మధ్యాహ్నం ఆఫీసు కార్యక్రమాలలో నిమగ్నమైన ప్రతిఒక్కరు సాయంకాలంవేళ కాస్త అలసటగా భావిస్తారు. అటువంటి సమయంలో స్నాక్స్ ఏదైన ఒక వంటకాన్ని తీసుకోవడంతో వారు ఎంతో ఉత్సాహంగా, ఆహ్లాదకరంగా తమ పనులు చేసుకోవడంలో ఆసక్తి చూపిస్తారు. ఇటువంటి భావనలు సహజంగా ప్రతిఒక్కరిలో వుంటాయి.
ప్రస్తుతకాలంలో స్నాక్స్ వంటకాలలో ఉల్లిపాయ పకోడీలు ఎంతో పాపులర్ అయ్యింది. చాలామంది దీనిమీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ పకోడీ తయారుచేసే విధానం ఎంతో సులభమైనది... పైగా చాలా తక్కువ సమయంలో దీనిని తయారుచేసుకోవచ్చు.
ఈ పకోడీలో కొంచెం చట్నీ లేదా టమోటో సాస్ కలిపి తీసుకుంటే ఎంతో అద్భుతంగా వుంటుంది. చిన్నపిల్లల నుండి పెద్దలవరకు దీనిని ఎంతో ఇష్టపడతారు. శీతాకాలంలో ఇది ఎంతో ఫేమస్.
సాధారణంగా దీనిని శెనగపిండితో తయారుచేస్తారు. ఇందులో వేసే ఉల్లిపాయలు, కరివేపాకు, పుదీనా వంటివి ఈ పకోడీలకు మంచి ఫ్లేవర్ అందించి, రుచికరంగా తయారుచేస్తాయి.
ఒకసారి మనం కూడా ఈ పకోడీ స్నాక్స్ లో ఉపయోగించే పదార్థాలు, తయారుచేసే విధానాన్ని తెలుసుకుందాం....
కావలసిన పదార్థాలు :
ఉల్లిపాయలు (3 పెద్దవి);
పచ్చిమిర్చి (6 సన్నగా కట్ చేసుకోవాలి);
కరివేపాకు (ఒక కట్ట);
పల్లీల పొడి (4 టేబుల్ స్పూన్స్);
ధనియాలపొడి (1 టేబుల్ స్పూన్స్);
జీలకర్రపొడి (1 టేబుల్ స్పూన్);
గరంమసాలా పొడి (1/2 టేబుల్ స్పూన్స్);
అల్లంవెల్లుల్లి పేస్ట్ (1 టేబుల్ స్పూన్స్);
శెనగపిండి (2 కప్పులు);
బియ్యపు పిండి (2 టేబుల్ స్పూన్స్);
ఉప్పు (సరిపడేంత);
కారం (సరిపడేంత);
కొత్తిమీర (ఒక చిన్నకట్ట);
పుదీనా (ఒక కట్ట (15 ఆకులు));
నూనె (ఫ్రైకు సరిపడేంత)
తయారుచేసే విధానం :
మొదట ఉల్లిపాయలను తీసుకుని దానిమీద పొట్టను తొలగించుకోవాలి. తరువాత సన్నగా.. పొడువుగా వాటిని తరిగి ఒక పక్కన పెట్టుకోవాలి.
పచ్చిమిర్చిని కూడా పొడువుగా చీలికలు తీసుకుని పెట్టుకోవాలి.
అల్లంవెల్లుల్లి పేస్ట్ ను తయారుచేసుకుని పక్కన పెట్టుకోవాలి.
అదేవిధంగా పల్లీలను తీసుకుని మెత్తగా చేసి పొడిచేసుకోవాలి.
తరువాత ఒక గిన్నెలో శెనగపిండిని తీసుకుని అందులో.. బియ్యపు పిండి, ధనియాలపొడి, ధనియాలపొడి, జీలకర్రపొడి, గరం మసాలా, ఉప్పు, కారం, పుదీనా ఆకులు, కరివేపాకు, కొత్తిమీర తరుగు, పల్లీలపొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్, తగినంత నీరు పోసి మొత్తం ఒక పేస్ట్ లా తయారుచేసుకోవాలి.
తరువాత ఒక పాన్ లో తగినంత నూనెను పోసి స్టౌమీద కొద్దిసేపు వరకు వేడి చేసుకోవాలి. వేడి అయిన తరువాత శెనగపిండి పేస్ట్ ను పకోడీలాగా చేసుకుని ఆ వేడి నూనెలో వేయాలి. అలాగే అది గోధుమరంగు వచ్చేంతవరకు వేడి చేస్తూనే వుండాలి.
ఈ విధంగా పకోడీలను ఎంతో సులభంగా, తొందరగా మన ఇళ్లల్లోనే తయారుచేసుకుని భోజన సమయాల్లో కూడా తీసుకోవచ్చు.
(And get your daily news straight to your inbox)
Nov 05 | మాంసాహారప్రియులు ఎంతో ఇష్టంగా తీసుకునే చికెన్ తో ఎన్నోరకాల వంటకాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా వీకెండ్ సమయాల్లో డిఫరెంట్ ఫుడ్స్ తీసుకోవడానికి ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ఇక చికెన్ తో తయారుచేసే వివిధ వంటకాల్లో చికెన్ గారెలు... Read more
Oct 08 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు రుచికరమైన వెరైటీ వంటకాల్ని తీసుకోవడానికే ఇష్టపడతారు. అలాంటి ప్రత్యేకమైన వంటకాల్లో చికెన్ లాలీపాప్స్ ఒకటి. ఎంతో రుచికరంగా వుండే ఈ రిసిపీని తీసుకోవడానికి చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ఎంతో... Read more
Sep 18 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వుంటారు. ఆ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయాలంటే ఆ వీకెండ్ లో ఏదైనా స్పెషల్ రెసిపీ వుండాల్సిందే! అప్పుడు దాని మజాయే వేరుగా వుంటుంది.... Read more
Sep 08 | బియ్యపు పిండితో తయారయ్యే వేడివేడి వడలు కేరళలో ఎంతో స్పెషల్ రెసిపీ. ఇవి కూడా సాధారణ గారెలలాగే వుంటాయి కానీ.. మరింత క్రిస్పీగా, టేస్టీగా వుంటాయి. ఈ వడలతో ఆరోగ్య ప్రయోజనం కూడా వుంది.... Read more
Aug 27 | మాంసాహారులు ఎంతో ఇష్టంగా తినే చికెన్ తో రకరకాల వంటకాలు తయారుచేసుకోవచ్చు. చికెన్ పకోడీలు, బిర్యానీ, ఇంకా నోరూరించే స్పెషల్ వంటకాలు ఎన్నో వున్నాయి. పైగా.. ఈ చికెన్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.... Read more