ప్రపంచంలో జీవిస్తున్న మూగజీవరాశులు కూడా తమ పిల్లల సురక్షితం కోసం, ఆపదలనుంచి కాపాడుకోవడం కోసం జాగ్రత్తలు తీసుకుంటాయి. వాటి పిల్లలు పెరిగి పెద్దయ్యేంతవరకు తమవంతు సహాయాన్ని అందిస్తాయి. అంటే మూగజంతువులు కూడా తమ పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తాయని అర్థం.
‘‘నేడు మనం ఒక్క రూపాయితో కొన్న వస్తువు విలువ భవిష్యత్ లో ఎంత వుంటుంది..? అది మనకు ఉపయోగపడుతుందా..? దానివల్ల వచ్చే లాభం ఏంటి..? ప్రస్తుతం దాని అర్హత ఏంటి..?’’ అనే ఇటువంటి చిన్నచిన్న ప్రశ్నలు మనకు సర్వసాధారణం అవ్వచ్చు. అయితే వీటి గురించి మనం కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తే... అవి మన భవిష్యత్ నే కాదు.. రాబోయే తరాలవారి భవిష్యత్ ని కూడా మార్చేస్తాయి. ఈ ప్రశ్నల చుట్టే మన ఆర్థిక ప్రణాళికలు, పొదుపు, పెట్టుబడులు అనే అంశాలు ముడిపడి వున్నాయి కాబట్టి.
ప్రతి తల్లిదండ్రులు.. తమ పిల్లలు జీవితాన్ని తమకంటే ఎక్కువ అనుభవించాలని, ప్రతిక్షణం ఆనందంగా గడపాలని, వారి భవిష్యత్ సుఖసంతోషాలతో నిండాలని అనుకుంటారు. పిల్లలకు సంబంధించినంతవరకు ఉన్నత చదువులు, నాణ్యమైన వస్తువులు, వారి నిత్యావసరాలు తీర్చడం కోసం తల్లిదండ్రులు బాధ్యతగా చేస్తారు. అందరూ తల్లిదండ్రులు ఇటువంటి అంశాలలో సఫలం అవుతున్నారు.. కానీ గడుస్తున్నకాలంకొద్దీ మన నిత్యవసరాలు, మార్కెట్లో ధరలు హెచ్చు, తగ్గులుగా మారుతున్నాయి. దానికి సంబంధించిన ఆర్థిక ప్రణాళికలను, భవిష్యత్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలలో విఫలం అవుతున్నారు.
ప్రస్తుతకాలంలో ద్రవ్యోల్బణ భారం ఎలావుందో మనం ఒక్కసారి రెండుమూడేళ్ల క్రితం రోజులకు, ఇప్పటికీ వున్న మధ్య తేడా ద్వారా అర్థం చేసుకోవచ్చు. ప్రతిఒక్కరు ఆర్థిక పరిస్థితులలో ఇబ్బందులను ఎదుర్కొంటుండగా.. ద్రవ్యోల్బణం భారం మరీ ఎక్కువగా పెరిగిపోతోంది. భవిష్యత్ లో దీని ప్రభావం ఇంకా పెరగవచ్చు.
నేటి యంగ్ జనరేషన్ లో యువతీయువకులు ప్రతిఒక్కరు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి... వారు వారి పెళ్లికి కావాల్సిన ముందు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. తద్వారా వారి పుట్టబోయే పిల్లల గురించి, వారి భవిష్యత్ గురించి ఆర్థిక ప్రణాళికలను ముందే సిద్ధం చేసుకోవచ్చు.
ఇలా కుదరకపోతే... పెళ్లయిన తరువాత తమకు పుట్టబోయే పాప లేదా బాబు పుట్టగానే వారికి సంబంధించిన ప్రణాళికలు... అంటే చదువులు, నిత్యావసర వస్తువులు, వారి భవిష్యత్ మొదలైనవి ప్రారంభించుకుంటే భవిష్యత్ లో వారు ఆర్థికంగా నిలకబగా వుండే అవకాశం వుంటుంది.
పిల్లల భవిష్యత్ కోసం డబ్బును పొదుపు చేసుకునే కొన్ని మార్గదర్శక చిట్కాలు.....
పిల్లలు పుట్టిన 3 సంవత్సరాలవరకు వారికి కేవలం పోషణలో సమయం సరిపోతుంది. ఆ సమయంలో వారి చదువుల కోసం ఉపయోగపడే డబ్బును, అదేవిధంగా వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులకోసం డబ్బును మదుపు చేసుకునే మార్గాలు చాలానే వున్నాయి. పిల్లలకు సంబంధించి పొదుపు పథకాలు, బీమా పాలసీలు, చైల్డ్ మ్యూచువల్ ఫండ్ పథకాలు ప్రస్తుతకాలంలో చాలానే వున్నాయి. వీటిని జాగ్రత్తగా పరిశీలించుకున్న తరువాత మదుపు చేసుకుంటే చాలా మంచిది.
