9 ways to keep your Heart healthy and happy

9 ways to keep your heart healthy and happy

Heart healthy, Heart tips, Heart health tips, Heart, Healthy tips, Health, happy, foods, welness, diet, weight, healthy food

9 ways to keep your Heart healthy and happy : after Heart disease, cancer, and stroke. Here are 9 things you can do to keep your lungs healthy.

మీ గుండె ఆరోగ్యం కోసం 9 సూత్రాలు

Posted: 05/17/2016 06:22 PM IST
9 ways to keep your heart healthy and happy

మన గుండె ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన నియమాలు:

1. మీ గుండె ఆరోగ్యవంతంగా వుండాలంటే రోజులో 500 - 950 క్యాలోరీలు శరీరం నుండి ఖర్చు చేయబడాలి. గుండె సంబంధిత వ్యాయామాలు చేయటం వలన శ్వాస యొక్క రేటు పెరుగుతుంది. అలాగే శరీర రక్త పీడనం కూడా సాధారణ స్థితిలో ఉంటుంది. వ్యాయామాలు చేయడం వల్ల చెమట అధికంగా బయటకు వెళ్లిపోవడం అనేది మీ గుండెకు మంచి విషయంగా చెప్పవచ్చు.

2. తక్కువ కొవ్వు పదార్థాలు ఉన్న ఆహరం తీసుకోవాలి. తీసుకునే ఆహరంలో చక్కెరలు మరియు ట్రాన్స్ ఫాట్'లు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఫైబర్, ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు స్థాయిలు తగ్గించబడతాయి మరియు గుండె కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. అలాగే వివిధ రకాల పండ్లు, మరియు కూరగాయలు తినటం వలన శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.

3. దాదాపు 9 గంటల నిద్ర తప్పనిసరి. ఎవరైతే దాదాపు 8-9 గంటల సమయం పాటు నిద్రపోతారో వారి గుండె ఆరోగ్యంగా వుంటుందని వైద్యులు చెబుతున్నారు.

4. గుండె సంబంధిత వ్యాధులు రావడానికి ముఖ్య కారణం ఒత్తిడి. ఏదైనా సమస్యల ఒత్తిడి వుండటం వల్ల టెన్షన్ మరింత పెరిగి మానసిక ఒత్తిడి ఎక్కువవుతుంది. దీంతో రక్త పీడనం అధికం అవుతుంది. కావున ఎక్కువ శాతం సమస్యలకు దూరంగా వుండేలా చూసుకోవాలి. టెన్షన్ పెట్టే విషయాలను ఎక్కువ సమయం పాటు డిస్కస్ చేయకూడదు. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించాలి.

5. ఇక గుండె సంబంధిత వ్యాధులు రావడానికి మరో కారణం బరువు. వయసుకు తగిన విధంగా బరువు లేకపోవడంతో శరీరంలో కొవ్వు స్థాయిలు, రక్త పీడనం మరియు ఇన్సులిన్ స్థాయిలు పెరిగిపోయి గుండె సంబంధిత వ్యాధులు రావడానికి ప్రేరేపిస్తుంటాయి. అలాగే శరీరంలో కొవ్వు స్థాయిలు అధికం అవటం వలన రక్త పీడనం పెరుగుతుంది, మధుమేహం, గుండెపోటు కూడా రావచ్చు. కాబట్టి వయసుకు తగ్గట్లుగా శరరీ బరువును మెయింటేన్ చేయడం మంచిది. వ్యాయామాలు చేయడం ఉత్తమం.

6. మోతాదుకు మించి మద్యం సేవించడం. అందువల్ల రక్తపీడనం మరియు గుండె ప్రెజర్ పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి ఎంత వీలైతే అంతగా మద్యానికి దూరంగా వుండటమే మంచిదని వైద్యులు చెబుతున్నారు.

