Jhalkari bai biography indian woman soldier jhansi laxmibai kingdom

Jhalkari Bai, jhansi laxmi bai, 1857 indian rebellion, indian women soldier, indian freedom fighters, Jhalkari Bai biography, Jhalkari Bai news, Jhalkari Bai history, Jhalkari Bai life story, Jhalkari Bai life history, jhansi laxmibai biography, jhansi laxmi bai history

Jhalkari Bai biography indian woman soldier jhansi laxmibai kingdom

ఝాన్సీ లక్ష్మీబాయి పరాక్రమాన్ని తలపించే ‘ఝల్కారీబాయి’

Posted: 11/22/2014 01:33 PM IST
Jhalkari bai biography indian woman soldier jhansi laxmibai kingdom

భారతదేశ చరిత్ర పుస్తకాలను ఒక్కసారి తెరిచిచూస్తే.. కాలగర్భంలో కలిసిపోయిన కొన్ని నిష్టురసత్యాలు వెలుగులోకి వస్తాయి. చరిత్రలో వెలుగులోకి వచ్చిన విషయాలు ఎన్ని వున్నాయి... బయటకురాని మరికొంతమంది జీవితగాధలు అంతే వున్నాయి. ముఖ్యంగా స్వాతంత్ర్యపోరాటంలో కీలకపాత్రలు వహించిన వారిలో చాలామంది విషయాలు ఇంకా వెలుగులోకి రాలేదు. అటువంటివారిలో ‘ఝల్కారిబాయి’ జీవిత చరిత్రను కూడా ఒకటిగా పరిగణలోకి వస్తుంది. ఈమె జీవిత చరిత్ర ఎంత విలక్షణమైందంటే.. ఝాన్సీ లక్ష్మీబాయి పరాక్రమాన్ని తలపించే అరుదైన చరిత్రకు ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఒక దళిత కుటుంబం నుంచి వచ్చిన ఈ సిపాయి.. ప్రథమ భారతదేశ స్వాత్రంత్యం పోరాటంలో భాగంగా కీలకభూమికను పోషించింది.

జీవిత విశేషాలు :

1830 నవంబర్ 22వ తేదీన ఝాన్సీ సమీపంలోని భోజ్‌లా గ్రామంలో కోరీ కులానికి చెందిన సదోవర్ సింగ్, జమునాదేవి దంపతులకు ఝల్కారిబాయి జన్మించింది. వీరిది నిరుపేద వ్యవసాయకూలీ కుటుంబం. చిన్నవయస్సులోనే తండ్రియే ఈమె ఆలనాపాలనా అన్ని చూసుకున్నారు. ఆయన పెంపకంలోనే ఈమె గుర్రపుస్వారీ, కత్తిసాము వంటి యుద్ధ విద్యలు నేర్చుకుని వీరనారిగా ఎదిగింది. ఒకనాడు పశువులను మేపడానికి అడివిలోకి ఝల్కారీ తీసుకెళ్లగా.. అక్కడ ఈమెపై చిరుతపులి దాడిచేసింది. అప్పుడు ఈమె ఏమాత్రం భయపడకుండా ఎంతో సాహసంగా దానిని ఎదుర్కొంది. తన చేతిలో వున్న కర్రసహాయంతో ఎంతో చాకచక్యంగా దానిని హతమార్చేసింది. ఆ ఘటన అప్పట్లో సంచలనంగా మారిపోయింది. కొన్నాళ్ల తర్వాత ఈమె వివాహం ఝాన్సీలక్ష్మీబాయి సైన్యంలో ఆయుధ విభాగంలో పనిచేస్తున్న పూరణ్‌సింగ్‌’తో జరిగింది. తదనంతరకాలంలో లక్ష్మీబాయికి సన్నిహితమై సైన్యంలో చేరి ‘దుర్గావాహిని’ మహిళా సాయుధ దళానికి నాయకత్వం వహించింది.

ఆనాడు సిపాయి తిరుగుబాటు సందర్భంగా శత్రుసేనలతో జరిగిన యుద్ధంలో ఈమె బ్రిటీష్ సేనలను బాగానే ఇబ్బందులు పెట్టింది. 1858 ఏప్రిల్ 3న బ్రిటిష్ జనరల్ హగ్ రోజ్ నాయకత్వంలో బ్రిటిష్ సేనలు ఝాన్నీ రాజ్యాన్ని చుట్టుముట్టాయి. అప్పుడు ఆ దాడి నుంచి లక్ష్మీబాబు తప్పించుకుని పారిపోగా.. ఝల్కారీబాయి తానే ఝాన్సీలక్ష్మీబాయినంటూ కోట ముందు ప్రత్యక్షమై బ్రిటిష్ సేనలను ముప్పుతిప్పలు పెట్టింది. అందరూ ఆమెనే లక్ష్మీబాయి అని అనుకున్నారు. ఆ దాడిలో బ్రిటీష్ సేలను ఝల్కారీ బాగానే ఎదుర్కొందికానీ.. వారిసైన్యం మరీ ఎక్కువగా వుండటంతో ఆమె బందీగా పట్టుబడింది. అయితే ఆమె లక్ష్మీబాయి కాదని బ్రిటీష్ సేనలు గుర్తుపట్టేశారు. అంతే! ఆమెను చంపేశారా..? లేదా..? అన్నది మాత్రం రహస్యంగానే మిలిగి వుండిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles