Fat heavy weight obesity controlling simple tips

fat control tips, heavy weight loss control tips, diet control simple tips, simple health tips, obesity controll simple tips, vegetables reduce body weight, health tips updates, health tips in telugu, beauty tips, heavy weight obesity problems and solutions

fat heavy weight obesity controlling simple tips : by using fallowing simple tips everyone can control their heavy weight obesity and fat. by eating vegetables, and fruits all can reduce body weight here is the chart how to fallow the diet guideline

ఇలా చేయండి వారం రోజుల్లోనే బరువు తగ్గండి

Posted: 12/18/2014 04:20 PM IST
Fat heavy weight obesity controlling simple tips

ఊబకాయం, స్థూలకాయం పేరేదైనా అర్థం మాత్రం అధిక బరువు అనే వస్తుంది. ప్రపంచానికే సవాలుగా మారిన ఈ సమస్యను సులువైన చిట్కాల ద్వారా అధిగమించవచ్చు. బరువు తగ్గాలనే తపన.., సరైన సమయపాలన పాటించి కింది చిట్కాలు ప్రయోగిస్తే కేవలం వారం రోజుల్లోనే బరువు తగ్గుతారు. ఇక ఎక్కువ సేపు వెయిట్ చేయకుండా ఆ చిట్కాలేమిటో చూసేయండి. చిన్న సలహా ఏమిటంటే.., మీరు ఉండాల్సిన దానికంటే ఎంత ఎక్కువగా ఉన్నారో చూడండి, ఆ తర్వాత అధిక బరువు తగ్గించేందుకు ప్రయత్నించండి.

డే1 : తాజా పండ్లను తినాలి. అయితే అరటిపండును మాత్రం వదిలేయండి. ముఖ్యంగా నీళ్ళు ఎక్కువగా ఉండే పుచ్చకాయలు, నారింజ, బత్తాయి (కాలాన్ని బట్టి దొరికే పండ్లు) తీసుకోవటం ఉత్తమం. తొలి రోజు కాబట్టి ఎలాంటి పరిమితి లేదు. సంతోషంగా ఇష్టం వచ్చినన్ని పండ్లు తినండి.

డే2 : తొలిరోజు పండ్లు తిన్నారు కాబట్టి.., రెండవ రోజు కూరగాయలు తీసుకొండి. పచ్చి కూరగాయలు లేదా ఉడికించినవి తినవచ్చు కానీ., కూరగాయలను వేయించుకుని తింటే చేస్తున్న వ్రత ఫలం చెడినట్లే. కాబట్టి నూనె జోలికి అసలు వెళ్లకండి. బంగాళదంప ఉడికించి టిఫిన్ చేయండి.., దోసకాయ, క్యారెట్, బీట్ రూట్, సొరకాయ, కాస్త కఠినమైనా తప్పదు అనకుని కాకరకాయ తీసుకొండి.

డే3 : తొలిరోజు అరటి వదిలేసినట్లే.., మూడవ రోజు ఆలుగడ్డను వదిలేయండి. ఇవి తప్ప మిగిలిన పండ్లు, కూరగాయలు తినండి.

డే4 : అరటిపండ్లు అంటే ఇష్టమైనవారికి ఇది పండగ రోజు లాంటిది. మూడురోజులు దూరంగా పెట్టిన బనానాను ఈ రోజు తినవచ్చు. మీకు సరిపడినన్ని అరటిపండ్లు, పాలు తాగండి. ఆకలిగా ఉంటే కూరగాయలు తినండి.., బోర్ కొడితే వాటినే జ్యూస్ చేసుకుని తాగండి.

డే5 : తెలుగు వారు ఎక్కువగా తినేది అన్నమే. అలాంటి పరబ్రహ్మ స్వరూపంను ఇన్నిరోజులు దూరం చేసినందుకు క్షమించండి. ఐదవ రోజు అన్నం తినవచ్చు. అయితే కేవలం ఓ కప్పు మాత్రమే తీసుకొండి. కూరగాయలు లేదా ఆకుకూరలతో వండిన కూర అయినా సరే కానీ..., మొదటగా చెప్పినట్లు నూనె వేస్తే మొదటికే మోసం వస్తుంది జాగ్రత్త. ఈ రోజు టిఫిన్ గా టమాటాలు తినవచ్చు. గింజలు తింటే కిడ్నీలో రాళ్ళు వస్తాయనే భయం, సందేహం ఉంటే గింజలు తీసేసి తినండి.

డే 6 : ఉదయం పచ్చి కూరగాయలతో టిఫిన్..., మధ్యాహ్నం ఒక కప్పు అన్నం, ఆయిల్ వేయకుండా వండిన కూరతో భోజనం. కప్పు సరిపోతుందా అని సందేహం అవసరం లేదు. ఎందుకంటే మీ శరీరం అప్పటికే అన్నం వద్దనేట్లుగా మారిపోతుంది.

డే 7 : చివరిదైన ఈ రోజున మీరు నిర్మొహమాటంగా అన్నం, కూరగాయలు తినవచ్చు. అదనంగా జ్యూస్ కూడా తాగాలనకుంటే తాగేయండి. ఉదయం కూరగాయలు. మధ్యాహ్నం కప్పు అన్నం, నూనెలేని కూర, సాయంత్రం అలవాటు ఉంటే లేదా రాత్రి జ్యూస్ తాగండి. వద్దు అనుకుంటే కూరగాయలే తినవచ్చు. అయితే జ్యూస్ లో చక్కెరను వేయకపోటం ఉత్తమం. తప్పదనుకుంటే కాస్త వేయండి.

ఆఫీసుకు, కాలేజీలకు వెళ్తూనే ఈ చిట్కాలను ఆదివారం మొదలు పెట్టి శనివారం తో ముగించుకుని తిరిగి సోమవారం మళ్ళీ ఆఫీసు/కాలేజీకి వెళ్ళండి. మీరు బరువు తగ్గారో లేదో మీ సన్నిహితులే చెప్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : fat obesity control  diet maintain tips  health tips  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more