7. గుండె సరిగ్గా పనిచేయడానికి విటమిన్ లు చాలా ముఖ్యం. విటమిన్ 'B6' మరియు 'B12' వంటివి గుండెకు చాలా ముఖ్యం కారణం ఇవి ధమనులలో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి. కాబట్టి మీరు రోజు తీసుకునే ఆహారంలో విటమిన్ లు వుండేలా చూసుకోండి.

8. పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని ఎలాగో అందరికి తెలిసిందే. హానికరం అని తెలిసి కూడా త్రాగడం తప్పే కదా! ధూమపానం వలన ఊపిరితిత్తులు చెడిపోయే ప్రమాదం వుంది. అందువల్ల అనారోగ్యం దెబ్బతినడం కూడా జరుగుతుంది. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధుల సమస్యలు కూడా పెరుగుతాయి. కాబట్టి ధూమపానంకు దూరంగా వుండటం మంచిది.

9. ఇక చివరగా... వయసు పెరుగుతున్న కొద్ది ఒంట్లో శక్తి కాస్త తగ్గుతూ వుంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా బిపి, షుగర్ చెకప్ లను చేయించుకోండి. అందువల్ల మన ఆరోగ్య పరిస్థితి ఎలా వుందో ఎప్పటికప్పుడు తెలుసుకొని జాగ్రత్తలు తీసుకొనే అవకాశం వుంటుంది.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : Heart  Health  Tips  Food  Diet  Life  

Other Articles

 • Tor web secrets details

  సీక్రెట్ బ్రౌజర్ టార్ గురించి...

  Aug 16 | ఇంటర్నెట్ లో మీరు చేసే ప్రతి పనిని ఎంతో మంది గమనిస్తుంటారు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సంబంధిత వెబ్ సైట్ల దాకా మీ ఇంటర్నెట్ బ్రౌజింగ్ ను ట్రాక్ చేస్తూ ఉంటాయి. మీరెక్కడున్నారు,... Read more

 • Tips for healthy long hair

  జుట్టుకు కూడా ఆరోగ్యం అవసరమే...

  Jul 31 | మనిషి చర్మంలో ఎపిడెర్మిస్, డెర్మిస్, హైపోడెర్మిస్ అని మూడు పొరలు ఉంటాయి. అన్నింటికన్నా కింద ఉండే హైపో డెర్మిస్ లో కొవ్వు, అనుసంధాన కణజాలం ఉంటాయి. ఇది చర్మానికి ఆధారాన్ని, బలాన్ని ఇస్తుంది. ఇక... Read more

 • Easy way to weight loss

  చాలా ఈజీగా బరువు తగ్గేయండి

  Jul 15 | బరువు తగ్గాలంటే అందుకు ఇదీ అంటూ ప్రత్యేకంగా ఓ నియమం ఏమీ లేదు. బరువు తగ్గేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఎవరికి అనువైనది వారు ఫాలో అయిపోతే చాలు. బరువు తగ్గాలనుకుంటూ ఏమీ చేయలేకపోతున్న... Read more

 • Mosquitoes bite dangerous to human

  డేంజర్ దోమ.. దరి చేరనీయకండి

  Jul 03 | వర్షా కాలం వచ్చేసింది. రోగాలకు ఇది మంచి సీజన్. డెంగీ, చికున్ గున్యా, మలేరియా.. ఇలా వ్యాపించే ప్రాణాంతక వ్యాధులు ఎన్నో. అయితే వీటన్నింటికి ఉన్న ఏకైక వాహకం మాత్రం దోమ అనే చెప్పుకోవాలి.... Read more

 • Value first aid kit to save life

  ఫస్ట్ ఎయిడ్- చిన్న సాయం.. ప్రాణ దానం

  Jun 27 | ఏటా మన దేశంలో ఎన్నో వేల సంఖ్యలో ప్రమాదాల బారిన పడి ప్రజలు విగతజీవులుగా మారుతున్నారు. అయితే యాక్సిడెంట్ జరిగిన వెంటనే వారికి అందించే తక్షణ సాయం అందిస్తే మాత్రం వారు బతికే అవకాశాలు... Read more

Today on Telugu Wishesh

porno