Mint pudina menthol leaves health benefits throat problems

Mint pudina menthol leaves health benefits throat problems : the health benefits in mint leaves which prevents throat problems, digestion, and many more diseases.

పుదీనా చాయ్ తాగండి.. గొంత సమస్యకు చెక్ పెట్టండి!

Posted: 02/12/2015 04:08 PM IST
Mint pudina menthol leaves health benefits throat problems

పుదీనాలో ఎన్నోరకాల పోషక విలువలు నిల్వవుంటాయి. ముఖ్యంగా ఇది శరీరలంలోని మలిన పదార్థాలను పూర్తిగా శుభ్రపరచడంలో కీలకపాత్ర వహిస్తుందని ఆరోగ్య నిపుణులు తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు. అలాగే.. జీర్ణక్రియ, కడుపునొప్పి ఇతరత్ర సమస్యలతో పోరాడటం, శక్తిని పెంచడం వంటి గుణాలు ఇందులో పుష్కలంగా వుంటాయని వారు పేర్కొంటున్నారు. ఇక గొంతు సమస్యను చెక్ పెట్టడంలో ఇది ఎంతగానో సహాయపడుతుందని నిపుణుల విశ్లేషణ! నిజానికి గొంతు నొప్పిని నివారించేందుకు ఎన్నోరకాల మందులు, ఇతర ప్రోడక్ట్ లు అందుబాటులో వున్నాయి కానీ.. పుదీనా ముందు అవన్నీ వేస్టేనని చెబుతున్నారు.

పుదీనాలో మెంతాల్ డీకెంజెస్టంట్ అనే పోషకం వుంటుంది. ఇది గొంతులో గరగర వంటి ఇబ్బందులను దూరం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. దీంతో పుదీనా చాయ్ తాగితే గొంతు నొప్పిని, గరగర సమస్యలను పూర్తిగా అధిగమించవచ్చునని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తద్వారా నాసల్ పాసేజ్ ఫ్రీ అవుతుంది. అంతేకాదు.. కాలేయాన్ని శుభ్రం చేయడంలోనూ ఈ పుదీనా ఎంతో సహాయపడుతుంది. అలాగే రెగ్యులర్ డైట్’లో పుదీనా తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రెండు స్పూన్ల పుదీనా ఆకు రసంలో కొద్దిగా తేనె కలిపి రోజు మూడుసార్లు సేవిస్తే.. కడుపునొప్పి, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు త్వరగా తగ్గుముఖం పడుతాయని అంటున్నారు.

ఈ పుదీనా ఆకుల్లో విటమిన్ ఏ, విటమిన్ సి గుణాలు అధిక మోతాదులో నిల్వవుంటాయి. ఇవి శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో తమవంతు సహాయాన్ని అందిస్తాయి. ఇటువంటి పోషకాలు కలిగిన పుదీనాతో ఉదయాన్నే టీ చేసుకుని తాగితే.. శరీర పనితీరు మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చిరుజబ్బులు వెంటనే నయమవుతాయని, నిత్యం హుషారుగా వుంటారని, మెదడు ఫ్రెష్ గా వుంటుందని నిపుణులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more