The Best Health Tips To Active Whole Day | Healthy Foods | Breakfasts | Fruits

Best health tips to active whole day healthy foods breakfasts fruits

health tips, healthy foods, healthy breakfasts, healthy dinners, healthy lunch, night health tips, morning health tips, morning foods

Best Health Tips To Active Whole Day Healthy Foods Breakfasts Fruits : Nutritions Giving Some Health Tips To active whole day.

రోజంతా చురుగ్గా వుండాలంటే.. ఇలా చేయండి!

Posted: 05/19/2015 06:38 PM IST
Best health tips to active whole day healthy foods breakfasts fruits

ప్రస్తుత బిజీ ప్రపంచంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతిఒక్కరూ అనేక కార్యకలాపాల్లో మునిగిపోతుంటారు. తీరిక సమయం లేకుండా పనులు నిర్వర్తించడంలో ఎక్కువ సమయం గడిపేస్తుంటారు. దీంతో ఒత్తిడి పెరగడం, మానసికపరమైన సమస్యలతోపాటు చురుకుదనం కోల్పోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో మళ్లీ విధుల్లో హాజరు అయినప్పుడు చురుగ్గా లేక సతమతమవుతుంటారు. అలాకాకుండా రోజంతా చురుగ్గా వుండాలంటే ఎనర్జీ ఖచ్చితంగా అవసరం. శరీరానికి ఎనర్జీ అందినప్పుడే రోజంతా చురుగ్గా వుంటూ అన్ని పనులు సమర్థవంతంగా నిర్వర్తించవచ్చు. అందుకు కొన్ని టిప్స్ పాటించాల్సి వుంటుంది. అవేమిటో తెలుసుకుందామా..

రోజంతా చురుగ్గా వుండేందుకు సింపుల్ చిట్కాలు :

ఉదయం నిద్ర లేచిన వెంటనే పరిగడుపున రెండు గ్లాసుల నీరు తీసుకోవాలి. అనంతరం 30 నిముషాలపాటు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయి బ్రేక్ ఫాస్ట్‌ తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ లో పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఓట్స్, రాగి, మొలకెత్తిన ధాన్యాలు, శెనగలు, ఇడ్లీ, దోసె వంటివి తీసుకోవాలి. పూరీల్లాంటి నూనెలో వేపిన వాటిని తీసుకోకూడదు. లేకపోతే ఆరోగ్యపరమైన సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇక పది గంటలకు పైగా ఒక కప్పు పెరుగులో కట్ చేసిన పండ్లను తీసుకుని ఐస్ క్రీమ్‌లా, లేదా మిల్క్ షేక్ తీసుకోవచ్చు. పెరుగులో శరీరానికి కావలసిన గుడ్ బ్యాక్టీరియా, క్యాల్షియం పుష్కలంగా వుంటాయి. మధ్యాహ్న భోజనం రెండు గంటల్లోపు తీసుకోవాలి. అన్నం, వేపుళ్లు, పప్పు ఉండేలా చూసుకోవాలి. నాన్ వెజ్ తీసుకునేవాళ్లు ఉడికించిన మటన్, చికెన్ ముక్కలు తీసుకోవచ్చు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పాప్ కార్న్, ఉడికించిన శెనగలు, స్వీట్ కార్న్ సూప్, పండ్ల రసాలు తీసుకోవచ్చు. కాఫీ, టీ అలవాటుండే వారు రోజుకి మూడుసార్లు మాత్రమే తీసుకోవాలి.

ఇక రాత్రి విషయానికి వస్తే.. గోధుమ దోసె, పెసరట్టు, ఇడ్లీ, చపాతీలు తీసుకోవాలి. రాత్రిపూట పరోటా, చికెన్ వంటివి తీసుకోకూడదు. కూల్ డ్రింక్స్, ఫాస్ట్ పుడ్స్ వంటివి తీసుకోకూడదు. రెండు గంటలకు ఒకసారి నీళ్లు తీసుకోవాలి. 8 గంటలపాటు నిద్రపోవాలి. టైమ్‌కి ఆహారం తీసుకోవాలి. ఎప్పుడు పడితే ఆహారం తీసుకోకూడదు. చివరగా చెప్పాలంటే సమయానికి తీసుకునే ఆహారం, 8 గంటల పాటు నిద్ర, వ్యాయామం ఈ మూడే రోజంతా మిమ్మల్ని చురుగ్గా ఉంచుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : health tips  healthy foods  active whole day tips  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more