ప్రస్తుతకాలంలో చదువు పూర్తయిన వెంటనే యువతీయువకులు పెద్దపెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. నిన్నమొన్నిటివరకు తమ తల్లిదండ్రులమీద ఆధారపడిన ఈ యువకులు ఒక్కసారిగా ఉద్యోగాలు సంపాదించుకోవడంతో ఆర్థికంగా స్వాతంత్ర్యాన్ని పొందుతున్నారు.
అయితే వీరు చాలా విషయాలలో విఫలమవుతున్నారని చప్పకనే చెప్పుకోవచ్చు. తమ వ్యక్తిగత అవసరాలు, సరదాల కోసం అనవసరమయిన డబ్బులను ఖర్చు చేసిపడేస్తున్నారు. అమ్మాయిలు ఆకర్షణీయమైన అందాలను పొందడం కోసం సంపాదించుకున్న కష్టార్జితాన్ని పార్లర్లకు, డ్రెస్సులకంటూ ఇతరులకు ధారపోస్తున్నారు.
అలాగే అబ్బాయిలు కూడా నలుగురిలో స్టైలిష్ గా కనిపించడం కోసం బైక్ లు కొనడం, ఇంకా రకరకాల విచిత్రమైన దుస్తులను ఖీరదు చేసుకోవడం చేస్తున్నారు. ఇలా అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరిమీద ఒకరు పోటీతో అనవసరమైన ఖర్చులను వెచ్చించుకుంటున్నారు.
అయితే ఇటువంటి సందర్భాలలో వీరు కాస్త జాగ్రత్తగా వ్యవహరించుకుంటే చాలు... తమతమ వ్యక్తిగత సరదాలతోపాటు పొదుపు చేసుకునే విషయాలలో ఆలోచించుకోవాలి. ఇటువంటి ముందుచూపు ప్రణాళికలు లేకపోతే.. భవిష్యత్తులో వచ్చే ముప్పులను ఎదుర్కోవడం చాలా కష్టతరం అవుతుంది.
నేటిసమాజం టెక్నికల్ గా, ఆధునికంగా కాలం ముందుకు నడుస్తోంది. ఒకటీ తర్వాత ఇంకొకటి తరచూ కొత్త కొత్త సాధనాలు, పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. అటువంటి వాటిని చూసినప్పుడు యువతీయువకులు తొందరగా ఆకర్షితులవుతారు. వాటిని ఎలాగైనా పొందాలనే పట్టుదలతో ఖర్చు చేసేస్తారు. అనవసర ఖర్చుతో కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఒక్కసారిగా ఖర్చుచేసుకుని కష్టాలను కొనితెచ్చుకుంటున్నారు. కాబట్టి అటువంటి సమయాల్లో మనకు ఏది అవసరం..? ఏది అనవసరం..? అనే వాటి గురించి ఒక్కసారి ఆలోచన చేసుకోవడం చాలా మంచిది. అప్పుడే మనం మన డబ్బును పొదుపు చేసుకోగలుగుతాము.
సాధారణంగా ఉద్యోగం చేస్తున్న ప్రతిఒక్కరి దగ్గర క్రెడిట్ కార్డు వుండటం సహజం. కాని ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి... క్రెడిట్ కార్డ్ అన్నా కూడా బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్నట్టే లెక్క. క్రెడిట్ కార్డు వుంది కదా అని ఎక్కడ బడితే అక్కడ దానిని వాడుకోవడం, స్థాయికి మించిన ఖర్చులు చేసుకోవడం బ్యాంకుల రుణాలు అధికంగా పెరిగిపోతాయి. ఫలితంగా సంపాదించుకునే డబ్బును మొత్తం కేవలం బ్యాంకులకే తీరుస్తూ కాలాన్ని గడపాల్సి వస్తుంది. కాబట్టి నిర్ణీత ప్రణాళికలను ఏర్పరుచుకుని క్రెడిట్ కార్డులను వాడుకోవడం చాలా మంచిది. అస్సలు వాడకపోతే ఇంకా చాలా మంచిది.
మనకు ఏదైనా ఒక వస్తువు అవసరమైనప్పుడు అది మనకు తాత్కాలికంగా కాకుండా భవిష్యత్తులో కూడా ఉపయోగపడుతుందా లేదా అన్న దాని గురించి ఒక్కసారి ఆలోచించుకోవాలి. తాత్కాలికమైంది కేవలం ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ తరువాత దానితో ఎటువంటి అవసరం వుండదు. కాబట్టి ఇటువంటి వస్తువులను ఖరీదు చేసేటప్పుడు ఎక్కువ డబ్బులు వెచ్చించకుండా తక్కువలో వుండేవిధంగా చూసుకోవాలి.
