The Biography Of Actress Vijayashanti | Indian actors | Telugu Film Industry

Vijayashanti special story on her filmography and political life

Vijayashanti biography, Vijayashanti special story, Vijayashanti news, Vijayashanti birthday, Vijayashanti updates, Vijayashanti political life, Vijayashanti filmography, Vijayashanti birthday special, Vijayashanti birthday, Vijayashanti history

Vijayashanti special story on her Filmography and political life : The Biography Of Actress Vijayashanti who named as vishwanata bharati in south india film industry.

విశ్వనట భారతిగా పేరుగాంచిన నటి విజయశాంతి

Posted: 06/24/2015 04:14 PM IST
Vijayashanti special story on her filmography and political life

చిత్రపరిశ్రమవంటి రంగుల ప్రపంచంలో విహరించిన నటీనటుల్లో కేవలం కొందరు మాత్రమే చిరకాల గుర్తింపు లిఖించుకున్నారు. అలాంటి వారిలో విజయశాంతి కూడా ఒకరు. దక్షిణ సినీ ఇండస్ట్రీలో పేరుగాంచిన నటీమణుల్లో ఒకరైన ఈమె.. ‘విశ్వనటభారతి’గా పేరుగాంచింది. కథానాయికగా పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి నాలుగేళ్లపాటు కేవలం గ్లామర్ పాత్రలనే పోషించిన ఈమె.. ఆ తర్వాత యాక్షన్ పాత్రలను కూడా పోషించింది. తనదైన నటనాశైలితో ఎంతోమంది తెలుగు, తమిళ ప్రేక్షకులను తన అభిమానులుగా చేసుకుంది. తొలినాళ్లలో నటించిన సినిమాలు ఈమెకి అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు కానీ.. క్రమక్రమంగా ఈమె ఒక్కో మెట్టు అధిరోహిస్తూ.. ఇండస్ట్రీ చరిత్రలోనే మరే నటి అందుకోలేని స్థాయికి ఎదిగింది.

జీవిత చరిత్ర :

1964 జూన్ 24వ తేదీన విజయశాంతి వరంగల్లో జన్మించింది. అయితే.. ఈమె పెరిగింది మాత్రం మద్రాసులో! విజయశాంతి పిన్ని విజయలలిత కూడా అలనాటి తెలుగు సినిమా నటియే! విజయశాంతి అసలు పేరు శాంతి. ఆమె పేరులోని విజయ తన పిన్ని విజయలలిత పేరు నుండి గ్రహించబడింది. విజయశాంతి తన 7వ ఏటలోనే బాలనటిగా చిత్రపరిశ్రమలోకి ప్రవేశించినట్లు వార్తలున్నాయి కానీ.. ఖచ్చితమైన వివరాలు మాత్రం లేవు.

సినీరంగ జీవితం :

తమిళ దర్శకుడు భారతీరాజా ఈమెను కథానాయికగా వెండితెరకు పరిచయం చేశారు. 1979లో ఆయన దర్శకత్వం వహించిన తమిళ సినిమా ‘కల్లుక్కుళ్ ఈరమ్’ (రాళ్లకూ కన్నీరొస్తాయి) తో విజయశాంతి కథానాయికగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. అప్పుడు ఈమెకు 15 ఏళ్లు మాత్రమే! అనంతరం ఈమె తన మాతృభాష తెలుగులో నటించిన తొలి చిత్రం ‘కిలాడి కృష్ణుడు’ అదే ఏడాది (1979) అక్టోబర్ లో ప్రారంభమై ఆ తరువాతి సంవత్సరం విడుదలైంది. కథానాయికగా ఈమెకు తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడం కోసం నాలుగేళ్లు నిరీక్షణ చేయగా... 1983లో టి. కృష్ణ రూపంలో అదృష్టం ఆమె తలుపు తట్టింది. ఆయన తెరకెక్కించిన ‘నేటి భారతం’ చిత్రం ఘనవిజయం సాధించింది. అందులో ఈమె కథానాయిక పాత్రలో జీవించి.. మంచి మార్కులు కొట్టేసింది. ఆ చిత్రంలో ఈమె నటనకు ఏపీ ప్రభుత్వం ఉత్తమ నటిగా నంది బహుమతి ప్రదానం చేసింది.

ఇక అప్పటినుంచి ఈమె ఐదేళ్లపాటు ఒకదాని వెనుక ఒకటిగా తెలుగు, తమిళ భాషల్లో విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ దూసుకుపోయింది. గ్లామర్, యాక్షన్, ప్రధానపాత్రల్లో నటిస్తూ.. ప్రేక్షకులను మెప్పించి ఆల్ రౌండర్ గా అనిపించుకుంది. ఈ క్రమంలోనే 1990లో విజయశాంతి నటించిన ‘కర్తవ్యం’ చిత్రం ఆమె జీవితాన్ని మరో మలుపు తప్పింది. తానే స్వయంగా నిర్మించిన ఆ చిత్రం అఖండ విజయం సాధించడంతోపాటు ఆమెకు ఎన్నో అవార్డులు సాధించిపెట్టింది. ఆ చిత్రంలో ఐ.పి.ఎస్. అధికారిణిగా నటించిన ఈమెకు లేడీ అమితాబ్, యాంగ్రీ యంగ్ ఉమెన్, ఫైర్ బ్రాండ్ వంటి బిరుదుల్ని తెచ్చిపెట్టింది. ఇక ‘భారతనారి’ చిత్రంతో విజయశాంతి తన నూరవ చిత్రాన్ని పూర్తి చేసుకుంది. అప్పటి స్టార్ హీరోలందరితోనూ విజయశాంతి ఎన్నో సినిమాల్లో నటించింది. హీరోలకు సమానంగా ఈమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా వుండేది కూడా!

1997లో విజయశాంతి నటించిన ‘ఒసేయ్ రాములమ్మా’ చిత్రం తెలుగు చిత్రసీమలో ఎన్నో రికార్డులను బద్దలుకొట్టింది. ఆ చిత్రంలో విజయశాంతి పోషించిన ‘రాములమ్మ’ పాత్ర బాగా ప్రజాదరణ పొందడంతో.. అప్పటినుంచి ప్రేక్షకులు ఈమెను ‘రాములమ్మ’గా పిలుచుకోవడం ప్రారంభించారు. అయితే.. ఈ చిత్రం తర్వాత విజయశాంతికి అంతగా విజయాలు దక్కలేదు. దాంతో ఈమె నటించే సినిమాల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. ఇంతలోనే ఈమె రాజకీయరంగంలో కాలు పెట్టడంతో సినిమా రంగానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వలేకపోయింది. నటిగా నటించేందుకు అవకాశం వున్నప్పటికీ.. ఈమె రాజకీయాలవైపే తన దృష్టి సారించింది. కానీ.. రాజకీయరంగంలో ఆమె అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijayashanti  Indian actresses  telugu film industry  

Other Articles