Healthy tips cough problems relief

health tips, healthy tips, health tips in telugu, cough problems, cough tips, cough relief tips, cough relief tips in telugu, healthy tips

healthy tips cough problems relief ; the healthy home remedies to get rid of caugh problems

దగ్గునుంచి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

Posted: 12/02/2014 03:46 PM IST
Healthy tips cough problems relief

వాతావరణ పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు కొన్ని రోగాలు సంభవించడం సహజం. అందులో దగ్గు, జలుబు, నొప్పులు వంటి వస్తుంటాయి. అయితే వీటిలో దగ్గువ్యాధి అంత సులువుగా వెళ్లదు. ఈ జలుబువల్ల ఇతర రోగాలు చాలా త్వరగా సంభవించే అవకాశాలు వుంటాయి. గొంతు ఆరిపోవడం, గొంతులో ఎక్కువ నొప్పిగా వుండటం, అలసటగా అనిపించడం లాంటివి మొదలుకుని.. మంచానపడేంత పరిస్థితి నెలకోవచ్చు.

కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకమైన వ్యాధులు కూడా సోకవచ్చు.కాబట్టి... దగ్గు లక్షణాలు కనబడిన వెంటనే చికిత్స చేయించుకోవడం మంచిది. అందులో అలోపతి డ్రగ్స్ బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అయితే వీటికంటే మరింత ఎఫెక్టివ్’గా పనిచేసే కొన్ని హోం రెమెడీస్ వున్నాయి. ఆ రెమెడీస్ త్వరగా దగ్గునుంచి ఉపశమనం కలిగించడంతోబాటు ఇతర జబ్బులను రాకుండా నివారించడంలో ప్రముఖంగా పనిచేస్తాయి. మరి అవేమిటో తెలుసుకుందాం..

1. గోరువెచ్చని నీరు : ఈ నీళ్ళను త్రాగడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. ముఖ్యంగా పొడి దగ్గుకు గురైనప్పుడు కొద్దికొద్దిగా నీళ్ళను త్రాగడం మొదలుపెడితే.. ఖచ్చితంగా తగ్గుముఖం పడేలా చేస్తుంది.

2. తేనె : ఇటీవలే నిర్వహించిన కొన్ని పరిశోధనల ప్రకారం.. గొంతు ఇన్ఫెక్షన్’ను నివారించడంలో తేనె అద్భుతంగా సహాయపడుతుందాని నిరూపించబడింది.

3. వేడినీటి స్నానం : స్టీమ్ షవర్ వల్ల స్రావాలు విడుదల అవుతాయి. దాంతో జలుబు మాత్రమే కాదు, అలర్జీ లేదా ఆస్తమా వల్ల వచ్చే దగ్గు కూడా త్వరగా తగ్గిపోతుంది.

4. గార్గిలింగ్ : దగ్గు ఎక్కువగా వున్నప్పుడు గోరువెచ్చని నీటిని నోటిలో వేసుకుని గార్గిలింగ్ చేస్తే మంచిది. ఇలా చేస్తే వెంటనే ఉపశమనం పొందవచ్చు.

5. మసాలా చాయ్: సాధారణ టీలో పసుపు జోడించడం వల్ల అది మసాలాచాయ్’గా మారుతుంది. ఇది దగ్గును నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

6.  నిమ్మరసం, దాల్చిన చెక్క, తేనె : ముందుగా తేనె తీసుకుని దానిని నీటిలో వేసి బాగా మరగించాలి. తర్వాత దానికి దాల్చిన చెక్క, నిమ్మరసం మిక్స్ చేసి కలియబెట్టాలి. ఇలా తయారుచేసుకున్న ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఓ కప్పు తీసుకోవాలి.

7. సాలినే-గార్లిక్ : సాల్ట్ వాటర్’లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి తీసుకోవాలి. దీనికి పసుపు కూడా జోడించడం వల్ల ఇన్ఫెక్షన్స్’కు యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది.

8. తేనె-బ్రాంది: ఇవి శరీరంలో వేడి కలిగిస్తాయి కాబట్టి.. దగ్గు, జలుబు నివారణలో కీలకపాత్రలు పోషిస్తాయి. కేవలం ఒక చెంచా మాత్రమే తీసుకోవాలి.

9. ఆమ్లా : ఆమ్లా రెగ్యులర్ డైట్’లో చేర్చుకోవడం వల్ల శరీరంలో ఇమ్యూనిటిని పెంచుతుంది. రక్షణ కల్పిస్తుంది.

10.  స్పైసీ టీ : తులసి, అల్లం, బ్లాక్ పెప్పర్ టీలు చాలా ఫర్ఫెక్ట్ పదార్థాలు. దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : health tips  cough problems  home remedies  telugu news  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more