Unnava lakshmibai biography who is freedom fighter and also social activist

unnava lakshmibai news, unnava lakshmibai history, unnava lakshmibai life story, unnava lakshmibai life history, unnava lakshmibai story, unnava lakshmibai wikipedia, unnava lakshmibai wikipedia in telugu, unnava lakshmibai wiki, unnava lakshmibai biography, unnava lakshmibai, unnava lakshmi narayana, indian freedom fighters, indian social activists

unnava lakshmibai biography who is freedom fighter and also social activist

స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న తెలుగు సంఘసంస్కర్త!

Posted: 10/31/2014 04:26 PM IST
Unnava lakshmibai biography who is freedom fighter and also social activist

ఒకప్పుడు భారతదేశంలో మహిళలు, అమ్మాయిలపై జరుగుతున్న అన్యాయాలను అణిచివేయడానికి ఎందరో సంఘసంస్కర్తలు ముందుకువచ్చారు. మహిళలక్కూడా పురుషులులాగే సమాజంలో సమానగౌరవ మర్యాదలు కల్పించాలంటూ ఎందరో మహిళలు తమ గొంతు విప్పారు. ఆనాడు భర్త కోల్పోయిన భార్యలైన వితంతులను ఎంతో దారుణంగా హింసించేవారు. ఇతరులతో మాట్లాడనివ్వకుండా ఇంట్లోనే పరిమితం చేస్తూ రాత్రింబవళ్లు కష్టపెట్టేవారు. అటువంటి దురాగతాలను అణిచివేయడానికి చాలామంది ప్రముఖులు ముందుకొచ్చారు. అటువంటివారిలో ఉన్నవ లక్ష్మీబాయమ్మ ఒకరు. ఈమె గొప్ప సంఘసంస్కరిణిగా పేరొందారు. దేశంలో జరుగుతున్న అన్యాయాలను అరికడుతూ.. పేదప్రజలకు సేవచేయడంలో ఈమె ఎప్పటికీ ముందుండేవారు. గుంటూరు శారదా నికేతనము స్థాపకురాలుగా ప్రసిద్ధి చెందినది.

జీవిత చరిత్ర :

1882లో గుంటూరుజిల్లా సత్తెనపల్లి తాలూకాలోని అమీనాబాద్ అనే గ్రామంలో నివాసమున్న నడింపల్లి సీతారామయ్య - రామలక్ష్మమ్మ దంపతులకు లక్ష్మీబాయమ్మ జన్మించారు. వీరిది మధ్యతరగతి నియోగి బ్రాహ్మణ కుటుంబం. ఈమె అందరికంటే చిన్నది కాబట్టి.. అభ్యుదయభావాలతోపాటు సంప్రదాయకవిద్యను అందుకుంది. అయితే ఆనాడు బాల్యవివాహాలు ఎక్కువ కాబట్టి ఈమెకు తన 10వ ఏటలోనే గుంటూరుజిల్లా వేములపాడుకు చెందిన ఉన్నవ లక్ష్మీనారాయణతో 1892లో వివాహం జరిగింది. ఆయన కూడా ప్రముఖ సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, విద్యాదాత! దేశంలో జరిగే అన్యాయాలను అణిచివేయడంలో ఆయన ఎంతగానో కృషిచేశారు.

ఈ దంపతులిద్దరూ దేశంలో జరుగుతున్న అన్యాయాల దృష్ట్యా మంచి చేయాలనే ఉద్దేశ్యంతో ఎన్నో సేవాకార్యక్రమాలను చేపట్టారు. అందులో భాగంగానే 1902లో గుంటూరుజిల్లాలో ఒక వితంతు శరణాలయాన్ని స్థాపించారు. అప్పట్లో వాళ్లు ఎంతో సాహసంతో సమాజంవర్గాలతో పోరాడి వితంతు పునర్వివాహాలు జరిపించారు. వీరు సాహసించిన ఈ పనిని గుర్తించి.. కందుకూరి వీరేశలింగం వీరిని రాజమండ్రికి పిలిపించారు. అక్కడాయన స్థాపించిన ఆశ్రమం, శరణాలయ కార్యకలాపాలను ఈ దంపతులకు చూపించారు. అక్కడే ఒక సంవత్సరం వున్న తర్వాత తిరిగి ఉన్నవ దంపతులు గుంటూరుకు తిరిగి వచ్చేస్తారు. అనంతరం 1914 నుంచి స్వాతంత్ర్యం సంపాదింకోవాలనే ఆకాంక్ష వారిలో నాటుకుపోయింది. అప్పటినుంచి వాళ్లు ఇతర స్వాతంత్ర్య సమరయోధులతో కలిసి తరచూ సమావేశాలు నిర్వహించేవారు.

శారదానికేతనము :

లక్ష్మీబాయమ్మ 1918లో దేశభక్త కొండా వెంకటప్పయ్య ఇంట్లో వయోజనులైన స్త్రీలకు విద్యాబోధన, చేతిపనులు నేర్పించేందుకు ఒక పాఠశాలను ప్రారంభించారు. ఆ కాలక్రమంలోనే శారదానికేతన్ రూపొందింది. జాతీయవిధానంలో స్త్రీవిద్య వ్యాప్తి చేయాలని ఉన్నవ దంపతులు 1922లో భావించారు. తెలుగు, సంస్కృత భాషలకు ప్రాధాన్యమిస్తూ విద్వాన్‌, భాషాప్రవీణ పరీక్షలకు శారదానికేతన్‌లో తరగతులు నడిపారు. విదేశీవస్త్ర, వస్తు బహిష్కరణకు లక్ష్మీబాయమ్మ పిలుపునిచ్చారు. 1930లో జరిగిన ఉప్పుసత్యాగ్రహం భారతీయులందరినీ ఏకత్రాటిపై నిలిచేలా చేసింది. ఆమె ఆ సత్యాగ్రహంలో పాల్గొనగా 1941 ఫిబ్రవరి 2న మూడవసారి అరెస్టుచేసి మూడునెలల శిక్ష నిమిత్తం రాయవేలూరు జైలుకు పంపారు. ఇలా ఈవిధంగా దేశానికి సేవలందించిన ఆమె తన 74వ ఏట 1956లో మరణించినది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles