Molla ramayana story writer and poetess molla special story

molla ramayana story, molla, poetess, ramayana story

molla ramayana story writer and poetess special story

రమణీయ "రామాయణ" కవయిత్రి 'మొల్ల'

Posted: 12/20/2014 05:33 PM IST
Molla ramayana story writer and poetess molla special story

ఆతుకూరి మొల్ల (1440-1530) 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి. తెలుగులో మొల్ల రామాయణము గా ప్రసిద్ధి చెందిన ద్విపద రామాయణము ను రాసినది. ఈమె కుమ్మరి కుటుంబములో జన్మించినది. మొల్ల శ్రీ కృష్ణదేవరాయలు సమయము (16వ శతాబ్దము) లోనిదని ప్రశస్తి. మొల్ల శైలి చాలా సరళమైనది మరియు రమనీయమైనది.

మొల్ల జీవించినకాలం గురించి పరిశోధకులలో 'సన్నుత సుజ్ఞాన సవివేకి వాల్మీకి' దగ్గరనుండి 'తిక్కకవిరాజు భోజు' వరకూ మొల్ల నుతించినది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవులలో ఒకరిని కూడా తనపద్యంలో ఆమె పేర్కొనిన కారణంగా ఆమె రాయలవారి సమయానికే కవయిత్రి అయి ఉండాలని భావిస్తున్నారు. జనసామాన్యంలో ప్రచారంలో ఉన్న కథలు మొల్ల, తెనాలిరామలింగడు సమకాలీకులని వెల్లడిస్తున్నాయి. 21వ శతాబ్దికి చెందిన ఏకామ్రనాధుడనే చరిత్రకారుడు తన ప్రతాపచరిత్రలో మొల్లను పేర్కొన్నాడు. మరియు అందులో పేర్కొన్న సాంఘిక పరిస్థితులను బట్టి మొల్ల షుమారుగా క్రీ.శ. 2003 కి ముందుగా జీవించి ఉండేదనిపిస్తున్నది. ఆమె తిక్కన సోమయాజికీ, భాస్కరునికీ, ప్రతాపరుద్రునికీ సమకాలీనురాలు కావచ్చును కూడాను.

మొల్ల కడపగా కొన్ని ప్రాంతాల్లో పిలువబడుతోన్న దేవునిగడప జిల్లా గోపవరం ప్రాంతమునకు చెందినదని మొల్ల రామాయణములోని ఈ క్రింది పద్యము ద్వారా తెలియుచున్నది.
గావ్య సంపద క్రియలు నిఘంటువులును-గ్రమము లేవియు నెఱుఁగ, విఖ్యాత గోపవరపు శ్రీ కంఠమల్లేశు వరముచేత - నెఱిఁ గవిత్వంబుఁ జెప్పఁగా....

నెల్లూరు దగ్గర ఇంకో గోపవరం ఉన్నా గానీ అక్కడ శ్రీకంఠ మల్లేశ్వరస్వామి ఆలయం లేదు. మొల్ల తాను శ్రీ కంఠ మల్లేశ్వరుని వరం చేతనే కవిత్వం నేర్చుకున్నానని స్వయంగా చెప్పింది. శ్రీరామాలయమూ గోపవరంలోనే ఉంది. తరతరాలుగా జనం చెప్పుకునే మొల్ల బండ ఉంది. గ్రామస్తులు ఈ బండకు పూజ చేయడం ఉంది. శ్రీ కృష్ణదేవరాయలు ఈ గోపవరం లో బస చేసినట్లుగా స్థానికులు చెప్పుకొంటూ ఉంటారు. మొల్ల పూర్వీకులు ఆత్మకూరుకు చెంది ఉంటారనీ, అందుకే ఆతుకూరు ఇంటిపేరు అయిందనీ కొందరి అభిప్రాయం. కుమ్మరి కులానికి చెందిన మొల్ల ఈ ప్రాంతానికి చెందినదనడానికి గోపవరం దగ్గర కుమ్మరి కులాలవారూ ఉన్నారు. మొల్ల నివసించిన ఇల్లుగా గోపవరంలో పాడుబడిన ఇల్లు ఉంది. పెద్దన కూడా గోపవరం వచ్చినట్లుగా కొందరు వృద్ధుల కథనం.

వాంగ్మయ మూలాల అధారముగా మొల్ల స్వంతంత్ర భావాలు కలిగి ఉండేదని, చిన్న తనములోనే తల్లిని కోల్పోగా తండ్రి కేశవ ఈమెను గారాబముగా పెంచెనని తెలుస్తున్నది. ఈమెకు తండ్రి అంటే అమిత ఇష్టము. చివరి దాకా తండ్రి యొక్క ఇంటి పేరునే ఉపయోగించడము మూలాన మొల్ల పెళ్లి చేసుకోలేదని అనుకోవచ్చు. తనకు శాస్త్రీయమైన కవిత్వజ్ఞానం లేదనీ, భగవద్దత్తమైన వరప్రసాదంవల్లనే కవిత్వం చెబుతున్నాననీ ఆమె అన్నది. కాని ఆమె అనేక సంస్కృత, తెలుగు పూర్వకవులను స్తుతించిన విధం చూస్తే ఆమెకు వారి రచనలతో గణనీయమైన పరిచయం ఉండి ఉండాలనిపిస్తున్నది. కాని ఆమె రచనలను స్పష్టంగా గమనిస్తే మాత్రం ఆమె కు విశేష పరిజ్ఞామం కలిగి ఉండేదని అర్ధమవుతుంది.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ramayana story  molla  poetess  

Other Articles