Anjali devi biography telugu famous actress tollywood news

anjali devi, anjali devi latest news, anjali devi biography, anjali devi history, anjali devi wikipedia, anjali devi wiki, anjali devi life story, anjali devi story, actress anjali devi news, telugu actrresses, telugu heroines, telugu producers, tollywood news

anjali devi biography telugu famous actress tollywood news

అభినవ సీతమ్మగా ప్రసిద్ది చెందిన అంజలీదేవి!

Posted: 11/26/2014 03:33 PM IST
Anjali devi biography telugu famous actress tollywood news

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఎందరో తారలు తమ నటనాప్రతిభతో ప్రేక్షకులకు మెప్పించగలిగారుగానీ.. అందులో కొంతమంది మాత్రమే చిత్రంగంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును క్రియేట్ చేసుకోగలిగారు. ప్రస్తుతమున్న తారలకంటే ఇండస్ట్రీలో తొలినాళ్లలో వచ్చిన తారలే తన నటనాప్రతిభతో మంచి గుర్తింపు సాధించారు. అటువంటి తారల్లో ‘‘అంజలీదేవి’’ ఒకరు. 1950 - 75 తరానికి చెందిన నటీమణుల్లో ఒకరైన ఈమె.. అప్పట్లో తన అందంతోపాటు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించగలిగారు. ముఖ్యంగా ఆధ్యాత్మికపరమైన సినిమాల్లో ఎక్కువగా నటించారు. అందులో భాగంగానే సీత పాత్రలో అద్భుతమైన నటనాప్రతిభను ప్రదర్శించినందుకు ఈమె ‘‘అభినవ సీతమ్మ’’గా పేరుగాంచారు.

జీవిత విశేషాలు :

1927 ఆగష్ట్ 24వ తేదీన తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురంలో జన్మించింది. ఈమె అసలు పేరు అంజనీ కుమారి. చిన్నతనం నుంచి చాలా చురుకుదనాన్ని ప్రదర్శించేది. కాలక్రమంలో ఈమెకు అనుకోకుండా సినిమా అవకాశాలు లభించాయి. దీంతో వచ్చిన అవకాశాన్ని ఏమాత్రం వదులుకోకుండా తన నటనాప్రతిభను ప్రదర్శించి అందరినీ మెప్పించగలిగారు. సినీప్రస్థానంలోకి వచ్చిన తరువాత దర్శకుడు సి.పులయ్య ఆమెను పేరును అంజలీదేవిగా మార్చారు. ఇక అప్పటినుంచి ఆ పేరుతో ఆమె ప్రఖ్యాతగాంచారు. నిజానికి చిత్రపరిశ్రమలో వచ్చిన తొలినాళ్లలో కాస్త ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చిందిగానీ.. అనంతరం ఓ మంచి సదావకాశం రావడంతో అప్పటినుంచి సినీతారగా ఎదిగారు. ఈమె వివాహం సంగీత దర్శకుడు ఆదినారాయణరావుతో జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు.

సినీ ప్రస్థానం :

1936లో అంజలీదేవీ ‘‘రాజా హరిశ్చంద్ర’’ సినిమాలో ఓ చిన్న పాత్ర ద్వారా పరిశ్రమలకు పరిచయమైంది. ఆ తర్వాత ఆమెకు ‘‘కష్టజీవి’’ సినిమాలో కథానాయికగా అవకాశం వచ్చింది. ఆ వచ్చిన అవకాశాన్ని ఏమాత్రం వదులుకోకుండా నటిగా తన ప్రతిభను నిరూపించుకోగలిగింది. దాంతో ఆమెకు కాలక్రమంలో మరిన్ని ఆఫర్లు వరించాయి. ఈనేపథ్యంలోనే ఆమె ఎన్.టీ.రామారావు సరసన ‘‘లవకుశ’’ సినిమాలో నటించిన సీతపాత్రలో అందిరినీ మెప్పించగలిగింది. ఆ పాత్రే ఆమెకు పరిశ్రమలో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత ఆమెకు ‘‘అభినవ సీత’’గా పేరు వచ్చింది. ముఖ్యంగా ఆ పాత్ర అప్పటి గ్రామీణ మహిళలను ప్రభావితం చేసింది. ఆ సినిమా అనంతరం కొన్నాళ్ల తర్వాత కొన్ని గ్రామాలను సందర్శించడానికి వెళితే.. కొంతమంది ఆమెను నిజమైన సీతాదేవిగా భావించిన సందర్భాలూ వున్నాయని 1996లో ఓ వార్తపత్రిక ముఖాముఖిలో స్వయంగా ఆమే పేర్కొన్నారు.

ఇక ఆ సినిమా తర్వాత ఆమె చాలా సినిమాల్లో నటించింది. ‘‘సువర్ణసుందరి, అనార్కలి’’ చిత్రాల్లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రతిఒక్క సినిమాలోనూ తనదైన నటనాశైలితో ప్రేక్షకులను మెప్పించగలిగిన ఈమె.. దాదాపు 500 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించింది.  బృందావనం(1992), అన్న వదిన(1993) మరియు పోలీస్ అల్లుడు(1994) ఆమె నటజీవితంలో చివరి చిత్రాలు. ఈమె కేవలం నటిగానే కాదు.. నిర్మాతగా కూడా వ్యవహరించారు. అక్కినేని నాగేశ్వరరావుతో జతకట్టిన ‘‘అనార్కలి’’ సినిమాను ఆమె స్వయంగా నిర్మించారు. ఆ తర్వాత  భక్త తుకారాం (1973), చండీప్రియ (1980) నిర్మించారు. ఆమె ఏర్పాటు చేసిన అంజలీ పిక్చర్స్ సంస్థ ద్వారా మొత్తం 27 సినిమాలను నిర్మించారు.

పురస్కారాలు

ఫిలింఫేర్ అవార్డ్

    ఉత్తమ నటి - తెలుగు - అనార్కలి (1955)
    ఉత్తమ నటి - తెలుగు - సువర్ణ సుందరి (1957)
    ఉత్తమ నటి - తెలుగు - చెంచు లక్ష్మి (1958)
    ఉత్తమ నటి - తెలుగు - జయభేరి (1959)
    ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్.
    రఘుపతి వెంకయ్య పురస్కారం - 2005 లో తెలుగు సినీరంగం జీవితకాల సాఫల్యత గురించి.
    రామినేని పురస్కారం - 2006.
    ANR జాతీయ పురస్కారం - 2008.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anjali devi  telugu actresses  tollywood producers  telugu news  

Other Articles