Kunjarani Devi Biography | Indian sportswoman in weightlifting

Kunjarani devi biography indian weight lifter

Kunjarani Devi news, Kunjarani Devi updates, Kunjarani Devi biography, Kunjarani Devi history, Kunjarani Devi life story, Kunjarani Devi records, Kunjarani Devi biodata, indian weight lifter, indian sports persons

Kunjarani Devi biography indian weight lifter : Kunjarani Devi is the most decorated Indian sportswoman in weightlifting. started taking interest in sports while still in Imphal's Sindam Sinshang Resident High school in 1978.

వెయిట్ లిఫ్టింగ్ ఆటలో పేరుగాంచిన భారతీయ క్రీడాకారిణి

Posted: 04/11/2015 06:08 PM IST
Kunjarani devi biography indian weight lifter

సుసంపన్నమైన భారతదేశంలో గర్వించదగ్గ ఎందరో ప్రతిభావంతమైన మహిళలు జన్మించారు. కొందరు స్త్రీ అభ్యుదయం కోసం ఎన్నో కష్టనష్టాలను ఓర్చి అందరికీ ఆదర్శంగా నిలవగా.. మరికొందరు తాము పురుషులకంటే ఏమాత్రం తీసిపోమని సవాలు చేస్తూ సత్తా చాటినవాళ్లున్నారు. అలాంటివారిలో ‘నమేఐరక్పం కుంజరిని దేవి’ ఒకరు. భారతదేశంలోని ఓ వెనుకబడిన రాష్ట్రంలో సామాన్య కుటుంబంలో జన్మించిన ఈమె.. వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో తన ప్రతిభ కనబరిచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

జీవిత చరిత్ర :

1968 మార్చి 1వ తేదీన మణిపూర్ లోని ఇంపాల్ లోగల కైరంగ్ మయై లేఇకై ప్రాంతంలో కుంజరిని దేవి జన్మించారు. 1978 ఇంపాల్ లోని సిండం సిన్శాంగ్ రెసిడెంట్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న రోజుల్లోనే ఈమెకు క్రీడల పట్ల ఎంతో ఆసక్తి వుండేది. ఆనాడు స్కూల్ లో నిర్వహించిన క్రీడల పోటీల్లో ఈమె పాల్గొనేది. ఇక ఇంపాల్ లోని మహారాజ బోధ చంద్ర కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అనంతరం ఈమె... తన సమయమంతా వెయిట్ లిఫ్టింగ్ నందు కేటాయించింది.

కుంజరని దేవీ క్రీడాచరిత్ర :

వెయిట్ లిఫ్టింగ్ క్రీడావిభాగంలో ట్రైనింగ్ తీసుకున్న ఈమె.. 1985వ సంవత్సరం మొదలుకొని జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల యందు 44 కిలోల, 46 కిలోల చివరగా 48 కిలోల విభాగాల పోటీల్లో పాల్గొంది. అప్పుడు ఆమె ఎక్కువగా బంగారు పతకాలు సాధించి అప్పట్లో రికార్డు సృష్టించింది.  1987లో త్రివేండ్రంలో జరిగిన పోటీలలో 2 రికార్డులు నెలకొల్పింది. 1994లో పూణేలో జరిగిన పోటీలలో మొదటిసారిగా 46 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించింది. మళ్లీ తిరిగి నాలుగేళ్ల తర్వాత మణిపూర్ లో జరిగిన పోటీలలో 48 కిలోల విభాగంలో వెండి పతకం సాధించింది.

ఇక 1989లో మాంచెస్టర్లో జరిగిన ప్రపంచ మహిళా వెయిట్ లిఫ్టింగ్ పోటీలో మొదటిసారి పాల్గొని... మూడు వెండి పతకాలు కైవసం చేసుకొని భారతదేశ ఔన్యత్వాన్ని చాటిచెప్పింది. అప్పటినుంచి 1993 మేల్బోర్ను పోటీలు మినహా వరుసగా ఏడుసార్లు జరిగిన ప్రపంచపోటీలలో పాల్గొని.. ప్రతిసారి వెండిపతకం సాధించింది. 1989 షాంఘైలో జరిగిన పోటీలలో ఒక వెండి, రెండు రజత పతకాలు గెలిచింది. అది మొదలుకొని 1991లో ఇండోనేషియాలో జరిగిన పోటీలో 44 కిలోల విభాగంలో మూడు వెండిపతకాలతో తన విజయ పరంపర కొనసాగించినది. 1990లో బీజింగ్, 1994లో హిరోషిమాలో జరిగిన ఆసియా క్రీడలలో రజతపతకాన్ని సాధించింది. కానీ 1998లో జరిగిన ఆసియా క్రీడలలో పతక సాధనలో విఫలమైంది.

1992లో థాయిలాండ్, 1993లో చైనా పోటీలలో తన రెండవ స్థానాన్ని సుస్థిరపరుచుకుంది. 1995లో దక్షిణకొరియా పోటీలలో 46 కిలోల విభాగములో అత్యుత్తమమైన ఆటతీరుతో రెండు బంగారు, ఒక రజతపతకం సాధించింది. కానీ 1996లో జపాన్ లో జరిగిన పోటీలలో రెండు వెండి, ఒక రజత పతకంతో సరిపెట్టవలసి వచ్చింది.

అవార్డులు - రివార్డులు :

1990లో ఆమెను అర్జున అవార్డు, లియాండర్ పేస్ తో కలిపి 1996-1997లో రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డులు వరించాయి. అదే సంవత్సరం ఆమె కే.కే బిర్లా అవార్డు గెలుచుకుంది. ఆమె ఖాతాలో యాబైకి పైగా అంతర్జాతీయ అవార్డులు ఉన్నాయి. 2006 మెల్బోర్న్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో 48 కిలోల విభాగంలో బంగారుపతకాన్ని గెలవడమేకాక 72 కిలోలు , 94 కిలోల ఉమ్మడి విభాగంలో రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం ఈమె సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ నందు అసిస్టెంటు కమాండెంట్ గా పనిచేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kunjarani Devi  indian sportswoman  

Other Articles