Krishna kumari biography telugu old film industry famous heroine

krishna kumari news, actress krishna kumari movies, actress krishna kumari movies, krishna kumari biography, krishna kumari history, krishna kumari wikipedia, krishna kumari wiki telugu, krishna kumari history, krishna kumari photos, krishna kumari family, krishna kumari husband, krishna kumari

krishna kumari biography telugu old film industry famous heroine : The biography of krishna kumari who is the famous actress in old film industry. She does very well movies with famous telugu actors.

అభినయానికి మారుపేరు.. తెలుగుదనానికి చిరునామా!

Posted: 03/10/2015 06:32 PM IST
Krishna kumari biography telugu old film industry famous heroine

పాత తరం తెలుగు సినిమారంగానికి చెందిన కథానాయిక ‘కృష్ణకుమారి’ని ‘అభినయానికి మారుపేరు.. తెలుగుదనానికి చిరునామా’గా అభివర్ణిస్తారు. ఈమె మాతృభాష తెలుగు కాకపోయినప్పటికీ.. అచ్చు తెలుగమ్మాయిలా హావభావాలు పలుకుతూ, ప్రేక్షకులను అలరించింది. అనతికాలంలోనే తెలుగు భాషను నేర్చుకుని సినీజనాలను ఆశ్చర్యపరిచింది. నటిగా తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్న ఈమె.. ఎందరో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

జీవిత చరిత్ర :

1936 మార్చి 6వ తేదీన పశ్చిమబెంగాల్ లో కృష్ణకుమారి జన్మించింది. నాన్నగారి ఉద్యోగరీత్యా తరచుగా బదిలీల కావడంతో ఈమె విద్యాభ్యాసం రాజమండ్రి, చెన్నై, అస్సాం, కలకత్తా మొదలైన ప్రదేశాలలో జరిగింది. మెట్రిక్ అస్సాంలో పూర్తయిన తర్వాత వీరి కుటుంబం మద్రాసుకు చేరింది. అక్కడే ఎక్కువకాలం వుండటంతో ఈమెకు అనుకోని ఓ సందర్భంలో సినీ అవకాశం వచ్చింది. ఇక అప్పటినుంచి ఈమె వెనుదిరగకుండా తన సినీ కెరీర్ ని విజయవంతంగా కొనసాగించింది.

సినీ జీవితం :

ఒకసారి కృష్ణకుమారి తన తల్లితో కలిసి ‘స్వప్నకుమారి’ సినిమా చూసేందుకు వెళ్లింది. అదే సమయంలో అక్కడికి ప్రముఖ గాయకుడు సౌందరరాజన్ కుమార్తె భూమాదేవి కూడా వచ్చింది. అప్పుడు కృష్ణకుమారిని చూసిన భూమాదేవి.. ఆమెకు సినిమాల్లో అవకాశం కల్పించాలని అనుకుంటుంది. వెంటనే ఆమె వారి దగ్గరకు చేరుకుని ‘నవ్వితే నవరత్నాలు’ సినిమా కోసం ఓ కథానాయికను వెతుకుతున్నట్లు కూడా చెప్పింది. ఇక తర్వాతి రోజే కృష్ణకుమారి ఇంటికి భూమాదేవి చేరుకుని, తల్లిదండ్రుల అనుమతి తీసుకుని ఆమెకు ఆ సినిమాలో కథానాయిక పాత్రను ఇచ్చారు. అలా ఆ విధంగా కృష్ణకుమారి 1951లో ‘నవ్వితే నవరత్నాలు’ సినిమా ద్వారా తెలుగు సినీరంగానికి పరిచయమయ్యారు.

ఇక ఆ తర్వాత ఆమె వరుసగా కథానాయికగా అవకాశాలు అందిపుచ్చుకుంది. ఆ సినిమా తర్వాత ఈమె నటించిన తర్వాత చిత్రం ‘పిచ్చి పుల్లయ్య’లో మంచి నటన కనబరిచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత నటించిన ‘పల్లె పడుచు, బంగారు పాప’ సినిమాల్లోని పాత్రలు ఈమెను పరిశ్రమలో ఓ స్థాయిలో నిలబెట్టాయి. మొత్తంగా సుమారు రెండు దశాబ్దాల నటజీవితంలో ఈమె సుమారు 110 సినిమాలలో నటించింది. వీటీలో ఎక్కువగా తెలుగు సినిమాలైతే... 15 కన్నడ చిత్రాలు, మరికొన్ని తమిళభాషా చిత్రాలున్నాయి. ఈమె ఆనాటి నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు, కృష్ణంరాజు, జగ్గయ్య, హరనాథ్, అందరు మహానటులతోను నటించి మెప్పించింది.

వ్యక్తిగత విషయాలు :

బెంగళూరుకు చెందిన అజయ్ మోహన్‌తో కృష్ణకుమారి వివాహమాడింది. నిజానికి వీరిది ప్రేమవివాహం. స్నేహితుల ద్వారా అజయ్ తో పరిచయం అయిన కుమారి.. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. అది 1969లో వివాహబంధంగా మారింది. వీరికి ఒక అమ్మాయి - దీపిక. వీరి అల్లుడు విక్రం మైయా, మనవడు పవన్. వ్యాపారరీత్యా భర్త బెంగుళూరులో ఉండగా ఈమె కూడా మద్రాసు వీడి బెంగుళూరులో మకాం పెట్టారు. కొంతకాలం విరామం తర్వాత అత్తమామల ప్రొత్సాహంతో తిరిగి నటించడం మొదలుపెట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : krishna kumari  telugu famous heroines  tollywood  

Other Articles