20 Jun Thursday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • kcr.gif

    Oct 30 ,2012 04:17 pm

    kcr serious deadline for telangana again

    కేసిఆర్ అనే పేరు వింటే చాలు ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్న రాజకీయ నాయకుడు. అంతేకాకుండా డెడ్ లైన్ పెట్టడంలో  కేసిఆర్ తరువాతనే ఎవరైన. ఆయన వేదికపైకి వచ్చి డెడ్ లైన్ పెడితే చాలు .. తెలంగాణ ప్రజలు ఉద్యమం చప్పుళ్లు ఆగిపోతుంది. ఆయన చెప్పిన ఎన్నో డెడ్ లైన్లను దాటి తెలంగాణ ఉద్యమం ముందుకు పోయింది.  ఇప్పుడు తెలంగాణ ప్రజలకు రెండు విషయాలు బాగా అర్థమైనట్లు తెలుస్తోంది. ఒకటి డెడ్ లైన్ మామ, డెడ్ లైన్ అల్లుడు. మొన్నటి వరకు దసర తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు  తీపి కబురు చెబుతుందని కేసిఆర్ డెడ్ లైన్ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పటం తెలిసిన విషయమే. అయితే దసర పండుగ రాను వచ్చింది. పోను పోయింది. కానీ డెడ్ లైన్  ప్రకారం తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు రాలేదు.  ఈ సారి కేసిఆర్ డెడ్ లైన్ తెలంగాణ ప్రజలు, నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు ,కారాలు , మీరియాలు నూరుతున్నారు. కేసిఆర్ మరోసారి డెడ్ లైన్ అంటే  వారి ఆవేశం మరో కొత్త ఉద్యమంగా పుట్టేవిధంగా ఉందని తెలంగాణ రాజకీయ నాయకులు అంటున్నారు.  కేసిఆర్ మాత్రం సైలెంట్ గా మౌనం పాటిస్తూ.. ఫామ్ హౌస్ లో మొక్కలకి నీరు పెట్టడం అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది.

    kcr serious deadline for telangana again

    కేసిఆర్ మనసులో 2009 డిసెంబర్ 9 నాటి రోజులు మళ్లీ తెరపైకి తెచ్చే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే కేసిఆర్ మళ్లీ ఆమరణ నిరహారదీక్ష చెయ్యటానికి సిద్దమైనట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పుడు కేసిఆర్ నోట డెడ్ లైన్ మాట రాకుండా ఉంటే మంచిదని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారట.  అసలు కాంగ్రెస్ పార్టీని నమ్మోద్దు అని కేసిఆర్ కు తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకులు చెప్పటం జరిగింది. అయిన కేసిఆర్ మాత్రం కాంగ్రెస్ పై నమ్మకంతో డెడ్ లైన్లు పెడుతున్నాడని టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. తెలంగాణ నాయకులు అందరు కలిసి కేసిఆర్ ఇంటికి వెళ్లుతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ ఒకటి పై చర్చలు జరిపేందుకు తెలంగాణ నాయకులు కేసిఆర్ తో బేటీ అవుతున్నట్లు టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.

              
Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers