‘‘తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా’’ అనే ధోరణినే ప్రతిఒక్కరు నేటి సమాజంలో అలవరిస్తున్నారు. అంటే... సంపాదించుకున్న తమ మొత్తం కష్టార్జితాన్ని మదుపు చేసుకోకుండా అప్పటికప్పుడే ఖర్చు చేసి పడేస్తున్నారని అర్థం.
ప్రస్తుతకాలంలో అందరికి ఆర్థిక ప్రణాళికల గురించి అంతగా అవగాహన లేదు. భవిష్యత్ కు సంబంధించి చేసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. మిగిలిన డబ్బులను పొదుపు చేసుకోకుండా అనవసరంగా ఎక్కువ ఖర్చులు చేస్తున్నారు. పైగా ఈరోజుల్లో మార్కెట్లలో కూడా రోజువారి ఖర్చులు అధికం అయిపోయాయి. వంటగ్యాస్, పెట్రోల్, ఇంకా సాధారణ వస్తువుల ధరలు అమితంగా పెరిగిపోయాయి. ఇవి రేపటిరోజున మరింత పెరగవచ్చు. ఇవేకాకుండా పిల్లల చదువులకోసం అయ్యే ఖర్చులు కూడా ఎక్కువ అయిపోయాయి.
ఇటువంటి సమాయాల్లో అనవసరంగా డబ్బులను ఖర్చు చేసుకోకుండా ఒక ప్రణాళికా ప్రకారం మదుపు చేసుకోవాలన్న అంశాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదు. ప్రస్తుత రోజుల్లోనే ఖర్చులు ఇంతగా వున్నప్పుడు రేపటి భవిష్యత్తులో అవి రెండింతలు అయ్యే అవకాశం వుంది కాబట్టి... భవిష్యత్ ప్రణాళికలు చాలా ముఖ్యం. మనకు అవసరమైన వాటిని గుర్తించి, జాగ్రత్తగా ఖర్చును అదుపు చేసుకుంటూ పోతే.. ఆర్థికపరంగా వచ్చే కష్టాలను భవిష్యత్ లో సులభంగా ఎదుర్కోవచ్చు. అలాగే ఆర్థికలక్ష్యాలను కూడా సాధించగలుగుతాం.
ఆర్థిక లక్ష్యాలను సాధించే ప్రణాళికలు :
1. ఆర్థిక ప్రణాళికలో భాగంగా ముందుగా మనం ఎంత సంపాదిస్తున్నామన్నది లెక్కవేసుకోవాలి. మన సంపాదనను బట్టే ఆర్థికపరంగా లక్ష్యాలను ఏర్పాటు చేసుకోగలుగుతాం. మీరు సంపాదించే డబ్బును ఒకటీ లేదా రెండు బ్యాంకుల్లో ఖాతా వుండేలా చూసుకుంటే చాలా మంచిది. రెండుకంటే ఎక్కువ వున్న ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. వచ్చే కష్టార్జితం నుంచి మిగిలిన డబ్బులను అనవసరంగా ఖర్చు చేసుకోకుండా రెండు బ్యాంకుల్లోనూ సమానంగా డబ్బులను పొదుపు చేసుకోవాలి. ఇలా రెండు ఖాతాలలో డబ్బులను నిల్వ వుంచుకుంటే.. భవిష్యత్ లో వచ్చే కష్టాలను ఒక బ్యాంకు ఖాతా నుంచే ఎదుర్కోవడానికి వీలుగా వుంటుంది. ఇంకొక ఖాతా ఆర్థికపరంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది.
2. ఖర్చులను అదుపు చేయడం... అంటే సంపాదించిన డబ్బులు సాధారణ ఖర్చులకు పోను మిగిలిన డబ్బులను ఒక ప్రణాళిక బద్దంగా పొదుపు చేసుకోవాలి. పైన చెప్పిన విధంగా మిగిలిన డబ్బులను రెండు ఖాతాల్లో వేసుకుంటే.. అందులో ఒకదానిని నిత్య ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు. ఇలా ఒక ఖాతాను ఖర్చులకు, ఇంకొక ఖాతాను పొదుపు చేసుకోవడానికి ఉపయోగించుకుంటే.. ఆర్థికపరంగా మంచి పురోభివృద్ధిని పొందవచ్చు. ఖర్చు చేసిన తరువాత రెండు ఖాతాలలో వున్న డబ్బులను బేరీజు వేసుకుంటే.. ఎక్కడ ఎక్కువ ఖర్చు చేస్తున్నామోనన్న అవగాహన మీకు కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా రెండు బ్యాంకు ఖాతాలను మెయింటెయిన్ చేయడం చాలా మంచిది.
3. కొంతమంది వ్యక్తులు ఎంత ఖర్చు చేస్తున్నారు అనే దానిపై తమ దృష్టిని కేంద్రీకరించరు. అటువంటివారు ఏదైనా ఒక డెబిట్ లేదా క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే.. ఎంత ఖర్చు చేస్తున్నారోనన్న వివరాలను తెలుసుకోవచ్చు. అందులో ఎక్కడ, ఎంత ఎక్కువ ఖర్చు పెట్టామన్న విషయాలు సులభంగా తెలుసుకోవచ్చు.
