Kanuparti varalakshmamma biography who fought for women rights

kanuparti varalakshmamma, kanuparti varalakshmamma biography, kanuparti varalakshmamma news, kanuparti varalakshmamma history, kanuparti varalakshmamma story, kanuparti varalakshmamma photos, kanuparti varalakshmamma news, kanuparti varalakshmamma death day, kanuparti varalakshmamma wiki

kanuparti varalakshmamma biography who fought for women rights and writes books

స్త్రీలకోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టిన ప్రముఖ రచయిత్రి!

Posted: 10/08/2014 06:09 PM IST
Kanuparti varalakshmamma biography who fought for women rights

20వ దశాబ్దం మొదటికాలాల్లో భారతదేశంలో మహిళల మీద ఎటువంటి అన్యాయాలు జరిగేవో అందరికీ తెలిసిందే! సమాజంలో మగవారిలాగే వారికి సమానంగా హక్కులు లభించేవి కావు. ఇంటినుంచి అడుగు బయటకువేసిన మహిళలను అంటరానివారుగా చూసేవారు. చిన్నప్పుడే బాల్యవివాహాలు చేసేవారు. ఇంట్లోనే పనులన్నీ చేయిస్తే రాత్రింబవళ్లు వాళ్లకు ఎన్నో కష్టాలకు గురిచేసేవారు. మొత్తంగా చెప్పాలంటే వారిమీద ఘోరమైన అన్యాయాలు జరిగేవి. అటువంటి సమయాల్లో కొంతమంది మహిళాప్రతిభావంతులు మహిళల మీద జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు నిరసనలు వ్యక్తం చేశారు. కొంతమంది తమ గళం ద్వారా మహిళల ఆవేదన దేశవ్యాప్తంగా వినిపించేలా పాటల ద్వారా తెలియజేశారు. మరికొంతమంది తమ రచయితల ద్వారా మహిళల్లో చైతన్యం నింపుతూ, వారికి సరైన హక్కులు కల్పించడంలో కీలకపాత్రను పోషించారు. అటువంటివారిలో కనుపర్తి వరలక్ష్మమ్మ ఒకరు!

జీవిత చరిత్ర :

1896 అక్టోబర్ 6న పాలపర్తి శేషయ్య, హనుమాయమ్మ దంపతులకు వరలక్ష్మమ్మ బాపట్లలో జన్మించారు. ఈమెకు ఐదుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. 1909లోనే హెల్త్ ఇన్స్పెక్టరుగా పనిచేసే కనుపర్తి హనుమంతరావుతో ఈమెకు వివాహం జరిగింది. అయితే సమాజంలో మహిళల మీద జరుగుతున్న అన్యాయాలు, దౌర్జన్యాలను భరించలేకపోయిన ఈమె.. వారిలో చైతన్యం కల్పించడం కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. ఎన్నో రచయితలను రచించారు. మొదటగా 1919లో ఆంగ్లానువాదా కథ అయిన సౌదామినితో రచనలు చేయడం ప్రారంభించారు. తరువాత  ‘‘లేడీస్ క్లబ్, రాణి మల్లమ్మ, మహిళా మహోదయం, పునః ప్రతిష్ట’’ వంటి నాటికలతోపాటు...  ‘‘ద్రౌపది వస్త్ర సంరక్షణ’’ అనే ద్విపద కావ్యం, ‘‘సత్యా ద్రౌపది సంవాదం’’, ‘‘నాదు మాట’’ మొదలైన పద్య రచనలు చేశారు. అంతేకాదు.. ‘‘నమో ఆంధ్ర మాతా’’ పేరుతో గేయాలు రాయడంతోపాటు గాంధీ మీద ‘‘దండకం’’ కూడా రచించారు.

ఇవేకాకుండా.. పిల్లల పాటలు, నవలలు, పిట్ట కథలు, జీవిత చరిత్రలు, కథలు అనేక ప్రక్రియలలో రచనలు చేసారు. వరలక్ష్మమ్మ కథలు కొన్ని తమిళ , కన్నడ , హిందీ భాషలలోకి అనువాదమయ్యాయి. మద్రాసు , విజయవాడ ఆకాశవాణి కార్యక్రమాలలో పాల్గొన్న మొదటి మహిళ ఈమే! 1921లో విజయవాడలో గాంధీని కలిసి జాతీయోద్యమంలోనూ పాల్గొన్నారు. “నా జీవము ధర్మము, నా మతము నీతి, నా లక్ష్యము సతీ శ్రేయము. ఈ మూడింటిని సమర్ధించుటకే నేను కలము బూనితిని’’ అని చెప్పుకున్న రచయిత్రి. ఇలా ఈ విధంగా తన రచయితల ద్వారా మహిళల్లో చైతన్యం కల్పించినందుకు ఈమెకు అధికారులు ఎన్నోసార్లు సన్మానాలు చేశారు. అంతెందుకు.. ప్రపంచ తెలుగు మహాసభలో సన్మానం పొందిన రచయిత్రి.

కనుపర్తి వరలక్ష్మమ్మ ప్రముఖ మాసపత్రిక గృహలక్ష్మిలో 1929 నుంచి 1934 వరకు ధారావాహికంగా శారదలేఖలు అన్న శీర్షకతో అనేక సమస్యల మీద చర్చిస్తూ రాసారు. తరువాత శారదలేఖలు అన్న పేరుతో ఒక పుస్తకాన్నే ప్రచురించారు. ఆధునిక భావాలు గల శారద పాత్ర ద్వారా స్త్రీలని చైతన్యవంతం చేయడానికి దోహదం చేశాయి. ఒక రచయిత్రి ఒక ప్రముఖ పత్రికలో అంతకాలం ఒక కాలమ్ నిర్వహించడం అదే ప్రథమంగా ఇప్పటికీ గణింపబడుతోంది. 1934లో గృహలక్ష్మి స్వర్ణకంకణాన్ని అందుకున్న మొదటి మహిళ. బాలికల అభ్యున్నతి కోసం బాపట్లలో స్త్రీ హితైషిణి మండలిని స్థాపించి స్త్రీల కొరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి సమాజ సేవ చేసారు. సమాజంలో ఈమె అందించిన సేవలకుగాను ఈమెకు ఎన్నో బహుమతులు లభించాయి.

‘‘గృహలక్ష్మీ స్వర్ణరకంకణం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత్రి, గుడివాడ పౌరులనుండి కవితా ప్రవీణ’’ తదితర బిరుదులు ఈమెను వరించాయి. ఈమె కొన్నాళ్లపాటు గుంటూరు జిల్లా బోర్డు సభ్యురాలిగా కూడా బాధ్యతలను చేపట్టారు. అయితే అనారోగ్య కారణాలరీత్యా ఈమె ఆగస్టు 13, 1978లో తుదిశ్వాసను విడిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles