The Benefits Of Fish Which Contains Omega 3 Content | Healthy Food Items | Home Remedies

Fish recipes health benefits home remedies healthy food items

fish recipes, fish health benefits, fish benefits, fish health remedies, omega 3 fatty acids, omega 3 fatty acids benefits, fish benefits, fish curries, fish food items, fish foods types

Fish Recipes Health Benefits Home Remedies Healthy Food Items : The Health Benefits Of Fish Which Contains Omega 3 Fatty Acids.

వారానికి ఒక్కసారైనా.. చేపలు తినాల్సిందే!

Posted: 09/05/2015 11:22 AM IST
Fish recipes health benefits home remedies healthy food items

నిత్యం ఆరోగ్యంగా వుండాలంటే పౌష్టికాహారాన్ని తరచూ తీసుకోవాలి. పోషకాలు ఎక్కువగా లభ్యమయ్యే ఫ్రూట్స్, కూరగాయలు, కాయగూరలు, ఆకుకూరలు, వంటకాల సామాగ్రి.. ఇలా అన్నింటిని సరైన మోతాదులో సమయాన్ని కేటాయించుకుంటే తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం. కానీ.. ప్రస్తుత ఆధునిక యుగంలో ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జా, బర్గర్ వంటివాటికి అలవాటు పడటంతో.. రకరకాల రోగాల బారిన పడుతున్నారు. అందుకే.. ఆహారం చాలా జాగ్రత్తలు పాటించాలని.. పోషకాహారమే నిత్యం తీసుకోవాలని సూచిస్తున్నారు. శరీరానికి కావలసిన పోషకాలు అందించే ఆహారాల్లో చేపలు ఎంతో శ్రేయస్కరమైనవి. వీటిలో వుండే పోషకాలు రకరకాల వ్యాధుల నుంచి విముక్తి కలిగించడంతోపాటు ఆరోగ్యంగా వుంచుతాయి.

తక్షణమే కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం లభించాలంటే వారానికి ఒకసారైనా చేపలు తినాలని అధ్యయనంలో తేలింది. చేపలను తినడం వల్ల పలు రకాలైన ప్రయోజనాలున్నాయి. అయితే తాజా అధ్యయనంలో తేలిన విషయమేమిటంటే.. వారానికి ఒకసారైనా చేపలను తినడం వల్ల రుమటాయిడ్‌, ఆర్థ్రరైటిస్‌ వంటి కీళ్లనొప్పుల ముప్పును సగం వరకూ తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. స్వీడన్‌కు చెందిన కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకుల బృందం సుమారు 32 వేలమంది మహిళలపై అధ్యయనం చేపట్టింది. ఈ పరిశోధకుల బృందం తమ పరిశోధనకు ఎంపిక చేసుకున్న మహిళల ఆహారపు అలవాట్లను గురించి విశ్లేషించింది. వీరిలో ఒమెగా`3 కొవ్వు ఆమ్లాలను ఎక్కువగా తీసుకున్న వారిలో కీళ్లనొప్పుల ముప్పు తక్కువగా ఉన్నట్టు తేలింది.

సాల్మొన్‌, తాజా ట్యూనా వంటి చేపల్లో అధికంగా ఈ ఒమెగా`3 కొవ్వు ఆమ్లాలు లభ్యమవుతాయి. ఈ అధ్యయనంలో పాల్గొన్న మహిళల్లో 27 శాతం మంది ఈ కొవ్వు ఆమ్లాలను తక్కువగా తీసుకుంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. మొత్తంగా కీళ్లనొప్పులకు ఎక్కువగా గురయ్యే మహిళలు వారానికి ఒకసారైనా నూనెతో కూడిన చేపల్ని తినాలని పరిశోధకులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : health tips  fish benefits  omega 3 fatty acids  healthy food items  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more