స్థలం పురాణం

November 30,2013 12:10 PM
స్థలం పురాణం

మహారాష్ట్ర రాష్ట్రంలోని అహ్మద్ నగర్ జిల్లాలో వుండే నాశిక్ నుంచి 88 కిలోమీటర్ల దూరంలో షిర్డీ అనే ఒక పాత చిన్న గ్రామం వుండేది. అయితే.. ఎప్పుడైతే బాబా ఈ స్థలానికి విచ్చేశారో.. అప్పటి నుంచి ఇది భక్తులతో కిక్కిరిసిన యాత్రాస్థలంగా మారిపోయింది. సాయి బాబా పుట్టినిల్లుగా భావించి షిర్డిలో ఆయన అర్థ శతాబ్దం పైగా నివసించారు. బాబా పుట్టుపూర్వోత్తరాల గురించి స్పష్టంగా తెలియరావడం లేదు కానీ.. ఈ విషయమై జరిపిన కొన్ని అధ్యయనాల వల్ల బాబా షిరిడీ చుట్టుప్రక్కలే జన్మించి ఉండవచ్చుననీ భావిస్తున్నారు. ఈయన బాల్యనామం ‘హరిభావు భుసారి’ అయి వుంటుందని కొన్ని అభిప్రాయాలున్నాయి.

తన జన్మ, బాల్యాల గురించి బాబా ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు. ఎందుకంటే ఎక్కడ పుట్టాడో, పేరు ఏమిటో తెలిస్తే ప్రతి మనిషి ముందు వారి కులగోత్రాలు చూస్తారు.. వారిది ఈ మతం అని మనసులో నాటేసుకొంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే బాబా అందుకే తన గురించి ప్రస్తావన చేయలేదు. బాబా ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి.. ఒక ఫకీర్ సంరక్షణలో పెరిగినట్లు చెప్పారని కథనం ఉంది. మరొకమారు ఫకీరు భార్య తనను సేలుకు చెందిన వెంకోసా అనే గురువుకు అప్పగించినట్లు, తాను ఆయన వద్ద పన్నెండేళ్ళు శిష్యరికం చేసినట్లు చెప్పారట. ఈ రెండు కథనాల వలన బాబా పూర్వ జీవితం గురించి వివిధ అభిప్రాయాలున్నాయి.

ఇదిలావుండగా.. బాబా 16 ఏళ్ళ చిరుప్రాయంలో వున్నప్పుడు మొదటిసారి వేప చెట్టు క్రింద కనబడ్డారు. ఇక అక్కడి నుంచి మొదలు ఆయన అందరిని ఆకట్టుకుంటూనే వున్నారు. బాధాసర్ప ద్రష్టులైన పేద వారి అభ్యున్నతి కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. ఎప్పుడూ ‘సబ్ కా మాలిక్ ఏక్’ అంటూ తన జీవితం మొత్తం సర్వ మానవ సౌభ్రాతృత్వం, సర్వ మత శాంతి సందేశాలను బోధిస్తూ వుండేవారు. దీంతో ఈయనను ‘దేవుడి బిడ్డ’గా అభివర్ణించేవారు. ఆయనను శివుడి అవతారంగా కూడా నమ్మేవారు.

షిరిడీలో బాబా నివాసం :

1858లో చాంద్ పాటిల్ కుటుంబపు పెళ్ళివారితో కలిసి బాబా షిరిడీకి వచ్చారు. అక్కడ ఖండోబా మందిరం దగ్గర బాబా బండి దిగినప్పుడు మందిరం పూజారి మహాల్సాపతి "దయ చేయుము సాయీ" అని పిలిచాడు. తరువాత 'సాయి' పదం స్థిరపడి ఆయన "సాయిబాబా"గా ప్రసిద్ధుడయ్యారు. షిరిడీ ప్రాంతంలో సాము గరిడీలు, కుస్తీలు ప్రసిద్ధం. సాయి వేషధారణ కుస్తీ పహిల్వాన్‌లలాగా ఉండేది.

ఒకసారి 'మొహిదీన్ తంబోలీ' అనే వానితో కుస్తీ పట్టి ఓడిపోయిన తరువాత బాబాలో చాలా మార్పు వచ్చింది. సూఫీ ఫకీరులలాగా మోకాళ్ళవరకు ఉండే 'కఫనీ', తలకు టోపీలాగా చుట్టిన గుడ్డ ధరించడం మొదలుపెట్టారు. ఇలా ముస్లిం ఫకీరులా ఉండే బాబాకు స్థానిక హిందువులనుండి కొద్దిపాటి ప్రతిఘటన కూడా ఎదురయ్యింది. 1918లో తన మరణం వరకు సాయిబాబా షిరిడీలోనే ఉన్నారు.

Other Articles

  • Dharhan times

    Nov 30 | సాయిబాబా విగ్రహాన్ని దర్శింఛి ఆశీస్సులు పొందేందుకు భక్తులు సాధారణంగా తెల్లవారు ఝామునుంచే బారులు తీరుతారు. గురువారాల్లో రద్దీ బాగా వుంటుంది, ఆ రోజు ప్రత్యెక పూజ, బాబా విగ్రహ ప్రత్యెక దర్శనం వుంటాయి. మందిరం... Read more

  • Bus station

    శిరిడికి బస్ మార్గం

    Nov 30 | శిరిడి సాయి బాబా గుడికి దేశంలోని అన్నిప్రాంతాల నుండి రోడ్డు మార్గం కలదు. ఎ.పి.యస్.ఆర్.టి.సి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి బస్సు సౌకర్యం కలదు. ప్రెవేటు ట్రావెల్స్ బస్సుల సౌకర్యం కలదు.  నాశిక్, పూణే,... Read more

  • Railway station

    రైలు మార్గం

    Nov 30 | షిరిడి సాయి బాబా టెంపుల్ కు వెళ్లటానికి దేశంలోనా అన్నీ ప్రధాన నగరాల రైల్వే స్టేషన్ల నుండి రైళ్లు ఉన్నాయి. అయితే శిరిడి సాయి బాబా టెంపుల్ వద్దకు మాత్రం రైలు మార్గం లేదు.... Read more

  • Air port

    శిరిడి సాయి బాబా గుడికి విమాన మార్గం

    Nov 30 | శిరిడి సాయి బాబా గుడికి సమీప దగ్గరలో ఉన్న, ముంబాయి, ఔరంగబాద్, పూనే, నాసిక్ విమాశ్రయాలు కలవు. అయితే ముంబాయి ఎయిర్ పోర్టు నుండి శిరిడికి 260 కి.మీ., పూనే నుండి 185 కి.మీ.,... Read more

  • Sthala puranam

    శిరిడి సాయి బాబా దర్శన సమయం

    Nov 30 | మందిరంలో జరిగే కార్యక్రమాలు : - ఉదయం 4:00 గంటల సమయంలో ఆలయాన్ని తెరుస్తారు.- 4:15 గంటల సమయంలో భూపాలి కార్యక్రమం చేస్తారు.- ఉదయం 4:30 నుంచి 5:00 గంటలవరకు కకడ్ ఆర్తి నిర్వహిస్తారు.-... Read more