Health benefits curry leaves home remedies

curry leaves home remedies, curry leaves health benefits, curry leaves tips, health tips, curry leaves juice, curry leaves photos, curry leaves, curry leaves health problems, health problems, heart attack diseases, blood pressure problems, cholesterol problems, curry leaves dandruff, dandruff problems

health benefits curry leaves home remedies ; There are number of health benefits with curry leaves which prevents heart, kidneys, and other dangerous disease if we takes it in regular diet

కరివేపాకులో అద్భుత ఔషధగుణాలు

Posted: 12/05/2014 03:11 PM IST
Health benefits curry leaves home remedies

ఆహారావంటకాల్లో ప్రత్యేక రుచిని తెచ్చే కరివేపాకులో మానవ శరీరానికి అవసరమయ్యే ఎన్నో ఔషధగుణాలు పుష్కలంగా వుంటాయి. ఈ ఆకులో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లూ, బి విటమిన్, కెరోటిన్, ప్రొటీన్లు, కొవ్వు పదార్ధాలు, పిండి పదార్ధాలు, పీచు పదార్ధాలు, ఖనిజ లవణాలు, క్యాలరీలు తదితర గుణాలు వున్నాయి. అందుకే.. దీనిని అన్నివంటకాల్లో వాడినప్పుడు అది ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇన్ని ఔషధగుణాలు కలిగిన ఈ కరివేపాకును రెగ్యులర్ ఆహారపదార్థాల్లో తీసుకుంటే.. ఎన్నో అనారోగ్యాలబారి నుంచి తప్పించుకోవచ్చు.

1. అజీర్ణం : జీర్ణక్రియ సమస్యతో బాధపడేవారు కరివేపాకు ఆకులను, జీలకర్రతో కలిపి బాగా నూరుకోవాలి. అలా నూరగా వచ్చిన పొడిని పాలలో కలుపుకుని తాగాలి. ఇలా ప్రతిరోజూ తీసుకుంటే అజీర్ణం సమస్య నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

2. కొలెస్టరాల్ : కరివేపాకు ముద్దను నిత్యం టీస్పూన్ మోతాదుగా తీసుకుంటే.. క్రమంగా అనవసరమైన కొలెస్ట్రరాల్ శాతం తగ్గటంతోపాటు హానికరమైన ఎల్.డి.ఎల్. కూడా గణనీయంగా తగ్గుతుంది.

3. బ్లడ్ ప్రెజర్ (బీపీ) : కరివేపాకు పళ్లను లేదా చెట్టు బెరడును కషాయంగా కాచి తీసుకుంటే అధిక రక్తపోటు వల్ల వచ్చే రుగ్మతలు తగ్గుతాయి.

4. మూత్ర పిండాల సమస్యలు : కరివేపాకు వేరు రసాన్ని ప్రతిరోజూ రెండు పూటలా టీస్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉంటే మూత్ర పిండాల సమస్యలు తగ్గుతూ వస్తాయి. కరివేపాకు ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఆహారంలో స్వీకరిస్తే మూత్ర సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి.

5. దురదలు : ఎండబెట్టిన కరివేపాకును, పసుపును సమపాళ్లలో తీసుకొని పొడిమాదిరిగా కలుపుకోవాలి. వస్తగ్రాళితం పట్టి ఒక శుభ్రమైన గాజు సీసాలో నిల్వచేసుకొని ప్రతిరోజూ ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుంటే దురదలు తగ్గుతాయి.

6. గర్భిణీ సమస్యలు : కరివేపాకు రసాన్ని పూటకు రెండు టీ స్పూన్ల మోతాదులో, అరకప్పు మజ్జిగకు చేర్చి రెండుపూటలా తీసుకుంటుంటే వికారం, వాంతులు వంటివి తగ్గుతాయి. తాజా కరివేపాకు రసం ఒక టీ స్పూన్, నిమ్మరసం ఒక టీ స్పూన్, పంచదార ఒక టీ స్పూన్ కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటుంటే మంచి ఫలితం దక్కుతుంది.

7. కాలిన గాయాలు : చర్మంపైన కాలి బొబ్బలెక్కిన సందర్భాల్లో కరివేపాకు ఆకులను మెత్తగానూరి నెయ్యినిగాని లేదా వెన్ననుగాని కలిపి బాహ్యంగా ప్రయోగించాలి. ఇలా చేయటంవల్ల గాయాలు త్వరగా మచ్చలు పడకుండా మానుతాయి.

8. చుండ్రు : కరివేపాకు, నిమ్మ పండ్లపై వుండే తోలు, శీకాయ, మెంతులు, పెసలు... వీటిని సమభాగాలు తీసుకొని మెత్తని పొడి రూపంలో నూరుకోవాలి. ఈ మిశ్రమంలో షాంపూ పొడిగా వాడితే చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : curry leaves  health tips  health home remedies  telugu news  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more