Kanaka durga as saraswathi devi eo prabhakar kicks on duty employee

Kanaka Durga as Saraswathi Devi, EO Prabhakar kicks On duty Employee

Kanaka Durga as Saraswathi Devi, EO Prabhakar kicks On duty Employee

సరస్వతీ దేవిగా అమ్మవారు-రెచ్చిపోయిన ఈవో

Posted: 10/10/2013 04:58 PM IST
Kanaka durga as saraswathi devi eo prabhakar kicks on duty employee

దసర నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ సరస్వతీ అమ్మవారి రూపంలో దర్శనమిస్తున్నారు. మూల నక్షత్రం కావడంతో భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. ఈ సందర్భంగా అంతరాలయం దర్శనం నిలిపివేశారు. భక్తులను నియంత్రించడం లేదంటూ సూపరిటెండెంట్ శ్రీనివాసమూర్తిపై ఆలయ ఈఓ చేయిచేసుకున్నారు. దీనితో అక్కడ పరిస్థితులు గందరగోళంగా మారాయి. ఈరోజు ఉదయం నుండే భక్తులు భారీగా క్యూలైన్ లో వేచి ఉన్నారు. అమ్మవారి జన్మనక్షత్రం మూల కావడంతో దుర్గమ్మను దర్శించుకునేందుకు దాదాపు మూడు లక్షల మంది భక్తజనం తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. క్యూలైన్లు, స్నాన ఘట్టాలు, మెట్టమార్గాలు, ప్రసాదాల కౌంటర్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా గురువారం వేకువజాము వరకు రెండు నుండి రాత్రి 11గంటల వరకు దర్శనానికి అనుమతినివ్వనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

 

రెచ్చిపోయిన దుర్గగుడి ఆలయ ఈవో

 

దుర్గ గుడి ఈవో ప్రభాకర్ రెచ్చిపోయారు. దసరా నవరాత్రి ఉత్సవాలని కూడా చూడకుండా ఆలయంలోనే రౌడీగా మారారు. సహోద్యోగి పైనే వీరంగం వేశారు. క్యూలైన్లో భక్తులను అదుపు చేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా క్యూలైన్లో వెళుతున్న ఉద్యోగిని కాలితో తన్నాడు. ఈరోజు ఉదయం పవిత్రమైన అమ్మవారి గర్భగుడిలో తోటి ఉద్యోగి పై దుర్గ గుడి ఈవో ప్రభాకర్ భౌతికంగా దాడికి దిగడంపై అనేక విమర్శలకు దారితీసింది. ఈవో ప్రభాకర్ శ్రీనివాస్ అనుచిత ప్రవర్తనపై అధికారులు, సిబ్బంది, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి.. చర్యలు తీసుకోవాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more