The Biography Of Lakshmibai Who Was Princess Of Jhansi | Indian Rebellion of 1857

Jhansi lakshmibai biography princess of jhansi indian rebellion

Lakshmibai biography, jhansi lakshmibai history, Lakshmibai life story, Lakshmibai hisory, Lakshmibai special story, jhansi lakshmibai wikipedia, indian rebellion 1857

Jhansi Lakshmibai Biography Princess Of Jhansi Indian Rebellion : The Biography Of Lakshmibai Who was one of the leading figures of the Indian Rebellion of 1857 and became for Indian nationalists a symbol of resistance to the British Raj.

బ్రిటీష్ సేనలతో పోరాడిన వీరవనిత లక్ష్మీబాయి

Posted: 08/22/2015 03:54 PM IST
Jhansi lakshmibai biography princess of jhansi indian rebellion

బ్రిటీష్ పరిపాలనాకాలంలో వారి ఆకృత్యాలను అణిచివేసి, దేశాన్ని స్వాతంత్ర్యం దిశగా తీసుకెళ్లిన స్వాతంత్ర్య సమరయోధులతోపాటు వీరవనితలు ఎందరో వున్నారు. ఓవైపు విదేశీ పాలకులతో పోరాడుతూనే.. మరోవైపు ప్రజారంజకంగా పాలించిన మహారాణులు మన దేశంలో జన్మించారు. అలాంటి వారిలో ధీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి ఒకరు. దేశ చరిత్రలోనే తొలిసారిగా మహిళా సైన్యాన్ని తయారుచేసిన ఘటన ఆమెది. ఈమె జీవించింది కేవలం 23 సంవత్సరాలే అయినప్పటికీ.. ఆమె అందించిన స్ఫూర్తి నేటికీ యువతలో ఉత్తేజాన్ని నింపుతోంది.

జీవిత విశేషాలు :

1828 నవంబర్ 19వ తేదీన కాశీలో లక్ష్మీబాయి జన్మించింది. రాజుల కాలంలో జన్మించిన ఈమె.. బాల్యంలోనే గుర్రపు స్వారీ, కత్తిసాముల్లో ఆరితేరింది. ఈమెకు పదమూడవ ఏటలో ఝాన్సీ రాజు గంగాధరరావుతో వివాహం జరిగింది. ఆ పెళ్ళి తర్వాత ఈమె జీవితం పూర్తిగా మలుపు తిరిగింది. ఈమె 17వ ఏటలో వున్నప్పుడు ఓ కుమారునికి జన్మనివ్వగా.. కొన్ని రోజులకే ఆ బాలుడు మరణించాడు. దీంతో లక్ష్మీబాయి దంపతులు ‘దామోదరరావు’ అనే అబ్బాయిని దత్తత తీసుకున్నారు. ఆ దత్తతను ఆమోదించాల్సిందిగా బ్రిటీష్ వారికి వారు అర్జీ కూడా పెట్టుకున్నారు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న తరుణంలో గంగాధరరావు మరణించాడు. దీంతో రాజ్యపాలన మొత్తం లక్ష్మీబాయి మీదే పడింది. ఆ తర్వాత లక్ష్మీబాయికి కష్టాలు మరిన్ని ఎక్కువయ్యాయి.

ఆనాటి బ్రిటీష్ గవర్నర్ అయిన డల్హౌసి... లక్ష్మీబాయి భర్త గంగాధర మరణించడంతో దామోదరరావును దత్తత తీసుకోవడం చెల్లదని, రాజ్యాన్ని బ్రిటీష్ వారికి స్వాధీనం చేసి వెళ్లాలని ఆమెని ఆదేశించాడు. అందుకు ఆమె ఏమాత్రం ఒప్పుకోలేదు. దీంతో బ్రిటీష్ వారు తమదైన పన్నాగాలు పన్ని, ఝాన్సీ రాజ్యంపైకి సరిహద్దు రాజ్యపాలకులను రెచ్చగొట్టింది. ఈ విషయాన్ని పసిగట్టిన లక్ష్మీబాయి.. తన రాజ్య సంరక్షణ కోనం నడుం బిగించి పెద్దఎత్తున సైన్యాన్ని తయారుచేసింది. ఇందులో భాగంగానే మహిళలకు సైతం శిక్షణనిచ్చి వారిని సైన్యంలో చేర్చుకుంది. ఈ సమయంలోనే ఆమె భారత స్వాతంత్ర్యంపై చైతన్యం కల్పించింది. ఈ క్రమంలోనే ఆమె సిపాయి ఉద్యమంలో పాలుపంచుకుంటున్న నానాసాహెబ్, రావుసాహెబ్, తాంతియా తోపేలతో చేతులు కలిపింది. ఇంతలోనే బ్రిటీష్ సేనలు ఝాన్సీలో ప్రవేశించి ప్రజల్ని నానా ఇబ్బందులకు గురిచేయడం మొదలుపెట్టాయి.

ఝాన్సీకి స్వేచ్చ కలిగించి లక్ష్మిబాయి ని స్వతంత్రుపరురాలు చేయటానికి తిరుగుబాటు దార్ల నాయకుడైన తాత్యా తోపే ఆధ్వర్యములో 20,000 మంది సైన్యం పంపబడింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర 1,540 సిపాయిలు మాత్రమే ఉన్నప్పటికీ.. వీళ్ళు చాలా శిక్షణ పొందినవాళ్ళు కావడంతో అనుభవం లేని తోపే సిపాయిలు పారిపోయారు. లక్ష్మిబాయి బలగాలు బలహీనమవడంతో మూడు రోజుల తరువాత బ్రిటిష్ వాళ్ళు నగర గోడలను చీల్చుకొని నగరాన్ని ఆక్రమించుకోగలిగాయి. ఆమె తన రక్షకులు చుట్టూ ఉండడంతో ఆ రాత్రి గోడ దూకి నగరం నుంచి పారిపోగలిగింది. బ్రిటిష్ సైన్యం క్రమంగా ఝాన్సీని ముట్టడించడం ప్రారంభించింది. రెండు వారాల పోరాటం తర్వాత ఆంగ్లేయులు నగరాన్ని చేజిక్కించుకోగలిగారు. కానీ రాణి మాత్రం మగ వేషంలో దత్తత తీసుకున్న చిన్న బిడ్డను వీపున తగిలించుకుని వారి కన్నుగప్పి పారిపోయింది. కల్పి అనే ప్రదేశానికి చేరుకుని తాంతియా తోపే అనే విప్లవ కారుణ్ణి కలుసుకోగలిగింది.

తాత్యా తోపే ఉండే తిరుగుబాటు దారులతో చేరింది. రాణి, తాత్యా తోపే గ్వాలియర్ కు వెళ్లి తమ తిరుగుబాటు బలగాలను ఒకటి చేసి గ్వాలియర్ మహారాజ సైన్యాన్ని ఓడించి తమ బలగాలతో వాళ్ళను పూర్తిగా నశించి పోయేలా చేసారు. తరువాత వాళ్ళు కపటోపాయముతో గ్వాలియర్ కోటను ఆక్రమించుకొన్నారు. కాని.. 1858 జూన్ 17వ తేదీన రెండో రోజు యుద్ధంలో రాణి మరణించింది. ఆమె బుల్లెట్ గాయాలు తగిలి మరణించిందని సమాచారం. ఇలా ఈ విధంగా రెండు వారాలపాటు విదేశీ సైన్యంతో వీరోచితంగా పోరాడి, వీరమరణం పొందింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Jhansi Lakshmibai  Indian Rebellion 1857  

Other Articles