పిల్లలకు సంబంధించిన ఏదైనా ఒక పొదుపు ఖాతాను ప్రారంభించినప్పుడు... అందులో క్రమం తప్పకుండా డబ్బును జమ చేసుకుంటే చాలా మంచిది. మీరు సంపాదించే కష్టార్జితంలో మిగిలే కొంత డబ్బును అనవసర ఖర్చులు చేయకుండా పిల్లల పొదుపు ఖాతాలో జమ చేయడం చాలా ఉత్తమమైన నిర్ణయం. ఇటువంటి ఖాతాలలో రికవరింగ్ డిపాజిట్ చేసుకోవడం ద్వారా పిల్లలకోసం దీర్ఘకాలంగా డబ్బును పొదుపు చేసుకోవడానికి వీలుగా వుంటుంది.
తల్లిదండ్రులు తమ పిల్లల కోసం డబ్బును పొదుపు చేసుకుంటూ పెట్టుబడిని కూడా పెట్టాలనుకుంటే.. దానికి ప్రత్యేకంగా మ్యూచువల్ ఫండ్లను పరిశీలించుకోవచ్చు. ఈ ఫండ్లు ఈక్విటీ, డెట్ పథకాల్లో మదుపు చేయడం ద్వారా స్థిరమైన రాబడిని ఆర్జించేందుకు ప్రయత్నిస్తాయి. నష్టభయాన్ని భరించే సామర్థ్యం వున్నవాళ్లు ఇటువంటి పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. అయితే వీటిలో క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టేందుకు అవకాశం వుంటుంది. ఒకేసారి ఎక్కువ మదుపు చేయలేని వారికి ఇది ఎంతో ఉపయోగం.
పిల్లల భవిష్యత్ కోసం కొన్ని బీమా పాలసీలను కూడా తీసుకోవడం చాలా మంచిది. ఇందులో కొన్ని ప్రయోజనాలు కూడా వుంటాయి. పాలసీదారుడికి ఏమైనా జరిగితే.. మిగతా ప్రీమియాలు కట్టాల్సిన అవసరం వుండదు. అలాగే పాలసీ వ్వవధి అయినపోయిన తర్వాత నామినీగా వున్న పిల్లలకు ఆ మొత్తాన్ని చెల్లిస్తారు. వీటిని ఎంచుకోవడం ద్వారా మీరు ఎంతో కొంత మొత్తాన్ని మదుపు చేసుకోవచ్చు.
(And get your daily news straight to your inbox)
Jun 13 | మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ టీనేజ్. ఈ యుక్తవయస్సులో భవిష్యత్తు కార్యాచరణకు అవసరమయ్యే అన్ని సౌకర్యాలను కల్పించుకోవచ్చు. విందు - వినోదాలతోపాటు ప్రపంచ విజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వీలుగా వుండే ఈ వయస్సు... ప్రతి... Read more
May 06 | ప్రతిఒక్కరూ తమ జీవితంలో ఏదోఒకటి సాధించాలని అనుకుంటూ వుంటారు. తమ కెరీర్ తామే ముందుకు కొనసాగించాలనుకుంటారు. ఇతరులమీద ఆధారపడకుండా తమ సొంత ప్రణాళికలతో జీవన విధానాన్ని కొనసాగించాలని అనుకుంటారు. సొంతంగా వ్యాపారాలు లేదా పెట్టుబడులను... Read more
Apr 24 | ప్రస్తుతకాలంలో కార్పొరేట్ సంస్థల హవా చాలా జోరుగా సాగుతోంది. ప్రతిఒక్కరు ఇటువంటి పెద్ద కార్పొరేట్ కంపెనీలలో పనిచేయడానికి ఎక్కువ మక్కువ చూపుతారు. ముందుగా మహిళలు ఇటువంటి వ్యవహారాలలో చాలా ముందున్నారు. మగవారికి ధీటుగా ఆడవాళ్లు... Read more
Apr 22 | కొంతమంది యువకులు జీవితంలో ఏదో సాధించాలనే నెపంతో ముందుకు నడుస్తుంటారు. మరికొందరు జీవితంలో ఏది దొరికితే దానితోనే సంతృప్తిని పొందుతుంటారు. మరికొందరు విభిన్నంగా చేస్తున్న పనిలోను, ఉద్యోగంలోను ఒక మంచి ఉన్నత స్థానాన్ని పొందాలని... Read more
Apr 10 | ప్రస్తుతకాలంలో మహిళలు కూడా మగవారికి సమానంగానే గట్టిపోటీని ఇస్తున్నారు. వారు కూడా మగవారిలాగా ఆఫీసు పనులలో నిమగ్నమై విజయాలను సాధిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆఫీసు పని ఎక్కువగా వుండటం వల్ల తమ వ్యక్తిగత... Read more