4. ప్రస్తుతకాలంలో డబ్బులను పొదుపు చేసుకోవడానికి చాలా రకాల పథకాలు అందుబాటులో వున్నప్పటికీ.. అందులో ప్రయోజనాలు కలిగించేవి కొన్ని మాత్రమే వున్నాయి. అందులో ముఖ్యమైన వాటిని ఎంచుకుని, అంటే దీర్ఘకాలిక పథకాలను ఎంచుకుంటే చాలా మంచిది. భవిష్యత్ లో అనుకోకుండా డబ్బు అవసరమైనప్పుడు వీటి నుంచి సమీక్షించుకోవచ్చు.
5. కనీస అవసరాలకు సరిపోయే డబ్బులను మాత్రమే అందుబాటులో వుంచుకోవాలి. అంటే.. బ్యాంకుల్లో రెండు ఖాతాలు ఓపెన్ చేసినప్పుడు అందులో ఒకదానిని కనీస అవసరాలకు సరిపోయేంత డబ్బులను పొదుపు చేసుకుంటూ... మరొక దానిలో మిగిలిన డబ్బులను పొదుపు చేసుకుంటూ పోతే మంచిది. ఇలా చేసుకుంటే.. చాలావరకు ఖర్చులను అదుపు చేసుకోవడంతోపాటు.. ఆర్థికపరంగా లక్ష్యాలను కూడా సాధించుకోవచ్చు. అలాగే మీరు ఖర్చు చేసే విధానాల్లో కూడా మార్పును తెచ్చుకోవాలి. ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేస్తున్నారంటే.. దానిగురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటే మంచిది.
6. చివరగా ఇంకొక విషయం ఏంటంటే.. బ్యాంకుల్లో పొదుపు చేసిన డబ్బులను ముందుగా వాటిని పెట్టుబడులకు మళ్లిస్తే చాలా మంచిది. పెట్టుబడులకు కొంత సొమ్మును కేటాయించుకుంటూ, బ్యాంకుల్లో మదుపు చేసుకుంటే.. ఖర్చులు కూడా అదుపులో వుంటాయి. అప్పుడే మనం జీతం మీద ఆధారపడాల్సిన అవసరం వుండదు.
(And get your daily news straight to your inbox)
Jun 13 | బంగారం విలువ గురించి తెలియనివారు ఈ భూప్రపంచంలోనే ఎవ్వరూ వుండరు. ప్రతి ఒక్కరి ఇంట్లో కనీస అవసరాలు లేకపోయినప్పటికీ... 10 గ్రాముల బంగారం మాత్రం ఖచ్చితంగా వుంటుంది. మన హిందూ పురాణ కథనాలలో కూడా... Read more
Apr 25 | ప్రస్తుతకాలంలో క్రెడిట్ కార్డుల ఉపయోగం ఎక్కువగా పెరిగిపోయింది. క్రెడిట్ కార్డు వుందన్న నెపంతో ప్రతిఒక్కరు ఏదిపడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, అనవసరమైన ఖర్చులు చేసిపడేస్తున్నారు. అలాగే డిస్కౌంట్స్ సీజన్ వచ్చిందంటే చాలు... వారికి... Read more
Apr 07 | ప్రతిఒక్కరి జీవితంలో బాధ్యతలు తప్పనిసరిగా వుంటాయి. వాటిని తీర్చుకోవడం లేదా తీర్చడం కోసం ఎటువంటి భ్రదతాలోచనలు లేకుండా విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేస్తుంటారు. అటువంటి సమయాల్లో వారికి భవిష్యత్ లో అవసరమయ్యే ఒక ఆర్థిక... Read more
Apr 02 | ప్రస్తుతకాలంలో చదువు పూర్తయిన వెంటనే యువతీయువకులు పెద్దపెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. నిన్నమొన్నిటివరకు తమ తల్లిదండ్రులమీద ఆధారపడిన ఈ యువకులు ఒక్కసారిగా ఉద్యోగాలు సంపాదించుకోవడంతో ఆర్థికంగా స్వాతంత్ర్యాన్ని పొందుతున్నారు. అయితే వీరు చాలా విషయాలలో... Read more
Mar 22 | ప్రస్తుతకాలంలో యువతీయువకులు సంపాదిస్తున్న కష్టార్జితాన్ని అనవసరమైన ఖర్చులకు అంటగడుతున్నారు. తమ భవిష్యత్ కోసం ఉపయోగపడే ఆర్థిక ప్రణాళికలను, లక్ష్యాలను, పథకాలను నిర్లక్ష్యం చేసుకుంటున్నారు. తమకు వచ్చే జీతంలో మిగిలిన డబ్బులను దాచుకోకుండా ఖర్చులు చేసిపడే్స్తున్నారు.... Read more