Vijayawada kanaka Durga Temple History | Hindu Temple

స్ధల పురాణం

May 11,2013 01:34 PM
స్ధల పురాణం

దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో బెజవాడలోని ఇంద్రకీలాద్రి మీద కొలువైవున్న కనకదుర్గమ్మ ఆలయం ఒకటి! అంతేకాదు... శ్రీ శక్తి పీఠాల్లో ఈ ఆలయం ఒకటి.

స్థల పురాణం :

పూర్వం ‘కీలుడు’ అనే యక్షుడు కృష్ణానది తీరంలో దుర్గాదేవి గురించి ఘోరమైన తపస్సు చేయసాగాడు. అతని తపస్సుకు మెచ్చిన అమ్మవారు అనుగ్రహించి.. ఓ వరం వరము కోరుకొమ్మని అడుగుతుంది. దాంతో ఆ యక్షుడు.. ‘అమ్మా నువ్వు ఎపుడూ నా హృదయ స్ధానంలో కొలువై వుండేలా వరం ప్రసాదించు’ అని కోరాడు. అదివిన్న అమ్మ చిరునవ్వుతో.. ‘సరే కీల.. నువ్వు ఎంతో పరమపవిత్రమైన ఈ కృష్ణానది తిరంలో పర్వతరూపుడవై ఉండు.. నేను కృతాయుగంలో అసుర సంహారం తరువాత నీ కోరిక చెల్లిస్తాను’ అని చెప్పి అంతర్ధానం అయ్యింది.

అమ్మవారు చెప్పిన మాటలకు సంతోషించిన కీలుడు పర్వతరూపుడై అమ్మవారి కోసం ఎదురుచూడసాగాడు. తర్వాత లోకాలను కబలిస్తున్న మహిషుణ్ణి వదించి.. కీలుడికిచ్చిన వరం ప్రకారం మహిషవర్ధిని రూపంలో దుర్గమ్మ కీలాద్రిపై వెలిసింది. తదనంతరకాలంలో ప్రతిరోజు ఇంద్రాద్రిదేవతలంతా అమ్మవెలిసిన ప్రాంతానికి వచ్చి.. దేవిని పూజించడం ప్రారంభించారు. దాంతో ఇది ఇంద్రకీలాద్రిగా పిలవబడింది. అమ్మవారు కనకవర్ణశోభితరాలై ఉండడం వల్ల అమ్మవారికి ‘కనకదుర్గ’ అనే నామం స్థిరపడింది.

మల్లికార్జునుడు కొలువైవున్న గాధ :

ఆ తరువాత ఇంద్రకీలాద్రిపై పరమేశ్వరున్ని కూడా కొలువుంచాలనే ఉద్దెశంతో బ్రహ్మదేవుడు శివుని గురించి శతాశ్వమేదయాగం చేశాడు. దీంతో సంతుష్టుడైన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ స్వరూపంతో వెలిశాడు. అలా వెలిసిన స్వామిని బ్రహ్మదేవుడు మల్లికదంబ పుష్పాలతో పూజించడం వల్ల స్వామికి మల్లికార్జునుడు అనే పేరు వచ్చిందని గాధ.

మరో పురాణగాధ ప్రకారం.. ద్వాపరయుగంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఇంద్రకీలాద్రిపై ఉగ్రతపస్సు చేయగా.. అతనని పరిక్షించడానికి శివుడు కిరాతకుడుగా వచ్చి అర్జునితో మల్లయుద్దం చేసి అర్జునుని భక్తుని మెచ్చి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. స్వామి ఇక్కడ మల్లయుద్దం చేశాడు కాబట్టి.. మల్లికార్జునుడిగా పిలవబడుతున్నాడు.

  Darshna samayalu
Bus station  

Other Articles

  • Darshna samayalu

    May 11 | ధర్మ దర్శనం : ఉదయం 4:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు భక్తులు దుర్గమ్మను దర్శించుకోవచ్చు. ఇందుకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ముఖమండపం : ఉదయం 4:00 నుంచి... Read more

  • Bus station

    May 11 | రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లేందుకు అనువుగా బస్సు మార్గాలున్నాయి. విజయవాడకు అన్ని ప్రాంతాల నుండి రవాణా సౌకర్యం కలదు.  ఇక హైదరాబాద్ నగరం నుంచైతే ఇంచుమించు ప్రతీ అరగంటకు ఓ... Read more

  • Railway station

    May 11 | సౌత్ సెంట్రల్ రైల్వేలోనే విజయవాడ రైల్వే జంక్షన్ అతి పెద్దది. కాబట్టి.. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చు. చైన్నై- హౌరా, చెన్నై- ఢిల్లీ వంటి పెద్దమార్గాల్లో... Read more

  • Air port

    May 11 | విజయవాడకు 20 కి.మీ. దూరంలోనే గన్నవరం ఎయిర్ పోర్టు వుంది. విమానమార్గం ద్వారా వచ్చేవారు ఈ ఎయిర్ పోర్టులో దిగి.. కేవలం 30 నిముషాల వ్యవధిలోనే దుర్గమ్మను దర్శించుకోవచ్చు. ఇక హైదరాబాద్ నగరంలో ప్రతి... Read more

Additional Info

  • Sub Title: Kanakadurga Temple
Last modified on Saturday, 11 May 2013 13:34