The Healthy Foods Which Helps For Better Sleep | Health Tips | Healthy Home Remedies

Healthy foods helps for better sleeps home remedies health tips

health tips, healthy foods, sleep foods, foods for better sleep, sleeping foods, milk health benefits, oat meals health benefits, health foods for sleep, sleeping tips

Healthy foods helps for better sleeps home remedies health tips : There are some healthy foods are available which helps for better sleep at night times.

గాఢనిద్రకు ఉప్రకమించే ఫుడ్స్

Posted: 07/04/2015 12:25 PM IST
Healthy foods helps for better sleeps home remedies health tips

ప్రస్తుత బిజీ ప్రపంచంలో ప్రతిఒక్కరు నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. ఆఫీసు పనుల ఒత్తిడి, ఇంటి కార్యకలాపాలు, ఇతర ఆందోళనల కారణంగా హాయిగా నిద్రపోలేకపోతున్నారు. ఫలితంగా బరువు పెరగడం, ఆందోళన, అలసట చెందడం, ఏకాగ్రత లేకపోవడం, నిర్జీవం లేని జుట్టు, డార్క్ సర్కిల్స్, శరీరంలోని జీవక్రియలు సరిగా పనిచేయకపోవడం.. ఇంకా ఎన్నో రకాల సమస్యల్ని ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి.. రోజుకి కనీసం 8 గంటలపాటు నిద్రపోవాలి. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారు గాఢనిద్రకు ఉప్రకమించాలంటే.. కొన్ని హెల్దీ ఫుడ్స్ వున్నాయి. అవేంటో తెలుసుకుందామా..

* పాలు : మెదడును శాంతపరిచి నిద్ర కలిగించే నాడీ ప్రసారకాలు (న్యూరోట్రాన్స్ మీటర్), ట్రైటోపాస్ పాల ఉత్పత్తుల్లో వుంటాయి. కాబట్టి.. ఒక గ్లాసు పాలు  ప్రతిరోజూ రాత్రి సమయంలో తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం. పాలతో తయారైన అన్ని పదార్థాల్లోనూ నిద్రకు ఉప్రకమించే ట్రైటొఫాన్ ఉంటుంది.

* ఓట్ మీల్స్ : ఇందులో కరిగే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు వుంటాయి. అవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. ఇందులో వుండే పీచు కడుపు బాగా నింపి త్వరగా ఆకలి కాకుండా చేస్తుంది. కనుక వెన్నతీసిన పాలలో వీటిని వేసుకుని తింటే.. నిద్ర బాగా పడుతుంది.

* బాదం : ఇందులో మెగ్నీషియం పుష్కలంగా వుంటుంది. అది గాఢనిద్రకు ఉపక్రమించేందుకు దోహదపడుతుంది. అంతేకాదు.. కండరాలు రిలాక్స్ అయ్యేలా సహకరిస్తుంది. కాబట్టి నిద్రించే ముందు వీటిని ఒక స్పూన్ ఫుల్ గా తింటే.. గాఢనిద్రలో జారుకోవచ్చు.

* అరటిపండ్లు : ఈ పండ్లలో మెగ్నీషియం, పొటాషియం ఎక్కువ మోతాదులో ఉన్నాయి. ఇవి కండరాలకు విశ్రాంతినిచ్చి చక్కని నిద్రపట్టేలా చేస్తాయి. అలాగే అరటిలో వుండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో ప్రవేశించగానే సెరటోనిన్‌గా మారి ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే రాత్రిపూట ఈ పండ్లను తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది.

* స్వీట్ పొటాటో: ఇందులో కార్బోహైడ్రేట్స్, పొటాషియం అధికంగా వుంటాయి. అవి శరారాన్ని విశ్రాంతి పరచడంలో సహాయపడుతాయి. కాబట్టి.. నిద్రపోయే ముందు వీటిని తింటే.. గాఢనిద్రలో జారుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : health tips  healthy foods  sleeping foods  tips for better sleep  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more