The Biography Of Kiran Desai Who Is An Indian Famous Author | Women Empowerment

Kiran desai biography indian famous author

Kiran Desai biography, Kiran Desai life history, Kiran Desai special story, Kiran Desai biodata, Kiran Desai novels, author Kiran Desai wikipedia, Kiran Desai wiki in telugu, Kiran Desai story

Kiran Desai Biography Indian Famous Author : The Biography Of Kiran Desai Who Is An Indian Famous Author. Her novel The Inheritance of Loss won the 2006 Man Booker Prize and the National Book Critics Circle Fiction Award.

సాహిత్య రంగంలో శిఖరాలకెగిసిన కెరటం

Posted: 09/04/2015 06:43 PM IST
Kiran desai biography indian famous author

సాహిత్యరంగంలో ఎందరో రచయితలు, రచయిత్రిలు ఎంతోమంది పుట్టుకొచ్చారు. తమతమ మేధోశక్తిని ప్రపంచానికి తెలియజేయడంలో తీవ్ర శ్రమ చేశారు. అయితే.. వారిలో కేవలం కొందరు మాత్రమే విజయ సాధించారు. తమ కలానికి పదునుపెట్టి, ప్రజలకు కొన్ని కీలకమైన అంశాల్లో చైతన్యం-ఉత్తేజం-అవగాహన కల్పించడంలో సక్సెస్ అయ్యారు. ఆ రంగంలో అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. అలాంటివారిలో కిరణ్ దేశాయ్ ఒకరు. బాల్యం నుంచే ఎంతో చురుకుగా వుండే ఈమె.. తన ప్రతిభతో ప్రపంచప్రఖ్యాత రచయితల్లో తన పేరు లిఖించుకుంది.

జీవిత విశేషాలు :

1971 సెప్టెంబర్ 3వ తేదీన న్యూఢిల్లీ నగరంలో కిరణ్ దేశాయ్ జన్మించింది. ఈమె ప్రముఖ రచయిత్రి అనితా దేశాయ్ కుమార్తె. కిరణ్ కు 14 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు ఢిల్లీలోనే నివసించిన తల్లీకూతుళ్లు.. ఆ తర్వాత ఏడాదిపాటు ఇంగ్లాండులో నివశించారు. చివరకు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు మకాం మార్చారు. అక్కడ హోలిన్స్ యూనివర్శిటీకి చెందిన బెన్నింగ్టన్ కళాశాల, కొలంబియా యూనివర్శిటీలలో సృజనాత్మక రచనలను కిరణ్ ఆభ్యాసం చేసింది.

తన విద్యాభ్యాసం ముగిసిన తర్వాత 1998లో ఆమె రాసిన తొలి నవల ‘హుల్లాబాలూ ఇన్ ది గువా ఆర్చర్డ్’ ప్రచురించబడింది. దాంతో ప్రపంచదేశాల్లో ప్రఖ్యాతగాంచిన వ్యక్తుల నుంచి ఆమెకు ప్రశంసలు అందాయి. అలాగే 35 ఏళ్ల లోపు ఉన్న కామన్వెల్త్ దేశాల పౌరులు రచించిన ఉత్తమ సృజనాత్మక నవలలకు రచయితల సంఘం అందించే బెట్టీ ట్రాస్క్ అవార్డును కూడా అది గెలుచుకుంది. ఆ మొదటి నవల తర్వాత ఆమె రాసిన రెండో నవల ‘ది ఇన్‌హెరిటెన్స్ ఆఫ్ లాస్’(2006)కు ఆసియా, ఐరోపా, అమెరికా సంయుక్త రాష్ట్రాల వ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు విశేషంగా అందాయి. అంతేకాదు.. 2006 మ్యాన్ బుకర్ ప్రైజు, 2006 నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ కాల్పనిక అవార్డును కూడా ఈమె గెలుచుకుంది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఆమె రచనాశక్తి ఎటువంటిదో!

ఇక 2007 సెప్టెంబరులో BBC రేడియో 3లో మైఖేల్ బర్కిలీ నిర్వహించిన జీవితచరిత్ర సంబంధ సంగీత చర్చా కార్యక్రమం ప్రైవేట్ ప్యాషన్స్‌ కు ఆమె అతిథిగా హాజరయింది. మే, 2007లో ప్రారంభ ఆసియా హౌస్ ఫెస్టివల్ ఆఫ్ ఆసియన్ లిటరేచర్‌ లో ఆమె విశిష్ట రచయిత్రి గౌరవాన్ని దక్కించుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kiran Desai  Indian Women Authors  

Other Articles