Vijayawada beauty nina davuluri is first miss america

vijayawada beauty nina davuluri is first miss america,Telugu beauty Nina Davuluri is first Miss America, 24-year-old Nina Davuluri

vijayawada beauty nina davuluri is first miss america, Telugu beauty Nina Davuluri is first Miss America

అమెరికాలో మెరిసిన విజయవాడ తెలుగు అందం

Posted: 09/16/2013 04:20 PM IST
Vijayawada beauty nina davuluri is first miss america

అమెరికా అందాల పోటీల్లో ప్రవాస తెలుగు యువతి, మిస్ న్యూయార్క్ నీనా దావులూరి(24) మెరిసింది. మిస్ అమెరికా అందాల పోటీలో విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది. యువతి మిస్ అమెరికా కిరీటాన్ని దక్కించుకున్న తొలి ప్రవాస భారతీయ యువతిగా ఆమె నిలిచింది. మిస్ న్యూయార్క్ గా ఎంపికయిన రికార్డు కూడా ఆమె పేరిటే ఉంది.

అట్లాంటా నగరంలో నిర్వహించిన పోటీలో 15 సెమీ ఫైనలిస్టులను వెనక్కు నెట్టి ఆమె మిస్ అమెరికా కిరీటాన్ని అందుకుంది. బ్రాడ్ వాక్ హాలులో జరిగిన ఈ పోటీని అమెరికా అంతటా టీవీలో ప్రసారం చేశారు. అంతకుముందు ఈ టైటిల్ అందుకున్న మాజీ మిస్ న్యూయార్క్ మాలోరి హాగన్.. నీనాకు కిరీటం అలంకరించింది. విజేతగా నిలిచిన నీనాకు 50 వేల డాలర్లు ఉపకార వేతనంగా అందుతాయి.

టాలెంట్ విభాగంలో ఆమె చేసిన 'బాలీవుడ్' డాన్స్ అలరించింది. ప్లాస్టిక్ సర్జరీపై అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం జడ్జిలను ఆకట్టుకుంది. ప్లాస్టిక్ సర్జరీకి తాను వ్యతిరేకమని, జన్మతః వచ్చిన అందంతో పాటు ఏ సర్జరీకి తలవంచని మానసిక అందమే గొప్పదని ఆమె సమాధానమిచ్చింది. తన తండ్రిలాగే తాను కూడా డాక్టర్ కావాలనుకుంటున్నట్టు చెప్పింది. నీనా దావులూరి తల్లిదండ్రులు కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన వారు కావటం విశేషం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more