మనం రోజు తాగే తేనీటిలో ఎన్ని సుగుణాలు ఉన్నాయో వింటూనే ఉన్నాం. మనసును ఉల్లాసపరచడమే కాదు.. సొగసును ద్విగుణీకృతం చేసే లక్షణాలూ 'టీ' సొంతం. టీ పొడి మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. పొడి చర్మం కలిగిన వారు గ్రీన్ టీని (చల్లటి నీటితో కలిపి) ముఖానికి రాసుకుంటే మంచిది. దీనివల్ల ముఖం మీదున్న మలినాలు శుభ్రం అవుతాయి. కాసేపటికే ముఖం నిగారింపుతో మెరిసిపోతుంది.
కళ్ల కింద నల్లటి చారల్ని పోగొట్టేందుకు కూడా దీన్ని వాడొచ్చు. టీ తాగిన తర్వాత టీ బ్యాగుల్ని పడేయకుండా వాటిని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ చల్లటి బ్యాగుల్ని కళ్ల కింద పెట్టుకుంటే నల్లచారలు బాగా తగ్గిపోతాయి. లోపలున్న రక్తనాళాలకు సాంత్వన చేకూరుతుంది. తద్వారా రక్త సరఫరా సాఫీగా సాగుతుంది.
జుట్టు నిగనిగలాడేందుకూ టీ పొడి తోడ్పడుతుంది. బ్లాక్ టీని తలకు రాసుకుంటే.. వెంట్రుకలు అంత తొందరగా చిట్లిపోవు. గ్రీన్ టీ రాసుకుంటే జుట్టు ఏపుగా పెరుగుతుంది. నీళ్లలో కలుపుకున్న టీని తలకు రాసుకున్న పది నిమిషాల తర్వాత.కండీషనర్ షాంపూతో స్నానం చేస్తే అద్భుతమైన ఫలితం లభిస్తుంది.
ప్రస్తుతం వర్షాకాలం.వచ్చేది చలికాలం.ఈ రెండు సీజన్లలోనూ పాదాలను సంరక్షించుకోవాలి. పాదాల పగుళ్లు, వాపుల్ని నయం చేసేందుకు బ్లాక్ టీ చక్కగా పనిచేస్తుంది. వేడి నీటిలో టీ పొడిని కాసేపు మరగబెట్టి.. గోరువెచ్చగా మారిన తర్వాత.ఒక బకెట్లోకి పోసుకోవాలి.
ఆ బకెట్లో పదినిమిషాల పాటు పాదాలను ఉంచితే.ఎక్కడలేని రిలాక్సేషన్ వస్తుంది.బ్లాక్ టీ యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేయడంతో పాటు.కాళ్లకున్న రోమాలను కూడా పోగొడుతుంది.
జూ వాక్సింగ్ చేసుకున్నప్పుడు.అక్కడక్కడ కాస్త మంటగా అనిపిస్తుంది.చల్లటి బ్లాక్ టీ బ్యాగుల్ని మంటరేపుతున్న చోట పెడితే.ఉపశమనం దొరుకుతుంది.సెప్టిక్ కాకుండా నిరోధిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Apr 25 | ప్రేమ... ప్రస్తుతకాలంలో ఇది కంప్యూటర్ లో వైరస్ పాకిపోయినట్లుగా ప్రపంచం నలుమూలలా వ్యాపించిపోయింది. 7వ తరగతి నుంచి విద్యార్థివిద్యార్థినులు ప్రేమించుకుంటున్నామంటూ తమ పెద్దలనే ఎదురిస్తుంటారు. ప్రేమిస్తున్నవారికి ఎలాగైనా దక్కించుకోవాలని తమ ఇంట్లోవున్నవారిగురించి, వారి ప్రేమను... Read more
Apr 22 | సాధారణంగా అబ్బాయిలు తమ మనసులోని భావాలను ప్రియురాలికి వ్యక్తపరచడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తారు. ప్రియురాలు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లడం, ప్రతి రోజూ ఆమెను వెంబడించడం, ప్రేమ లేఖలు రాయడం, తనకు నచ్చిన గిఫ్ట్... Read more
Apr 09 | సాధారణంగా ప్రేమ వ్యవహారాలు స్నేహం నుంచే మొదలవుతాయి. ఎవరైనా ఒకరు నచ్చినప్పుడు వారితో ముందుగా స్నేహం చేసుకుంటారు. ఆ తరువాత తమలో వున్న భావాలను, ఇష్టాయిష్టాలను తెలుసుకుని, అనుకోకుండా ప్రేమలో పడిపోతారు. ఇటువంటి వ్యవహారాలు... Read more
Apr 05 | ప్రస్తుతకాలంలో ప్రేమ అనే విషయం సర్వసాధారణం అయిపోయింది. పిల్లల నుంచి పెద్దలవరకు ప్రతిఒక్కరు ఎవరినిపడితే వారిని ప్రేమించేసుకుంటున్నారు. ఎవరైనా ఒక అమ్మాయి నచ్చితే చాలు... అప్పటికప్పుడే వెళ్లి ఐ లవ్ యూ చెప్పేస్తారు. అదేవిధంగా... Read more
Apr 02 | సాధారణంగా ఏదైనా ఒక వ్యక్తితో పరిచయం అయినప్పుడు ముందు అది స్నేహంగా మారుతుంది. క్రమక్రమంగా వారితో నిత్యం కలుస్తుండడం, మాట్లాడుతుండడంతో అది ప్రేమగా మారిపోతుంది. అలా వారిమధ్య ప్రేమ చిగురించి, తరువాత పెళ్లి చేసుకుంటారు. ... Read more