
కలెక్షన్ కింగ్ కు మళ్లీ కోపం వచ్చింది. ఈసారి ఏకంగా బ్రాహ్మణులపై కామెంట్ చేయటం విశేషం.మంచు వారికి ఈ సంవత్సరంలో ఆర్థికంగా అనేక దెబ్బలు తగిలాయి. డాక్టర్ మోహన్ బాబు కొడుకులు తీసిన సినిమా 2012 లో పెద్ద విజయం సాధించాలేదు. అయితే చివరకు ‘దేనికైన రెఢీ’ తీసిన సినిమా కొంచెం మంచు కుటుంబంలో ఆనందం నింపింది. ఆ ఆనందం పై నీళ్లు చల్లటానికి బ్రాహ్మణులు రెఢీ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో బ్రాహ్మణుల్ని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నయాంటు మోహన్ బాబు ఇంటి ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. అయితే ఈ బ్రాహ్మణులపై ఆ చిత్ర నిర్మాత అయిన నటుడు మోహన్ బాబు ఫైర్ అయినట్లు తెలుస్తోంది. ‘ నా ఇంటి ముందు ధర్నా చేసే బ్రాహ్మణులంత కిరాయి బ్రాహ్మణులే అని మోహన్ బాబు చెప్పినట్లు తెలుస్తోంది. వేదం చదివిన బ్రాహ్మణలెవరు ‘దేనికైనా రెఢీ’ సినిమాలో బ్రాహ్మణులను కించపరిచామని అనుకోరని మోహన్ బాబు అంటున్నారు. మోహన్ బాబు ఆయన కుమారుడు నెల్లూరు జిల్లాలోని సూళ్లురు పేటలో చెంగాళ్లమ్మ అమ్మవారి దర్శనం కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో తన ఇంటి ముందు బ్రాహ్మణులు ధర్నా చేసిన విషయాన్ని తెలుసుకోవటం జరిగింది. అయితే ఆ సమయంలో ఆయన నా ఇంటి ముందు ధర్నా చేశారా? నాకు తెలీదే .. వారు నిజమైన బ్రాహ్మణులై ఉండరు అని చెప్పటం జరిగిందని మీడియా వారు అంటున్నారు. నేను ఉండుంటే చందా ఇచ్చి పంపేవాణ్ని అని మోహన్ బాబు మాట్లాడినట్లు మీడియా వారు అంటున్నారు. అయితే చివరిగా తనకు అన్ని కులాలు ఒక్కటేనని ..ఎన్టీఆర్ లా తాను అన్నీ కులాలనూ ప్రేమిస్తానని మోహన్ బాబు చెప్పినట్లు మీడియా వారు అంటున్నారు.