Cm kiran bhairaveshwara swamy sentiment

cm kiran bhairaveshwara swamy sentiment, bhairaveshwara swamy temple, Chief Minister N Kiran Kumar Reddy,

cm kiran bhairaveshwara swamy sentiment

నల్లారి సెంటిమెంట్!

Posted: 11/25/2013 09:32 PM IST
Cm kiran bhairaveshwara swamy sentiment

రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సెంటిమెంట్ ఉందని చెబుతున్నారు. శీలంవారిపల్లెలో కొలువైన భైరవేశ్వర స్వామిని ఆయన ఈరోజు దర్శించుకోనున్నారు. గతంలో దర్శించుకున్న ప్రతిసారీ ఏదో ఒక పదవి అలంకరించడంతో ఆయనకు సెంటిమెంట్ ఎక్కువైంది. ఎక్కడో వూరువెలుపల పల్లెలో ఉన్న ఈ స్వామివారిని సీఎం ఇప్పటికే మూడుసార్లు దర్శించుకోవడం గమనార్హం. భైరవేశ్వర స్వామి అంటే విజయూలను అందించే దేవుడని, ఇక్కడ మొక్కుకున్న వారి కోర్కెలు తప్పక నెరవేరుతాయుని. ఆ గ్రామస్తులు చెబుతున్నారు.

 

ప్రతి ఏడాదీ మొలకల పున్నమిరోజున గ్రామ ప్రజలు తిరునాళ్లు నిర్వహిస్తుంటారు. ఇదిలావుండగా గ్రామం పక్కనే సుమారు 300 సంవత్సరాల ఓ మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు కింద భైరవేశ్వర స్వామి విగ్రహం కొలువైంది. ఇక్కడ స్వామికి ఎలాంటి ఆలయం లేదు. స్థానిక భక్తుల నమ్మకం. ఈనేపథ్యంలోనే 2004, 2009 శాసనసభ ఎన్నికల్లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రచార నిమిత్తం ఇక్కడకు వచ్చి, ఈ ఎన్నికల్లో గెలిస్తే మళ్లీ దర్శించుకుని మొక్కు చెల్లించుకుంటానని పూజలు నిర్వహించారు. ఆపై చీఫ్ విప్‌గా, స్పీకర్‌గా ఎన్నికైన తరువాత వివిధ సందర్భాల్లో స్వామిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు.

 

అప్పట్లోనే కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నత పదవి అలంకరిస్తారని స్థానికులు విశ్వసించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నందుకు గ్రామస్తులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇదిలావుండగా రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో సీఎం కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలూ ఊపందుకున్నాయి. ఈసారి సీఎం హోదాలో స్వామిని దర్శించుకుని ఏమి కోరుకుంటారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సమైక్యాంధ్ర సమస్య నుంచి బయట పడి కొత్త పార్టీ పెట్టడానికే ఇక్కడకు వస్తున్నారని పలువురు చర్చించుకోవడం కనిపించింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles