Protima bedi biography indian traditional dancer

protima bedi biography, protima bedi news, protima bedi life story, protima bedi latest news, protima bedi life history, protima bedi wikipedia, protima bedi telugu wiki, protima bedi story, protima bedi history telugu, protima bedi naked controversy

protima bedi biography indian traditional dancer : the biography of indian famous traditional dancer protima bedi. Actually first she started career as model. Then she creates sensation by running naked for bollywood news paper.

సెక్సీ మోడల్ నుంచి సాంప్రదాయ కళాకారిణిగా..

Posted: 01/10/2015 04:24 PM IST
Protima bedi biography indian traditional dancer

భారతీయ రంగంలో ఇప్పటివరకు ఎంతోమంది మహిళా కళాకారిణులు అద్భుతంగా తమ ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకాదరణ పొందినవాళ్లు వున్నారు. అయితే అందులో కేవలం కొంతమంది మాత్రమే శాశ్వతంగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. అటువంటివారిలో ప్రొతిమా గౌరీ బేడీ ఒకరు. మొదట భారతీయ సెక్సీ మోడల్’గా కెరియర్ సాధించిన ఈమె.. అప్పట్లో ఎన్నో వివాదాలను సృష్టించింది. కొన్ని దశాబ్దాల కాలం క్రితమే న్యూడ్’గా కనిపించి ఎన్నో విమర్శలకు గురైంది. అయితే తర్వాత కొన్నాళ్లకు ఈమె ఒడిస్సీ సాంప్రదాయ భారతీయ నృత్య కళాకారిణిగా మారింది.

జీవిత చరిత్ర :

బాల్యం - విద్యాభ్యాసం : 1948 అక్టోబరు 12వ తేదీన భారతదేశ రాజధాని ఢిల్లీలో లక్ష్మీచంద్ గుప్తా, రేబ దంపతులకు జన్మించింది. మొదట ఢిల్లీలో నివాసమున్న ఈ దంపతులు వృత్తిరీత్యా గోవాకి వెళ్లాల్సి వచ్చింది. తిరిగి అక్కడి నుంచి 1957లో ముంబయికి మారింది. అప్పుడు ప్రొతిమా వయస్సు 9 సంవత్సరాలుండగా.. ఆమె కొంతకాలం కర్నూల్ జిల్లాలోని తన మేనత్త దగ్గరకు పంపబడింది. అక్కడే స్థానిక పాఠశాలలో కొన్నాళ్లు విద్యాభ్యాసం చేసింది. తిరిగి అక్కడి నుంచి ముంబైకి వెళ్లిన తర్వాత అక్కడ బాలికల వసతి పాఠశాల అయిన కిమ్మిన్స్ హై స్కూల్’లో విద్యాభ్యాసం చేసింది. తరువాత ఆమె సెయింట్ జేవియర్ కళాశాల, బొంబాయి (1965–67) నుండి స్నాతక పట్టా పొందింది.

మోడలింగ్ రంగంలో : ఈమె విద్యాభ్యాసం చేస్తున్న రోజుల్లోనే మోడలింగ్ పై ఎక్కువ ఆసక్తి వున్న నేపథ్యంలో అటువైపు అడుగులు వేయసాగింది. 1960లోని చివరి రోజుల్లో ఆమె ప్రముఖ మోడల్ గా మారిపోయింది. ఇక అక్కడి నుంచి మోడల్’గానే కెరియర్’ను కొనసాగించిన ఆమె.. ఎన్నో వివాదాలను సృష్టించడంలో రికార్డు నమోదు చేసింది. 1974లో సినీబ్లిట్జ్ అనే బాలీవుడ్ పత్రిక ప్రారంభోత్సవం కోసం బొంబాయిలోని జుహు బీచ్‌లో పగటి సమయంలో నగ్నంగా పరుగెత్తి వార్తలలోకి ఎక్కింది. అప్పట్లో ఆమె అలా నగ్నంగా పరిగెత్తడంపై పెద్ద దుమారమే రేగింది. ఎందరో మహిళసంఘాలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నాట్య రంగంలో : 26 ఏళ్ల వయసున్నప్పుడు ఈమె భూలాభాయి మెమోరియల్ ఇన్స్టిట్యూట్ లో అనుకోకుండా ఇద్దరు నాట్యకారుల ఒడిస్సీ నృత్య ప్రదర్శనను చూసింది. అదే ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. వారు ప్రదర్శించిన ఆ కళావిధానానికి ముగ్ధులైన ఈమె.. ఆ నృత్యంవైపు అడుగులు వేసింది. ఆ నాట్యాన్ని నేర్చుకోవడం కోసం ఆమె ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. చివరగా ఆమె ఓ మోడల్ యువతి నుంచి ప్రొతిమా గౌరిగా రూపాంతరం చెందింది. అలా కళాకారిణిగా మారిన ఈమె 1990లో బెంగుళూరు సమీపంలో ఒక నాట్య గ్రామమైన 'నృత్యగ్రామ్'ను స్థాపించింది. కొంతకాలం తరువాత ఈమె తన విద్యార్ధులతో ఆప్యాయంగా గౌరి అమ్మగా అని పిలువబడింది.

జీవితంలో ఎదుర్కొన్న బాధలు - సమస్యలు :

మోడలింగ్ రోజుల్లో కబీర్ బేడీని కలుసుకున్న ప్రొతిమా.. అతడితోనే వివాహజీవితాన్ని కొనసాగించింది. నిజానికి చాలామందితో డేటింగ్ చేసిందికానీ.. చివరికి కబీర్’నే పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.  కుమారుడు సిద్ధార్థ్, కుమార్తె పూజా బేడి. కుమారుడు విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో స్కిజోఫ్రేనియా వ్యాధికి గురయ్యాడు. అది అతనిని మానసికంగా ఎంతో వేధించడంలో చివరికి 1997లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సంఘటన ప్రొతిమా జీవితాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. దీంతో ఆమె లేహ్’తో ప్రారంభించి హిమాలయ ప్రాంతంలో పర్యటించడం మొదలుపెట్టింది.

కుంభ మేళా సమయంలో రిషికేశ్ లో ఉన్నపుడు 1997 ఏప్రిల్ లో ఇచ్చిన ఒక వార్తాపత్రిక ముఖాముఖిలో ఆమె "నేను హిమాలయాలకు అంకితమవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ పర్వతాల పిలుపు నన్ను వాటి వద్దకు ఆకర్షించింది. దాని వలన ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు? ఏదో ఒక మంచే జరుగుతుంది" అని చెప్పింది. అలా చెప్పిన ఆమె ఆగష్టులో, ప్రొతిమా గౌరి, కైలాష్ మానసరోవర్ తీర్ధయాత్రకు బయలుదేరారు. అక్కడ హిమాలయాలలోని పితోరగర్ సమీపంలో మాల్ప కొండచరియ ప్రమాదం తరువాత ఆమె అదృశ్యమయ్యింది,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles