వాతావరణ కాలుష్య ప్రభావం వల్ల మన చుట్టు వున్న దుమ్ము, ధూళి మన చర్మానికి హాని కలిగించి... మచ్చలు లేదా చారలు ఏర్పడటానికి కారకాలు అవుతాయి. అదేవిధంగా వేసవిలో వేడి ఎక్కువగా వుండటం వల్ల దీని ప్రభావం మరింత ఎక్కువగా వుంటుంది.
అదేవిధంగా మహిళలు ఇంట్లో వంటలు చేసేటప్పుడుగాని, కుక్కర్ల నుంచి వెలువడే వేడివల్ల చర్మంమీద బర్నింగ్ మచ్చలు ఏర్పడుతాయి. కొన్ని సందర్భాలలో ఈ వేడి వస్తువులను తాకడం వల్ల గాయాలు తగులుతాయి. అవి అలాగే చర్మం మీద చారలుగా, మచ్చలుగా మారిపోతాయి.
ఇంతేకాదు.. ముఖంపై మొటిమలు రావడం వల్ల కూడా ఈ చారలు ఏర్పడుతాయి. వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో వివిధ రకాలైన క్రీములు, లోషన్లు అందుబాటులో వున్నప్పటికీ.. కేవలం మొటిమలు కొంతమేరకు తగ్గుతాయి తప్ప.. చారలు కొద్దివరకు అలాగే వుండిపోతాయి.
ఈ విధంగా ఏర్పడిన మచ్చలు మన శరీర అందాన్ని మార్చేసి ఎంతో వికారంగా, అసహ్యంగా కనబడుతాయి. ఆకర్షణీయమైన అందం తొలగిపోయి.. ముసలివారులాగా కనిపిస్తారు. ఇటువంటి చారలను శాశ్వతంగా తొలగించాలంటే.. ఎక్కువ కర్చు లేకుండా.. ఇంట్లోనే ఉత్తమ రెమెడీస్ ఉపయోగించుకోవచ్చు.
ముఖంపై చారలను నివారించే కొన్ని చిట్కాలు :
1. అలొవెరా... ఇది చర్మానికి సంబంధించిన అన్ని సమస్యలు ఎంతో ఉత్తమమైన రెమెడీ. అలొవెరా జెల్ ను ముఖానికి అప్లై చేసుకుని కొద్దిసేపు వుంచుకోవాలి. తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకుని పొడిబట్టతో క్లీన్ చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేసుకోవడం వల్ల ముఖంపై వున్న చారలు త్వరగా తొలగిపోయి ఆకర్షణీయమైన అందాన్ని తిరిగి పొందుతారు.
2. బేకింగ్ సోడా... బేకింగ్ సోడా కూడా చారలను నివారించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. బేకింగ్ సోడాను కొద్దిగా నీటిలో కలుపుకుని ఒక పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖంపై చారలు వున్న ప్రదేశాలలో అప్లై చేసుకోవాలి. అలా కొద్దిసేపు ఉంచుకున్న తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ఒక నిర్ణీత సమయంలో రెగ్యులర్ గా చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు.
3. తేనె... ఇది ప్రకృతిలో సహజ సిద్ధంగా ఒక మంచి ఉపయోగకరమైన పదార్థం. ఇది చర్మంలో చనిపోయిన కణాలను తొలగించి, కొత్తగా కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. చర్మానికి ఒక మాయిశ్చరైజర్ గా ఇది పనిచేస్తుంది. కొద్ది పరిమాణంలో తేనెను తీసుకుని నేరుగా మచ్చలు వున్న ప్రాంతంలో దీనిని పట్టించాలి. క్రమం తప్పకుండా దీనిని ఇలాగే పాటించడం వల్ల చర్మం మీద వున్న మచ్చలు, చారలు తగ్గిపోయి, చర్మాన్ని మరింత స్మూత్, మృదువుగా వుండేలా చేస్తుంది.
4. పసుపు... పసుపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిఒక్కరు దీనిని నిత్యం వాడుతారు. నీటిలో కొద్దిగా పసుపును వేసి, ఒక పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ను క్రమం తప్పకుండా ప్రతిరోజు ముఖానికి పట్టించుకోవాలి. దీంతో చర్మంపై వున్న చారలు తగ్గిపోయి, తిరిగి ఏ చర్మ సమస్య రానివ్వకుండా తేలికగా పనిచేస్తుంది.
