Bhavani deeksha viramana 2013

Bhavani Deeksha Viramana-2013, Bhavani Deeksha Viramana, Mandala Deeksha, Bhavani, deeksha devotees, Bhavani Deeksha festival, Ardha Mandala Deeksha, Kalasa Jyothi Uthsavam, Deeksha Viramana, Maha Poornahuthi,

Bhavani Deeksha Viramana-2013, Bhavani Deeksha Viramana

దుర్గ భవాని దీక్ష విరమణ-2013

Posted: 12/06/2013 09:14 PM IST
Bhavani deeksha viramana 2013

బెజవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ప్రారంభం అయ్యింది. దీంతో భారీగా భవానీ భక్తులు తరలి వస్తున్నారు. సుమారు 10 లక్షల మంది భక్తులు భవాని దీక్షలు విరమించే అవకాశం ఉంది. ఈ నెల 23 నుండి 27 తేదీన పూర్ణాహుతితో దీక్షల విరమణ ముగియనుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అధికారులు వాహనాలను మళ్లిస్తున్నారు. మరోవైపు దుర్గమ్మ సన్నిధికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రెవెన్యూ, పోలీసు, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పద్మావతి, సీతమ్మ వారి పాదాలు, కృష్ణవేణి, దుర్గ, పున్నమి, భవానీ ఘాట్లలో నదీ స్నానాలతోపాటు జల్లు స్నానాలకు కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. కెనాల్ రోడ్డులోని వినాయకుడి గుడి నుంచి ప్రారంభమై అమ్మవారి దర్శనం, ఇరుముడి సమర్పణ, హోమగుండం దర్శనం, ప్రసాదాల కౌంటర్, అనంతరం రథం సెంటర్‌కు చేరుకునేలా క్యూలైన్లు నెలకొల్పారు.

దుర్గ భవాని దీక్ష విరమణ ప్రారంభం.. ఐదురోజుల పాటు కొనసాగుతుంది. డిసెంబర్ 23-12-2013 నుండి 27-12-213 వరకు ఉంటుంది.

మండల దీక్ష ప్రారంభం         : 13-11-2013 టూ 17-11-2013

అర్థ మండల దీక్ష ప్రారంభం    : 03-12-2013 టూ 07-12-2013

కలశ జ్యోతి ఉత్సహం          : 16-12-2013

దీక్షలు విరమణ ప్రారంభం     : 23-12-2013 టూ 27-12-2013

మహాపూర్ణాహుతి             : 27-12-2013

భవానీ దీక్ష 

ఈ దీక్ష తీసుకున్న భక్తులు పౌర్ణమినాడు మొదలుపెట్టి మొత్తం 40రోజులపాటు మండల దీక్షగా కొనసాగించి నలభై ఒకటోరోజున విరమణ చేయాల్సి ఉంటుంది. అలాగే అర్ధమండల దీక్షలు. ఈ దీక్షలో భాగంగా మధ్యలో ‘కలశజ్యోతి’ అనే ఉత్సవాన్ని నగరం (విజయవాడ)లోని శివరామక్షేత్రం నుంచి ప్రారంభిస్తారు. అక్కడినుంచి వేలాది భవానీ భక్తులు తమ చేతుల్లో వెలుగుతున్న జ్యోతుల్ని పట్టుకుని గుడిమీదకు వచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ నలభై రోజుల దీక్షల్లోని ఆఖరిరోజుల్లో దేవస్థానం వారు లోకకల్యాణం కోసం పాంచాహ్నికంగా శత చండీయాగాన్ని నిర్వహిస్తారు. ఆఖరిరోజు ఈ యాగానికి పూర్ణాహుతి కార్యక్రమం చేసి, అనంతరం భక్తులందరి చేత దీక్షా విరమణ చేయిస్తారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vaikunta ekadasi 2013

    వైకుంఠ ఏకాదశి

    Dec 06 | వైకుంఠ ఏకాదశి కి తిరుమల తిరుపతి దేవస్థానం ముస్తాబవుతుంది. టిటిడి ఈవో శ్రీ ఎల్. వి సుబ్రమణ్యం టిటిడి అధికారులతో సమావేశం అయ్యారు. వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 23, వైకుంఠ త్వదశి డిసెంబర్ 24... Read more

  • Sri kanaka durga devi navaratri events

    విజయవాడ కనకదుర్గ నవరాత్రి అవతారాలు

    Apr 05 | దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా అఖిలాంధ్రకోటి బ్రహ్మండాలను కాపాడుతూ బెజవాడలోని ఇంద్రకీలాద్రిమీద కొలువై భక్తుల కోరికలు కోరించే తడవుగా వారి కొరికలను తీర్చుతున్న అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆదిపరాశక్తి కనకదుర్గమ్మ తల్లి.కనకదుర్గ... Read more

  • Padmavathi ammavari brahmotsavam

    పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

    Apr 03 | తిరుమల శ్రీవాలి బ్రహ్మోత్సవాల తరహాలో పద్మావతీ దేవి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. నవంబర్ 28వ తేదీ విష్వక్సేనుని ఊరేగింపు జరుగనుంది. 29వ తేదీ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.... Read more

  • Tirumalesuni brahmotsavalu

    Sep 25 | తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన సోమవారం ఉదయం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. సప్తాశ్వాలపై భానుడు రథసారధిగా ఎర్రటి పూలమాలలు ధరించి స్వామి ఈ వాహనం మీద ఊరేగారు. ప్రపంచానికి వెలుగు ప్రసాదించే... Read more

  • Vijayawada kanakadurga

    Sep 25 | ధర్మాన్ని రక్షించేందుకు, పాపాత్ములను శిక్షించేందుకు నేను ఐదువేల ఏళ్ల తర్వాత వీరభోగ వసంతరాయలుగా తిరిగి అవతరిస్తారు. ఇంద్రకీలాద్రిపై వెలసిన దేవదేవి శనివారం అష్టమ తిథినాడు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తోంది. శరన్నవరాత్రుల్లో భాగంగా.. అమ్మవారిని దుర్గమ్మ... Read more