Indra nooyi talks about women real life at aspes india s festival

Indra Nooyi Talks about women real life at aspes india's festival, Indra nooyi latest news, indra nooyi talks about women life, indra nooyi talks about her life, indra nooyi biography in telugu, indra nooyi in aspes india's festival, pepsico ceo indra nooyi latest news, pepsico ceo indra nooyi

Indra Nooyi Talks about women real life at aspes india's festival

మహిళలకు గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏదీ సాధ్యం కాదు! ఇంద్రా నూయి

Posted: 07/04/2014 12:30 PM IST
Indra nooyi talks about women real life at aspes india s festival

(Image source from: Indra Nooyi Talks about women real life at aspes india's festival)

అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మక చెందిన కంపెనీల్లో ఒకటైన పెప్సికోకు ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా వున్న ఇంద్రనూయి... ప్రపంచంలో సఫలమైన మహిళల్లో ఒకరు. మన భారతదేశ గౌరవాన్ని పెంపొందించడంలో చాలావరకు ఇటువంటి వారిపాత్రల వల్లే సహాయపడుతోంది. అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరైన ఇంద్రానూయి... కొలరాడోలో నిర్వహించిన యాస్పెస్ ఇండియాస్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. అందులో భాగంగానే ఆమె మహిళలను ఉద్దేశించి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు వెల్లడిస్తూ.... సూచనలిచ్చారు.

అందులో ఒకరు.. ‘‘మహిళలకు అన్నీ పొందే అవకాశం వుందా..?’’ అని ప్రశ్నిస్తే.. దానిని సమాధానంగా ఆమె లేదని ఖరాఖండిగా జవాబిచ్చారు. ‘‘ఇల్లు, ఆఫీసు.. ఈ రెండు చోట్లా విజయం సాధించడం మహిళల వల్ల అయ్యే పని కాదు. ఇది సాధ్యపడదు’’ అని ఆమె వివరించారు. అంటే.. ఇంట్లో వున్న అన్ని కార్యకలాపాలను, ఆఫీసు పనులను సమతూకం వేయడం అంత సాధ్యం కాదని ఆమె అభిప్రాయపడ్డారు.

‘‘అన్నీ సాధించామని మేం నటిస్తుంటాం... అన్నీ సాధించగలమని గొప్పులు చెప్పుకుంటాం... కానీ ఇది ఎంతమాత్రం సాధ్యపడదు. అన్నీ పనులను ఒకేసారి నిర్వహించుకోవడం ఏ ఒక్క మహిళకు అంత సులువు కాదు’’ అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలోనే ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని అనుభవాల గురించి వివరించారు.

‘‘పెళ్లయి 34 సంవత్సరాలు గడుస్తున్న నాకు ఇద్దరు పిల్లలున్నారు. వారి పెంపక విషయంలో నేను చాలాసార్లు వారికి మోస్తం చేస్తున్నాన్నేమోనన్న భావన ప్రతీసారి నాలో కలిగేది. పనిభారం ఎక్కువగా వుండటం వల్ల వాళ్ల స్కూళ్లలో జరిగే కార్యక్రమాలకు నేను ఒక తల్లిగా హాజరు కాలేకపొయ్యాను. ఒక తల్లిగా వారికి నేను ఏ సహాయం చేయలేకపోయానన్న విచారంలో మునిగిపోయేదాన్ని. భార్య, తల్లి అనే పాత్రలకు దేనికి ప్రాధాన్యమివ్వాలి అనే అంతు చిక్కని ప్రశ్నకు నా దగ్గర సరైన సమాధానం వుండేది కాదు.

మేము వారికి యోగ్యమైన తల్లిదండ్రులం అవుతామా..? కాదా..? అని నిరూపించుకోవడానికి మేము మా జీవితాలను చాలాసార్లు ఎంతో జాగ్రత్తగా పరిశీలించుకున్నాం. అయితే ఎక్కడో ఒకచోట లోటు కనిపించేది. ఈ విషయం మీదు మీరు నా పిల్లలను అడిగితే.. దానికి సమాధానంగా వారు నన్ను మంచి అమ్మను అంటారో.. లేదో... అనేది అనుమానంగా వుంది. వాళ్లకు అవసరమైనప్పుడు వారి చెంత నేను లేకపోయానేనన్న బాధ నన్ను చంపేసింది.

క్రమక్రమంగా నన్ను నేను ఓదార్చుకోవడం మొదలుపెట్టాను. తల్లికావాల్సిన సమయాంలో వృత్తి జీవితానికి పునాది వేసుకోవాల్సి వస్తుంది. వృత్తి జీవితంలో కాస్త ఎదిగే తరుణంలో పిల్లలు కౌమార దశలోకి అడుగులు పెడుతుంటారు. అప్పుడు వారిని చాలాశ్రద్ధగా చూసుకోవాల్సి వస్తుంది. అలాగే మరోపక్క భర్త, తల్లిదండ్రులను కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఇన్ని బాధ్యతల మధ్య మహిళలు అన్నింటినీ న్యాయం చేశామని ఎవ్వరూ చెప్పుకోలేరు... ఒప్పుకోరు కూడా!

14 సంవత్సరాల క్రితంనాటి విషయం... మా కంపెనీ నన్ను సీఈఓగా చేయాలని నిర్ణయం తీసుకుంది. సంతోషంతో ఈ విషయం గురించి మా అమ్మకు చెప్పాను. అప్పుడు ఆమె చెప్పిన మాటలను, ఆవిడ స్పందించిన తీరు నన్ను ఎంతో నిరాశపరిచింది. ‘‘ఆ విషయం పక్కనపెట్టు... ముందు నువ్వు నాకోసం పాలు పట్టుకురా’’ అని ఆవిడ పురమాయించింది. తరువాత.. ‘‘నువ్వు అత్యున్నత అధికారిని అయి వుండొచ్చు. కానీ నీ బాధ్యతలు మారిపోవు. ఒకసారి ఇంట్లోకి వచ్చావంటే, వెంటనే నీ పెనిమిటికి పెళ్లానివి... పిల్లలకు తల్లివి... తల్లికి కుమార్తెవు అవుతావు. వీటిని ఎప్పుడూ మర్చిపోకు. మరెవ్వరూ ఆ బాధ్యతలను పంచుకోలేరు.. కాబట్టి నువ్వు సాధించాలనుకుంటున్న కిరీటాన్ని ఇంటి బయటే వదిలిపెట్టు రావాల్సి వుంటుంది’’ అని మా అమ్మగారు నాకు సలహాలు ఇచ్చారని చెప్పుకుంది.

అంటే... మహిళలకు ఎన్ని బాధ్యతలు వచ్చినా.. వాటిని చిరునవ్వుతో వాటిని ఆస్వాదించాల్సి వుంటుంది. ఒక మహిళగా అన్ని పనులను నిర్వర్తించాల్సి వుంటుంది. కానీ వాటిని పూర్తిగా నిర్వర్తించడంలో మహిళ తన అసలు జీవితంలో వున్న విషయాలలో ఏదో ఒక దానిని త్యాగం చేయాల్సి వుంటుందని ఆమె అభిప్రాయపడుతూ... ఇతర మహిళలకు సూచనలిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles