిని కళ్లకు అద్దినట్లుగా కవిత్వాల రూపంలో అందరికీ తెలియజేసింది. ఈమె మానసిక క్షోభను ఎంత హృద్యంగా వర్ణించిందంటే.. ‘దీపశిఖ’లో అది ప్రతి మనిషి వేదనగా అందరి హృదయాలను హత్తుకుంది. అది పాఠకులను ఎంతో ప్రభావితం చేసింది. ప్రతిభావంతమైన కవయిత్రి, గద్య రచయితైన ఈమె.. సాహిత్య, సంగీతాల్లో నైపుణ్యంతోపాటు చక్కటి చిత్రకారిణి, సృజానాత్మక అనువాదకురాలు కూడా. ఈమెకు బాల్యవివాహమైనా జీవితం మొత్తం అవివాహిత మాదిరిగానే గడిపింది.

ఈమెకు హిందీ సాహిత్యంలోని ఎన్నో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అందాయి. భారత సాహిత్యాకాశంలో ధృవతారగా పిలువబడే ఈమె.. గత శతాబ్దంలో అత్యంత లోకప్రియమైన మహిళా సాహిత్యకారిణిగా వెలుగొందింది. ప్రముఖ కవి సూర్యకాంత్ త్రిపాఠీ నిరాలా ఈమెను ‘విశాల హిందీ మందిరపు సరస్వతి’గా అభివర్ణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahadevi varma  modern meera  women activists  

Other Articles