వేసవికాలం మొదలయిందంటే చాలు... మామియకాయ మాయాజాలం నాలుగువైపులా కనుచూపుమేరలోనే వ్యాపిస్తుంది. పిల్లల నుంచి పెద్దలవరకు వేసవికాలం వచ్చిందంటే.. మామిడికాయల కోసం పడిగాపులు కాస్తుంటారు. పచ్చిమామిడికాయ నుంచి పండు మామిడికాయ వరకు ప్రతిఒక్కరు రకరకాల వంటకాలలో, ఆహారపదార్థారాలలో సేవిస్తారు. అలాగే ప్రత్యేకమైన మామిడి రిసిపీలను కూడా తయారుచేసుకుంటారు. ప్రస్తుతకాలంలో అయితే మాస్టర్ చెఫ్స్ కూడా ఈ మామిడికాయల నుంచి రకరకాల వంటకాలను వెలికి తీస్తున్నారు.
సాధారణంగా ప్రతిఒక్కరు నిమ్మరసం, చింతపండు రసం, టమాటో రసం, ఇంకా ఇతర రసాల గురించి వినివుంటారు. అయితే సమ్మర్ సీజన్ లో ఎంతో ప్రత్యేకమైన మామిడికాయతో కూడా రకరకాల రసాలను తయారుచేసుకోవచ్చు. ఇది కాస్త పుల్లపుల్లగా, కాస్త తియ్యతియ్యగా ఎంతో రుచికరంగా వుంటుంది. ఈ మామిడికాయ రసాన్ని పచ్చిమామిడికాయలతో, అతి తక్కువ సమయంలోనే తయారుచేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు :
1. పచ్చిమామిడి కాయలు : 1 లేదా 2 (పొట్టుతీసి, ముక్కలుగా చేసుకోవాలి)
2. బ్లాక్ మిరియాలు (పెప్పర్) : 3 టేబుల్ స్పూన్స్
3. కొబ్బరి తురుము : 1 కప్
4. బెల్లం : ఒక చిన్న ముక్క
5. ఎండు మిర్చి : 1 లేదా 2
6. జీలకర్ర : 3 టేబుల్ స్పూన్స్
7. కరివేపాకు : 2 నుంచి 3 రెమ్మలవరకు
8. ఆవాలు : 1 టేబుల్ స్పూన్
9. కొత్తిమీర తరుగు కొద్దిగా
10. ఉప్పు : రుచికి సరిపడేంత
11. నీళ్లు : కొద్దిగా
తయారుచేసే విధానం :
1. ముందు మామిడికాయల చుట్టూ వున్న పొట్టను పూర్తిగా తీసేసి చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఈ ముక్కలను నీటిలోవేసి కొద్దిసేపు వరకు వేడిచేసుకోవాలి.
2. ఆ విధంగా ఉడికించిన మామిడికాయల ముక్కల నీటిని ఒక గిన్నెలోకి వంపుకోవాలి. ఆ నీటిలో మరికొన్ని చల్లని నీటిని జోడించి, మరికొద్దిసేపటి వరకు ఉడికించుకోవాలి.
3. ఇంకొక గిన్నెలో కొద్దిగా బ్లాక్ పెప్పర్, జీలకర్ర, ఎండు మిర్చీలను తీసుకుని.. లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రైను ఒక జార్ లో వేసి మెత్తగా పొడిగా మార్చుకోవాలి. అందులోనే కొద్దిగా నూనె, ఫ్రైడ్ చిల్లీ, కొబ్బరి తురుము వేసి మెత్తగా వుండే ఒక మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలోనే రుచికి సరిపడే ఉప్పు, బెల్లడం వేసి మిక్స్ చేసుకోవాలి.
4. ఈ విధంగా మిక్స్ చేసుకున్న పేస్ట్ లో ఇంతకుముందు వేడి చేసి పక్కన పెట్టుకున్న మామిడికాయ రసంలో వేసి మిక్స్ చేసుకోవాలి.
5. చివరిగా ఇంకొక పాన్ తీసుకుని అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆ నూనె బాగా కాగిన తరువాత ఆవాలు, రెడ్ చిల్లీ, కరివేపాకు వేసి ఒక నిముషం వరకు ఫ్రై చేసుకోవాలి.
6. ఈ విధంగా తయారుచేసుకున్న ఫ్రైని మామిడికాయ రసంలో పోవు పెట్టుకోవాలి. అందులో కొత్తిమీర తరుగును గార్నిష్ చేసి.. కిందకు దించుకోవాలి.
ఇలా ఈ విధంగా పదార్థాలను ఉపయోగించి మ్యాంగో రసం తయారుచేసుకోవచ్చు.
(And get your daily news straight to your inbox)
Nov 05 | మాంసాహారప్రియులు ఎంతో ఇష్టంగా తీసుకునే చికెన్ తో ఎన్నోరకాల వంటకాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా వీకెండ్ సమయాల్లో డిఫరెంట్ ఫుడ్స్ తీసుకోవడానికి ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ఇక చికెన్ తో తయారుచేసే వివిధ వంటకాల్లో చికెన్ గారెలు... Read more
Oct 08 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు రుచికరమైన వెరైటీ వంటకాల్ని తీసుకోవడానికే ఇష్టపడతారు. అలాంటి ప్రత్యేకమైన వంటకాల్లో చికెన్ లాలీపాప్స్ ఒకటి. ఎంతో రుచికరంగా వుండే ఈ రిసిపీని తీసుకోవడానికి చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ఎంతో... Read more
Sep 18 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వుంటారు. ఆ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయాలంటే ఆ వీకెండ్ లో ఏదైనా స్పెషల్ రెసిపీ వుండాల్సిందే! అప్పుడు దాని మజాయే వేరుగా వుంటుంది.... Read more
Sep 08 | బియ్యపు పిండితో తయారయ్యే వేడివేడి వడలు కేరళలో ఎంతో స్పెషల్ రెసిపీ. ఇవి కూడా సాధారణ గారెలలాగే వుంటాయి కానీ.. మరింత క్రిస్పీగా, టేస్టీగా వుంటాయి. ఈ వడలతో ఆరోగ్య ప్రయోజనం కూడా వుంది.... Read more
Aug 27 | మాంసాహారులు ఎంతో ఇష్టంగా తినే చికెన్ తో రకరకాల వంటకాలు తయారుచేసుకోవచ్చు. చికెన్ పకోడీలు, బిర్యానీ, ఇంకా నోరూరించే స్పెషల్ వంటకాలు ఎన్నో వున్నాయి. పైగా.. ఈ చికెన్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.... Read more