The Health Benefits Of Spinach (Lettuce) and Cilantro (Coriander) | Healthy Foods | Best Foods

Health benefits of spinach lettuce cilantro coriander best foods

spinach benefits, cilantro benefits, healthy foods, Green benefits, green vegetables benefits, healthy food items, spinach health, cilantro health, pregnancy tips

Health Benefits Of Spinach Lettuce Cilantro Coriander Best Foods : The Health Benefits Of Spinach (Lettuce) and Cilantro (Coriander) In Which Number Of Nutrients.

నాన్-వెజ్ కంటే ఆకుకూరలే శ్రేయస్కరం

Posted: 08/04/2015 11:43 AM IST
Health benefits of spinach lettuce cilantro coriander best foods

రెగ్యులర్ గా నాన్-వెజ్ తినడం కంటే ఆకుకూరలు తింటే ఎంతో శ్రేయస్కరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆకుకూరల్లో శరీరానికి కావలసిన పోషకాలు, మినరల్స్, విటమిన్లు, ఐరన్ తదితరలు పుష్కలంగా లభిస్తాయని, అవి నిత్యం ఆరోగ్యంగా వుంచడంలో సహాయపడుతాయని చెబుతున్నారు. కాబట్టి.. రెగ్యులర్ డైట్ లో ఆకుకూరల్ని చేర్చుకుంటే, నిత్యం ఆరోగ్యంగా మెలగవచ్చు.

ఆకుకూరల్లో ఒకటైన పాలకూరలో ఎన్నో పోషకాలు దాగివున్నాయి. పప్పు, కూర, పులుసు, బజ్జీలు, పాలక్ పన్నీర్ వంటి రకరకాల వంటకాల్లో తినే పాలకూరల్లో అమినోయాసిడ్స్, ఐరన్, విటమిన్ ఎ, మెగ్నీషియం, సల్ఫర్, పోటాషియం, పోలిక్ యాసిడ్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. మాంసాహారంలో ఉండే మాంసకృత్తులన్నీ ఈ పాలకూరలోనూ ఉంటాయి. కాబట్టి.. ఈ పాలకూరను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే ఎంతో శ్రేయస్కరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

పాలకూరలో ఏ విధంగా సుగుణాలు దాగివున్నాయో.. అవన్నీ మెంతికూరలోనూ లభిస్తాయి. ఖనిజ లవణాలతో పాటు.. అన్ని పరిమళభరిత పుదీనాలోనూ విటమిన్లకు, ఖనిజలవణలకు కొదవేమీలేదు. ఐరన్, విటమిన్ ఇ పుష్కలంగా వుంటాయి. తోటకూర తరచుగా తినడంవల్ల ఎ, బి1, బి2, సి విటమిన్లు.. కాల్షియం, ఐరన్, పొటాషియం, లోపాలకు చక్కని పరిష్కారం. చర్మాన్ని తొందరగా ముడతలు పడనీయదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఆకుకూరల్లో మరో రకమైన కొత్తిమీరలో ఎన్నో పోషకగుణాలు దాగివుంటాయి. ప్రతి వందగ్రాముల కొత్తిమీరలో.. 10 మిల్లీగ్రాముల ‘ఐరన్’, 135 మిల్లీగ్రాముల ‘విటమిన్ సి’, ‘విటమిన్ ఏ’లతోపాటు, ఫాస్ఫరస్, కాల్షియం సమృధ్ధిగా లభిస్తాయి. ఈ కొత్తిమీరను చట్నీ, జ్యూస్ రూపంలో తీసుకుంటే అందులో వుండే పోషకాలు శరీరానికి నేరుగా అందుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : spinach benefits  cilantro benefits  green vegetables  healthy foods  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more