Tips To Remove Kidney Stones | Orange Fruits Benefits | Health Tips

Home remedies to remove kidney stones orange benefits health tips

kidney stones tips, kidney stone remove tips, kidney stone treatement, kidney stone fruits, kidney stone food items, orange benefits, orange fruits benefits, health tips, healthy food items, kidney health

home remedies to remove kidney stones orange benefits health tips : According to the latest research it has been pointed that orange fruits will helps to remove kidney stones.

కిడ్నీలో రాళ్లను నివారించే చిట్కాలు..

Posted: 08/01/2015 06:20 PM IST
Home remedies to remove kidney stones orange benefits health tips

మారుతున్న జీవన విధానంలో ఆహారపు అలవాట్లు మారుతుండటంతో చాలామంది రకరకాల రోగాల బారిన పడుతుంటారు. మరికొందరిలో అయితే కిడ్నీలో రాళ్లు ఏర్పడుతుంటాయి. ఈ రాళ్లు ఎలా వస్తాయంటే.. క్యాల్షియం వంటి రసాయనాల గాఢత విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఏర్పడుతాయని నిపుణులు వివరిస్తున్నారు. శస్త్రచికిత్స ద్వారా కిడ్నీలో రాళ్ల సమస్యను చెక్ పెట్టవచ్చు కానీ.. కొందరిలో మాత్రం అది అంత త్వరగా క్యూర్ కాదు. అలాంటివారు ప్రతిరోజూ నారింజ పండ్లరసం తీసుకుంటే.. ఆ సమస్య నుంచి బయటపడవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

నిజానికి.. ఆపరేషన్ ద్వారా ఈ రాళ్లను తొలగించినప్పటికీ తిరిగి మళ్లీ అవి ఏర్పడుతూనే ఉంటాయి. అలాంటి సమయాల్లో నారింజ పండ్లరసం తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం. పొటాషియం సిట్రేట్ సప్లిమెంట్లు వాడడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు నివారించవచ్చు. కానీ.. ఈ సప్లిమెంట్లు కొందరిలో జీర్ణవ్యవస్థకు సంబంధించిన దుష్ప్రభావాలను కలిగించే అవకాశాలు చాలావరకు వున్నాయి. కాబట్టి.. ఈ సప్లిమెంట్ల కన్నా సహజసిద్ధమైన సిట్రేట్‌లు లభించే సిట్రస్ ఫలాలను తీసుకోమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అయితే మిగిలిన సిట్రస్ ఫలాల కన్నా నారింజపండ్లలోని సిట్రేట్లు మరింత సమర్ధవంతంగా పనిచేస్తాయని టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.

మూత్రం ఆమ్లత్వాన్ని తగ్గించడం ద్వారా ఈ సిట్రేట్లు రాళ్లు ఏర్పడడాన్ని పూర్తిగా నివారిస్తాయని ఆ అధ్యయనం నివేదికలో వెల్లడైనట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అంతేకాదు.. ఈ నారింజ పండ్లతో జీర్ణవ్యవస్థ మరింత మెరుగవడంతోపాటు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు. కాబట్టి.. ఈ పండ్లను రెగ్యులర్ డైట్ తోపాటు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : kidney stone  orange benefits  health tips  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more