5. మెంతులు... ఇది ఎంతో ఉత్తమమైన హోమ్ రెమెడీ. మొదటగా కొద్దిగా మెంతులను తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. తరువాతి రోజు ఉదయాన్నే ఒక మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకొని ఒక పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, కొద్దిసేపు తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తే.. మంచి ఫలితాలు లభిస్తాయి.
6. బాదం ఆయిల్... ఈ ఆయిల్ ను మసాజ్ చేసుకోవడంలోను, హెయిర్ కేర్ లోనూ కూడా ఉపయోగిస్తారు. బాదం ఆయిల్ ను ముఖానికి పట్టించి కొద్దిసేపు వరకు మసాజ్ చేసుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు మసాజ్ చేసుకోవడం వల్ల మచ్చలు, చారలు పూర్తిగా మాయమయిపోతాయి.
7. నిమ్మరసం... దీనిని ప్రతిఒక్కరు ఒక సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు. ఇది కూడా చర్మంలో చనిపోయిన కణాలను తొలగించి, కొత్త కణాలను తయారుచేసి చర్మం పెరుగుదలకు సహాయపడుతుంది. ఒక కాటన్ బట్టను తీసుకుని, నిమ్మరసంలో ముంచి, దానిని మచ్చలు వున్న ప్రాంతంలో రుద్దుకోవాలి. ఇలా రోజు కొన్ని వారాలపాటు చేస్తూనే వుండాలి. ఇలా చేయడం వల్ల మచ్చలు ఒక్కసారిగా తగ్గిపోయి, తిరిగి రానివ్వకుండా చేస్తాయి.
ఇలా ఈ విధంగా అనేక రకాల హోమ్ రెమెడీస్ తో ముఖంపై మచ్చలను, చారలను, మొటిమలను నివారించి సౌందర్యాన్ని తిరిగి పొందవచ్చు. అదేవిధంగా బంగాళదుంప, టొమాటో కూడా మచ్చలను, చారలను తగ్గించడంలో తమదైన పాత్రను వహిస్తాయి.
(And get your daily news straight to your inbox)
Jun 11 | వేసవికాలం వచ్చిందంటే చాలు... చాలామంది ఇంటి నుంచి బయటకు రావడమే మానేస్తారు. వేసవిలో భూమి, సూర్యునికి కొద్ది దగ్గరగా వెళతాడు. దాంతో సూర్యుని ప్రతాపం భూమి ఎక్కువ అవుతుంది. సూర్యుని నుంచి వెలువడే కిరణాలు... Read more
May 14 | కళ్లు... మహిళల అందాలను మరింత ఆకర్షణీయంగా పెంపొందించడంలో ఎంతో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. సాధారణంగా మహిళలు తమ హావభావాలను కూడా ఈ కళ్ల ద్వారా వెల్లడిస్తారు. అమ్మాయిల అందం సాధ్యమైనంతవరకు కళ్ల మీదే ఆధారపడి... Read more
Apr 29 | రోజువారిగా నిర్వహించుకునే కార్యకలాపాలలో కొన్ని ప్రణాళికబద్ధమైన మార్పులను తెచ్చుకుంటే.. రోజంతా అందంగా, ఆనందంగా, ఆహ్లాదంగా గడపచ్చు. అదెలా అంటే... అందాన్ని పొందడం కోసం ఎంత డబ్బు ఖర్చు చేసినా.. ముఖంపై చిరునవ్వు లేకపోతే సహజ... Read more
Apr 24 | పెళ్లికానున్న ప్రతిఒక్క మహిళ తాను ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటుంది. దానికి సంబంధించిన రకరకాల పద్ధతులను కూడా అవలంభించుకుంటారు. చర్మం నిగనిగలాడేందుకు, జుట్టు రాలకుండా వుండేందుకు, చేతులు మృదువుగా కనిపించేందుకు... ఇలా రకరకాలుగా... Read more
Apr 22 | సాధారణంగా కళ్లద్దాలను కంటిలోపం వున్నవారు, ఇన్ఫెక్షన్ వున్నవారు వాడుతారు. కానీ ప్రస్తుతకాలంలో కూడా ఈ కళ్లద్దాలను వాడటం ఒక ట్రెండ్ అయిపోయింది. అమ్మాయిలు అందంగా కనిపించడానికి రకరకాల కళ్లద్దాలు కూడా మార్కెట్లలో లభ్యమవుతున్నాయి. ఇవి... Read more