గుడ్డు.. ఎంతో శ్రేయస్కరమైన ఆహారపదార్థాలలో ఒకటి. దీనిని తమకు ఇష్టమొచ్చిన విధంగా రకరకాల వంటకాలలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఎగ్ కర్రీని మన ఇండియాలో అయితే వివిధ పద్ధతుల్లో, ప్రాంతాలవారీగా దీనిని తయారుచేసుకుంటారు. తమ టేస్ట్ కు తగ్గట్టు రుచికరంగా దీనిని చేసుకుంటారు. గుడ్డు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కూడా. రోజువారీగా రెండు గుడ్లను తీసుకోవడం చాలా మంచిది.
అలాగే మన హైదరాబాద్ లో ఎగ్ మసాలా ఒక స్పెషల్ వంటకం. దీనిని ఎంతో స్పైసీగా, మంచి ఫ్లెవర్స్ తో తయారుచేస్తారు. ఈ ఎగ్ కర్రీని చేసే పద్ధతిని మనం కూడా తెలుసుకుందాం...
కావాల్సిన పదార్థాలు :
ఉడికించిన నాలుగు గుడ్లు, రోస్ట్ చేసిన వేరుశెనగ (2 టేబుల్ స్పూన్స్), నువ్వులు (2 టేబుల్ స్పూన్స్), కొబ్బరి తురుము (1 టేబుల్ స్పూన్), జీలకర్ర (1 టేబుల్ స్పూన్), మెంతులు (హాఫ్ టేబుల్ స్పూన్), ఎండు మిర్చి (2), వెల్లుల్లి రెబ్బలు (4), కరివేపాకు, పచ్చిమిర్చి (2), ధనియాలపొడి (1 టేబుల్ స్పూన్), పసుపు (1 టేబుల్ స్పూన్), గరంమసాలా పొడి (1 టేబుల్ స్పూన్), చింతపండు పేస్ట్ (2 టేబుల్ స్పూన్స్), ఉప్పు (సరిపడేంతవరకు), ఆయిల్ (2 టేబుల్ స్పూన్స్), ఒక కప్పులో నీరు
తయారుచేసే విధానం :
మొదటగా నాలుగు గుడ్లను బాగా ఉడికించుకోవాలి. తరువాత ఒక పెనుములో ఒక టేబుల్ స్పూన్ పరిమాణంలో ఆయిల్ ను తీసుకొని వేడి చేయాలి. అందులో ఉడికించిన నాలుగు గుడ్లను పొట్టు తీసి అందులో వేయాలి. కొద్దిసేపు మంటమీద పెట్టిన తరువాత పక్కకు తీసేయాలి.
ఒక మిక్సీ జార్ లో వేరుశెనగ, నువ్వులు, కొబ్బరి తురుము తగిన పరిమాణంలో తీసుకోవాలి. అందులో కొన్ని నీళ్లు పోసి ఒక పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
మొదటలో పక్కన తీసిపెట్టుకున్న పాన్ లో మరికొద్దిగా నూనె పోసి వేడి చేయాలి. తరువాత అందులో తగిన పరిమాణాల్లో జీలకర్ర, మెంతులు, కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు వేడి చేయాలి. మిక్సీ జార్ లో పేస్ట్ చేసుకున్న మసాలాను పాన్ లో వేసి కొద్దిసేపు వరకు మంటమీద వుంచాలి.
అలాగే అందులో కొద్దిగా పసుపు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు వేసి కాసేపు వేడి చేయాలి. చివరికి చింతపండు పేస్ట్ ను ఇందులోకి మిక్స్ చేసి వేడి చేయాలి.
ఇలా ఈ విధంగా ఎగ్ మసాలా కర్రీని తయారు చేసుకోవచ్చు.
(And get your daily news straight to your inbox)
Nov 05 | మాంసాహారప్రియులు ఎంతో ఇష్టంగా తీసుకునే చికెన్ తో ఎన్నోరకాల వంటకాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా వీకెండ్ సమయాల్లో డిఫరెంట్ ఫుడ్స్ తీసుకోవడానికి ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ఇక చికెన్ తో తయారుచేసే వివిధ వంటకాల్లో చికెన్ గారెలు... Read more
Oct 08 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు రుచికరమైన వెరైటీ వంటకాల్ని తీసుకోవడానికే ఇష్టపడతారు. అలాంటి ప్రత్యేకమైన వంటకాల్లో చికెన్ లాలీపాప్స్ ఒకటి. ఎంతో రుచికరంగా వుండే ఈ రిసిపీని తీసుకోవడానికి చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ఎంతో... Read more
Sep 18 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వుంటారు. ఆ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయాలంటే ఆ వీకెండ్ లో ఏదైనా స్పెషల్ రెసిపీ వుండాల్సిందే! అప్పుడు దాని మజాయే వేరుగా వుంటుంది.... Read more
Sep 08 | బియ్యపు పిండితో తయారయ్యే వేడివేడి వడలు కేరళలో ఎంతో స్పెషల్ రెసిపీ. ఇవి కూడా సాధారణ గారెలలాగే వుంటాయి కానీ.. మరింత క్రిస్పీగా, టేస్టీగా వుంటాయి. ఈ వడలతో ఆరోగ్య ప్రయోజనం కూడా వుంది.... Read more
Aug 27 | మాంసాహారులు ఎంతో ఇష్టంగా తినే చికెన్ తో రకరకాల వంటకాలు తయారుచేసుకోవచ్చు. చికెన్ పకోడీలు, బిర్యానీ, ఇంకా నోరూరించే స్పెషల్ వంటకాలు ఎన్నో వున్నాయి. పైగా.. ఈ చికెన్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.... Read more