మరికొన్ని సూచనలు... చిట్కాలు...
చిన్నవయస్సులోనే ఉద్యోగం సంపాదించుకున్నవారు డబ్బును ఎలా ఖర్చు చేసుకోవాలన్న ఆలోచన కంటే.. ఆ డబ్బును ఎలా పొదుపు చేసుకోవాలని అనే దిశగా ఆలోచించుకుంటే చాలా మంచిది. మొదటి జీతం నుంచే వచ్చే డబ్బులను పొదుపు దిశగా మళ్లించుకుంటే భవిష్యత్తులో వచ్చే కష్టాలను సులభంగా ఎదుర్కోవచ్చు. ఇటువంటి ప్రణాళికలు మొదటినుంచే మొదలుపెడితే అదొక అలవాటుగా మారిపోతుంది.
చిన్నవయస్సులో ఉద్యోగం చేస్తున్నవారికి బాధ్యతలు చాలా తక్కువగా వుంటాయి. అంటే.. ఇంట్లో ఖర్చులకుగాని, లేదా పెళ్లి వంటి సమస్యలు వుండవు కాబట్టి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు వుండవు. అటువంటి సమయాల్లో వచ్చే జీతంలో వ్యక్తిగత ఖర్చులకు పోనూ.. మిగిలిన డబ్బులను పొదుపు చేసుకోవడం ఒక మంచి పద్ధతి.
పెట్టుబడులు పెట్టుకోకుండా ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకుంటే నిర్భయంగా జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పెళ్లి చేసుకునే సమయంలో అవసరమయ్యే ఖర్చును భరించుకోవచ్చు.
తల్లిదండ్రులకు అండగా వుంటూ.. వారికి జీవిత, ఆరోగ్య బీమాలు చేయించుకోవడం చాలా మంచిది. ఇలా చేయడంవల్ల డబ్బును పొదుపు చేసుకోవడంతోపాటు వారి జీవితానికి ఒక ఆసరా కల్పించినట్టవుతుంది.
(And get your daily news straight to your inbox)
Jun 13 | బంగారం విలువ గురించి తెలియనివారు ఈ భూప్రపంచంలోనే ఎవ్వరూ వుండరు. ప్రతి ఒక్కరి ఇంట్లో కనీస అవసరాలు లేకపోయినప్పటికీ... 10 గ్రాముల బంగారం మాత్రం ఖచ్చితంగా వుంటుంది. మన హిందూ పురాణ కథనాలలో కూడా... Read more
Apr 25 | ప్రస్తుతకాలంలో క్రెడిట్ కార్డుల ఉపయోగం ఎక్కువగా పెరిగిపోయింది. క్రెడిట్ కార్డు వుందన్న నెపంతో ప్రతిఒక్కరు ఏదిపడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, అనవసరమైన ఖర్చులు చేసిపడేస్తున్నారు. అలాగే డిస్కౌంట్స్ సీజన్ వచ్చిందంటే చాలు... వారికి... Read more
Apr 22 | ‘‘తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా’’ అనే ధోరణినే ప్రతిఒక్కరు నేటి సమాజంలో అలవరిస్తున్నారు. అంటే... సంపాదించుకున్న తమ మొత్తం కష్టార్జితాన్ని మదుపు చేసుకోకుండా అప్పటికప్పుడే ఖర్చు చేసి పడేస్తున్నారని అర్థం. ప్రస్తుతకాలంలో అందరికి ఆర్థిక ప్రణాళికల... Read more
Apr 07 | ప్రతిఒక్కరి జీవితంలో బాధ్యతలు తప్పనిసరిగా వుంటాయి. వాటిని తీర్చుకోవడం లేదా తీర్చడం కోసం ఎటువంటి భ్రదతాలోచనలు లేకుండా విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేస్తుంటారు. అటువంటి సమయాల్లో వారికి భవిష్యత్ లో అవసరమయ్యే ఒక ఆర్థిక... Read more
Mar 22 | ప్రస్తుతకాలంలో యువతీయువకులు సంపాదిస్తున్న కష్టార్జితాన్ని అనవసరమైన ఖర్చులకు అంటగడుతున్నారు. తమ భవిష్యత్ కోసం ఉపయోగపడే ఆర్థిక ప్రణాళికలను, లక్ష్యాలను, పథకాలను నిర్లక్ష్యం చేసుకుంటున్నారు. తమకు వచ్చే జీతంలో మిగిలిన డబ్బులను దాచుకోకుండా ఖర్చులు చేసిపడే్స్తున్నారు.... Read more