Ginger health benefits nutrients diseases problems

ginger health benefits, ginger health tips, ginger health problems, ginger soda, ginger problems, ginger juices, ginger tea

ginger health benefits nutrients diseases problems : There are number of health benefits with ginger which have number of nutrients.

అల్లంలో దాగివున్న ఆరోగ్య ఫలితాలు...

Posted: 02/13/2015 06:15 PM IST
Ginger health benefits nutrients diseases problems

ఇటీవలే శాస్త్రవేత్తలు జరిపిన కొన్ని పరిశోధనల ఆధారంగా ‘అల్లం’ను ఒక దివ్యౌషధంలాంటిదని స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే.. మానవ శరీరానికి అత్యంత అవసరమైన పోషక విలువలు ఇందులో సమృద్ధిగా వున్నాయి. అవి వ్యాధినిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు ఎన్నోరకాల చిరుజబ్బులను, గుండె సంబంధిత వ్యాధులను నయం చేయడంలో కీలకపాత్రను పోషిస్తాయని అంటున్నారు. అంతెందుకు.. అల్లం టీ ప్రతిరోజూ రెండుపూటల తీసుకుంటే జీర్ణ సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయని అందరికీ తెలిసిందే! పైగా.. మలినాలను సైతం అది పూర్తిగా తుడిచిపారేస్తుంది.

ఈ అల్లంలో యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీస్పాస్మోడిక్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ వంటి లక్షణాలు వుంటాయి. అంతేకాదు.. పొటాషియం, మెగ్నీషీయం, మ్యాంగనీస్, ఫాస్పరస్, జింక్, విటమిన్ ఎ, సి, ఇ, బికాంప్లెక్స్‌ వంటివి ఎన్నో ఖనిజాలు, పోషక విలువలు వుంటాయి. ఇన్ని ఆరోగ్యకరమైన విలువలను కలిగిన ఈ అల్లాన్ని రోజువారి డైట్ లో వాడితే ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు. అంతేకాదు.. ఆయుర్వేద వైద్యంలోనూ దీనిని ఉపయోగిస్తారు. దీని ప్రాముఖ్యతను తెలుసుకున్న విదేశాలు సైతం.. ఈ అల్లంతో ఎన్నోరకాల వైద్యాలు చేస్తున్నారు.

ఇక అల్లంతో పొందే ప్రయోజనాల విషయానికి వస్తే.. కడుపునొప్పి, అజీర్ణం, హార్ట్ బర్న్, వికారం, బాడీ పెయిన్, ఆర్థరైటిస్ పెయిన్, జలుబు, దగ్గు, ఇతర శ్వాస సంబంధిత ఆరోగ్య సమస్యలను, ఫీవర్, పీరియడ్స్‌లో తిమ్మెర్లను నివారించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా చిరుజబ్బులు దరిచేరకుండా చేస్తుంది. కాబట్టి.. ఈ అల్లంను రెగ్యులర్ డైట్ లో వాడటం ఎంతో శ్రేయస్కరం. అందుకే.. దీనిని దివ్యౌషధంగా పేర్కోవడం జరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ginger health benefits  ginger health tips  healthy food items  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more