Making Of Chicken Tandoori Recipe To Make Special Weekend | Healthy Food Items | Weekend Special Foods

Chicken tandoori making tips healthy food items weekend special foods

Chicken Tandoori tips, Chicken Tandoori making tips, healthy foods, healthy food items, health tips, weekend special foods, special weekends, weekend food items, weekend recipes, weekend special recipes

Chicken Tandoori Making Tips Healthy Food Items Weekend Special Foods : Tips To Make Chicken Tandoori Recipe for special weekends in this summer.

వేసవిలో చికెన్ తందూరీ మజాయే వేరయా..

Posted: 05/19/2015 04:40 PM IST
Chicken tandoori making tips healthy food items weekend special foods

ప్రతి వీకెండ్ లోనూ సాధారణ చికెన్ కూరలు తీసుకోవడం కంటే కాస్త వెరైటీగా చికెన్ తందూరీ తీసుకుంటే ఆ టేస్టే వేరుగా వుంటుంది. ఈ రిసిపీని చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ప్రతిఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటారు. మిగతా రిసిపీలతో పోల్చుకుంటే ఇది చాలా టేస్టీగానూ, స్పైసీగానూ వుంటుంది. ఎలాగూ వేసవి సెలవుల్లో అందరూ ఇంట్లోనే కాలం గడుపుతారు కాబట్టి.. ఈ రిసిపీని చేసుకుని ఆ రోజంతా స్పెషల్ గా గడపొచ్చు. మరి.. దీని తయారీకి కావలసిన పదార్థాలేంటో, ఎలా తయారుచెయ్యాలో తెలుసుకుందామా..

కావలసిన పదార్థాలు :
చికెన్ ముక్కలు - ఒక కేజీ
కారం - ఒకటిన్నర స్పూన్
నిమ్మరసం - రెండు స్పూన్లు
ఉప్పు - తగినంత
ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు
చాట్ మసాలా - ఒక స్పూన్

నానబెట్టేందుకు :
అల్లం పేస్ట్ - రెండు టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి పేస్ట్ - రెండు టేబుల్ స్పూన్లు
పెరుగు - ఒక కప్పు
నిమ్మరసం - ఒక టీ స్పూన్
ఉప్పు - తగినంత
నూనె- రెండు టీ స్పూన్లు
గరం మసాలా - ఒక టీ స్పూన్
వెన్న- రెండు టీ స్పూన్లు

తయారీ విధానం :
* ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగేసుకుని, వాటిని తందూరి ముక్కల్లా కట్ చేసుకోవాలి.
* ఆ ముక్కలకు ఒక స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఉప్పు ముక్కలకు పట్టించి అరగంట పాటు ఫ్రిజ్‌లో వుంచాలి.
* పెరుగును పల్చని వస్త్రంలో వుంచి 20 నిమిషాలపాటు హ్యాంగ్ చేస్తే నీరంతా పోతుంది. దీనికి అల్లం, వెల్లుల్లి పేస్టులు కారం, ఉప్పు, నిమ్మరసం, గరంమలాలా వంట నూనెల్ని కలుపుకోవాలి.
*ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకి పట్టించి 3-4 గంటలు ఫ్రిజ్‌లో వుంచాలి.
* ఓవెన్ ఉపయోగించేటట్లయితే 200 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతపై ముందుగా ఆ చికెన్ ముక్కలను వేడిచేసుకోవాలి.
* 10-12 నిమిషాల వరకు ఉడికేంతవరకు ఉంచాలి. లేదా పెనంపై నేరుగా కాల్చుకోవాలి.
* వెన్నరాసి నాలుగైదు నిమిషాలు ఉంచాలి. గరం మసాలా చల్లి, ఉల్లి చక్రాలు, నిమ్మ చక్రాలతో అలంకరించుకోవాలి. అంతే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chicken Tandoori  Weekend Recipes  Healthy Food Items  

Other Articles

  • Chicken garelu cooking tips which is special weekend food

    నోరూరించే చికెన్ గారెల తయారీ...

    Nov 05 | మాంసాహారప్రియులు ఎంతో ఇష్టంగా తీసుకునే చికెన్ తో ఎన్నోరకాల వంటకాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా వీకెండ్ సమయాల్లో డిఫరెంట్ ఫుడ్స్ తీసుకోవడానికి ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ఇక చికెన్ తో తయారుచేసే వివిధ వంటకాల్లో చికెన్ గారెలు... Read more

  • Chicken lollipops cooking tips best healthy food recipes

    చికెన్ లాలీ పాప్స్ ని ఎలా చేస్తారో తెలుసా..?

    Oct 08 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు రుచికరమైన వెరైటీ వంటకాల్ని తీసుకోవడానికే ఇష్టపడతారు. అలాంటి ప్రత్యేకమైన వంటకాల్లో చికెన్ లాలీపాప్స్ ఒకటి. ఎంతో రుచికరంగా వుండే ఈ రిసిపీని తీసుకోవడానికి చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ఎంతో... Read more

  • Butter garlic fish fry recipe cooking methods kitchen tips

    బట్టర్ గార్లిక్‌తో ఫిష్ ఫ్రై ఎలా చేస్తారో తెలుసా?

    Sep 18 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వుంటారు. ఆ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయాలంటే ఆ వీకెండ్ లో ఏదైనా స్పెషల్ రెసిపీ వుండాల్సిందే! అప్పుడు దాని మజాయే వేరుగా వుంటుంది.... Read more

  • Rice vada cooking method kitchen tips

    బియ్యపు పిండితో వేడివేడి వడలు..

    Sep 08 | బియ్యపు పిండితో తయారయ్యే వేడివేడి వడలు కేరళలో ఎంతో స్పెషల్ రెసిపీ. ఇవి కూడా సాధారణ గారెలలాగే వుంటాయి కానీ.. మరింత క్రిస్పీగా, టేస్టీగా వుంటాయి. ఈ వడలతో ఆరోగ్య ప్రయోజనం కూడా వుంది.... Read more

  • Chicken garelu recipe cooking tips healthy food items nov veg

    చల్లని వెదర్ లో హాట్ చికెన్ గారెలు..

    Aug 27 | మాంసాహారులు ఎంతో ఇష్టంగా తినే చికెన్ తో రకరకాల వంటకాలు తయారుచేసుకోవచ్చు. చికెన్ పకోడీలు, బిర్యానీ, ఇంకా నోరూరించే స్పెషల్ వంటకాలు ఎన్నో వున్నాయి. పైగా.. ఈ చికెన్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.... Read more